London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

నిజం బతికే రోజులు రావాలి!

అబద్దందర్జాగా బతికి ఏదో ఒకరోజు ఛస్తుంది. నిజం రోజూ ఛస్తూ, ఏదో ఒకరోజు బతికి భవిష్యత్తులో చరిత్రగా మారుతుంది. అటు తర్వాత అది అనునిత్యం బతుకుతుంది. శాస్త్రీయ దృక్కోణం లేని సాహితీవేత్తలు, కళాకారుల వల్ల సమాజానికి జరిగే మేలు కన్నా కీడే ఎక్కువ! ఒకప్పటి పురాణ రచయితల వల్ల ఆధునిక సమాజంకూడా ఎలా అతలాకుతలం అవుతుందో గమనించండి. 8,800 శ్లోకాలతో వ్యాసుడు రాసిన ‘జయం’ అనే ఒక కట్టుకథను, వైశంపాయనుడు 24 వేల శ్లోకాలకు పెంచాడు. దానికి ‘భారతం’ అని పేరు పెట్టాడు. కొంత కాలానికి దానికీ మరో 76 వేల శ్లోకాలు జోడిరచి, ఆ గ్రంథాన్ని లక్ష శ్లోకాలకు విస్తరించాడు. అప్పుడు దాన్ని ‘మహా భారతం’ అని అన్నాడు. ఆ తర్వాత ఆ కథలో అనేక ప్రక్షిప్తాలు చేరిపొయ్యాయి. అందుకే మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే ‘మహా భారతం’ చారిత్రక గ్రంథం కాదుకాలేదు. పైగా పురాణాల ద్వారా హిందూ ధర్మం మనకిచ్చిన వరాలు కొన్ని ఉన్నాయి. అవి, బాల్య వివాహాలు, సతీ సహగమనం, వైధవ్యం, జోగినీ వ్యవస్థ, వరకట్నం వగైరా. ఇవి స్త్రీలను అణిచి పెట్టడానికి ఎంతగా ఉపకరించాయో అందరికీ తెలుసు. ఇక కులవ్యవస్థ, అంటరానితనం, బలులు, కన్యాశుల్కం, ఇతర మూఢ నమ్మకాలు ఎన్నో, ఎన్నెన్నో ఇవన్నీ గొప్పతనాలా? సంస్కృతీ సంప్రదాయాల పేరిట కొనసాగించిన మూఢ నమ్మకాలా? ఇవి వరాలా? లేక శాపాలా? ఇంగిత జ్ఞానంతో ఎవరికి వారే ఆలోచించుకోవాలి! మారుతున్న కాలాన్ని, జరుగుతున్న వైజ్ఞానిక ప్రగతిని గమనించకుండా పురాణాలకు అనుగుణంగా ఆధునిక వ్యవస్థ ఉండాలను కోవడం బుద్ధి తక్కువ. ఆధునికంగా జీవిస్తూ, వేల ఏళ్ల నాటి విలువల్ని ప్రతిష్టించుకోవాల్సిన అవసరాన్ని కొందరు ‘చదువుకున్న నిరక్షరాస్యులు’ నొక్కి చెపుతుంటారు. ప్రజలు అలాంటి వారి నోళ్లు మూయించాలి! ‘చదువుకున్న అవివేకులు’ తమ ఇళ్లలో పెళ్లిళ్లు జరిగితే, సీతారాముల పెళ్లిలోని తలంబ్రాల ఘట్టం పెళ్లి పత్రికల్లో ముద్రించుకుంటున్నారు. కొత్త జంటను సీతారాముల్లా వర్థిల్లమని దీవిస్తున్నారు. భజంత్రీలను సీతారాముల కళ్యాణం పాటలు వాయించమంటారు. ప్రేమకు, అన్యోన్యతకు ప్రతినిధులై సీతారాముల జంట ఉన్నట్టు రామాయణంలోనే లేదు. ‘అమ్మో సీత కష్టాలు’ అనే పదం ఈనాటికీ వాడుకలో ఉంది. కొత్త జంటల్ని సీతారాముల్లా ఉండమనడం ఏమైనా తెలివిగల పనా? ఒక్కసారి ప్రజాకవి వేమన పద్యాలు తిరగేస్తే అసలు నిజాలు తెలుస్తాయి.
కనక మృగము భువిని కద్దు లేదనకుండ/తరుణి విడిచిపోయే దాశరథియు
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?/విశ్వదాభిరామ వినుర వేమ.
వెర్రికుక్కలవలె వేదములు చదివేరు/అన్వయంబు నెరుగరయ్య వార్లు
వేద విద్యలెల్ల వేశ్యల వంటివి ॥విశ్వ॥
తల్లితో రమించె తండ్రి యజ్ఞము చేసి
తనయుడట్లె రంభ తనం గూడె/తల్లిని రమింత్రు దబ్బుర విప్రులు ॥విశ్వ॥
వేదాలు, పురాణాలు పాత సంస్కార హీనంగా రాయబడ్డాయన్నది వేమనే కాదు, ఆయన తర్వాత కూడా హేతువాద రచయితలు ఎత్తి చూపు తూనే ఉన్నారు. దేవుడి పేరుతో, భక్తి పేరుతో గుడ్డిగా విశ్వసించేవారువారి విశ్వాసాల్లో వారు ఉండొచ్చు. కానీ, విశ్వాసాల్లో లేనివారిని, హేతుబద్ధంగా విశ్లేషించుకునే వారిని బూతులు తిట్టే అర్హత వారికి ఉండదు. వారి వాదనని వారు సంస్కారవంతంగా వినిపించొచ్చు. బూతులు తిడితే తాము సంస్కార హీనులమని వారికి వారే ఢంకా బజాయించుకున్నట్టు. మత బోధకులు ఏం చేశారూ? సహాయపడిన వారికి కృతజ్ఞతలు చెప్పడం కూడా నేర్పించలేదు. పైగా మనుషుల్ని అవమానపరిచే పదం నేర్పారు. ‘‘దేవుడి దయ వల్ల’’ అని అనమన్నారు. కృతజ్ఞతా భావం ఉంటే అది సహాయపడిన వారికే నేరుగా వ్యక్తం చేయాలి కదా?మనుషుల్ని మనుషులుగా ఎప్పుడు గుర్తించారు గనక? అయినా సహాయపడ్డవాడికీ, సహాయం తీసుకున్నవాడికీ మధ్య దేవుణ్ణి ఎందుకు జొప్పించారో దాని వెనక జరిగిన కుట్ర ఏమిటో అర్థం చేసుకుంటే మంచిది. అబద్దాన్ని నిలబెట్టాలనుకునే వారికీ, నిజాల్ని ప్రకటించే వారికి పొసగదు. తటస్థంగా ఉండేవారంతా ఆలోచించుకోవాలి. దేన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. అబద్దం వైపు భ్రమల వైపు ఉన్నవారు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. ఆ అబద్దపు పవిత్ర గ్రంథాల ప్రభావం సమకాలీన సమాజంపై ఎలా పడుతూ ఉందో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
హైదరాబాదు బంజారా హిల్స్‌లో ఓ తండ్రి ఘోరంఉన్నట్టుండి ఇంటి నుండి చిన్న కూతురు మాయమైంది. పోలీసులకు రిపోర్టిచ్చారు. వారు ఆచూకి తీసి, అమ్మాయిని వెతికి ఇంట్లో అప్పగించారు. అప్పుడు చిన్న కూతురు తను పారిపోవడానికి కారణం చెప్పింది. తన తండ్రే తన మీద అఘాయిత్యం చేస్తున్నాడని! అది విని ఇంట్లోంచి పెద్ద కూతురు కూడా ముందుకొచ్చి పోలీసుల ముందు అదే విషయం చెప్పింది. అంటే ఆ తండ్రి తన ఇద్దరు కూతుళ్లపై ఒకరికి తెలియకుండా మరొకరిపై అఘాయిత్యం చేస్తున్నాడని తేలింది. ఒకే ఇంట్లో అక్కాచెల్లెళ్లిద్దరూ వారి తండ్రి వల్లే చితికిపోయారని పోలీసులు తేల్చారు. నిందితుణ్ణి అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇది 2021 జనవరి 19 నాటి సంఘటన. మానవ వాదులు ఎన్నడూ ఇలాంటి సంఘటనల్ని సమర్థించరు. అక్రమ సంబంధాలతో రాసిన మత గ్రంథాల్ని అర్ధ నిమిలిత నేత్రాలతో విని పరవశించిపోయేవారే ఆలోచించాలి. అర్ధరహితమైన వ్యాఖ్యలుచేయడంలో మత గురువులు ఎప్పుడూ ముందుంటారు. ‘‘బహిష్టు సమయంలో వంట చేసే మహిళ మరు జన్మలో వావి వరుసలు లేని వ్యభిచారిగా పుడుతుంది’’ అని అన్నాడు స్వామి కృష్ణాస్వరూప్‌దాస్‌. జీవశాస్త్ర పరంగా బహిష్టు అంటే ఏమిటో అతనికి అవగాహన లేదు. మరుజన్మ గురించి అవగాహన లేదు. వ్యభిచారాన్ని ఎవరు పెంచి పోషించారో అవగాహన లేదు. నోరుంది కదా వినే బకరాలున్నారు కదా అని ఏదో ఒకటివాగడం ఎంతవరకూ సబబూ? ‘‘ఓరేయ్‌ నీ తల్లి బహిష్టు సమయంలో కూడా చిన్నప్పుడు నీకు పాలిచ్చిందిరా మనువాదీ!’’ అని చెప్పాల్సిన వాళ్లు చెప్పాలి కదా? లేకపోతే అతని అజ్ఞానాన్నే గొప్ప జ్ఞానంగా భావిస్తూ ఉంటాడు.
వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img