Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మళ్లీ పెరిగిన కొత్తకేసులు


24 గంటల్లో 40వేలు నమోదు
460 మంది మృతి : రికవరీ రేటు 97.51 శాతం
న్యూదిల్లీ: దేశంలో కరోనా కేసుల నమోదులో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఎప్పటిలాగే మంగళవారం తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెరిగింది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 41,965 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇందులో రెండొంతులకు పైన కేసులు ఒక్క కేరళలోనే నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. ఆ రాష్ట్రంలో 30,203 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.28కోట్లు దాటింది. ఇక 24 గంటల వ్యవధిలో 33,964 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3.19కోట్ల మందికి పైనే కరోనాను జయించారు. రికవరీ రేటు 97.51శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 460 మంది కరోనాతో మృతిచెందారు. ఇందులో 115 మరణాలు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో 4,39,020 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులు పెరగడంతో క్రియాశీల కేసులు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,78,181 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల కేసుల రేటు 1.15శాతంగా ఉంది. కాగా, టీకా పంపిణీలో భారత్‌ మరోసారి రికార్డు సృష్టించింది. ఆగస్టు 27న తొలిసారి 24గంటల్లో కోటి డోసులకు పైగా పంపిణీ చేయగా, 31న ఆ రికార్డును తిరగరాసింది. మంగళవారం దేశవ్యాప్తంగా 1.33కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. దీంతో ఇప్పటి వరకు 65.41 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది. ఇక ఇప్పటి వరకు 50కోట్ల మందికి తొలి డోసు పూర్తిచేయడం విశేషం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img