Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పెరిగిన దిల్లీ ప్రజల కష్టాలు

జ్ఞాన్‌ పాఠక్‌

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మార్చి 21న జైలులో పెట్టిన నాటి నుంచి ప్రజల కష్టాలు పెరిగాయి. దిల్లీలో ఆప్‌ నాయకుడు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కేంద్ర వేధింపులు పెరిగాయి. జైలు నుంచే పాలన సాగిస్తున్న కేజ్రీవాల్‌ పంపిన ఫైళ్లు సజావుగా పరిశీలించడంలేదు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా పరిపాలనను సక్రమంగా సాగనివ్వడంలేదు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఎలాంటి సందేశాలు పంపినా, పాలనా వ్యవహా రాలకు సంబంధించిన అంశాలు కూడా ప్రజలకు తెలియకుండా చేస్తున్నారు. మంత్రివర్గం ఐక్యంగా ఉంటూ కేజ్రీవాల్‌ లేనిలోటు తెలియ కుండా పాలించాలని చూస్తున్నారు. అయితే అధికార యంత్రాంగం మంత్రుల మాట వినకుండా ఇబ్బంది పెడుతున్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వెనక ఉండి చేసే సూచనలకు అనుగుణంగా నడుచుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేయకపోవటంతో పాలన నత్తనడకన నడుస్తోంది. ఆప్‌బీజేపీ ఒక పార్టీపై మరొకటి నిందలు వేసుకోవడం తోనే సరిపోతోంది. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆదేశాలను పట్టించుకోక ోవడమనేది కొత్త అంశమేమీ కాదు. గత సంవత్సరం డిసెంబరులో సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పనిచేయ కుండా చేయడం కుదరదని తీర్పుచెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్‌సీటీ దిల్లీ (సవరణ) చట్టం 2021 అమలులోకి వచ్చిన తర్వాతకూడా అధికార యంత్రాంగం దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పరిధిలో ఉన్నది. ఎన్నికైన ప్రభుత్వం పరిధిలో అధికార యంత్రాంగం ఉండకుండా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పరిధిలో నడుస్తున్నది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కల్పిస్తున్న ఆటంకాల మూలంగా ఆప్‌ ప్రభుత్వం అనేకసార్లు సుప్రీంకోర్టుకు వెళ్లవలసి వచ్చింది. అధికార యంత్రాంగం వైఖరిని సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. అయినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేదు. దిల్లీ జల్‌బోర్డుకు 1927కోట్ల రూపాయలు చెల్లించేందుకు అసెంబ్లీ ఆమోదం తెలియజేసింది. 202324 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ డబ్బు చెల్లించవలసి ఉంది. గడువు ముగిసినప్పటికీ డబ్బును రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి విడుదల చేయలేదు. రాష్ట్రప్రభుత్వ ఫిర్యాదుపై ఏప్రిల్‌ 1వ తేదీన, సుప్రీంకోర్టు జల్‌బోర్డుకు చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లించాలని ఆర్థిక కార్యదర్శి నోటీసు జారీ చేసింది. చెల్లించవలసిన తేదీ మార్చి 31 అయితే ఇంకా డబ్బు విడుదల చేయలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పరిద్వాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారాలతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు సంబంధంలేదని తీర్పుచెప్పారు.
నీటి సరఫరా అత్యంత ప్రాధాన్యతతో కూడిన విషయం. నగరం మొత్తం నీటికోసం దిల్లీ జల్‌బోర్డుపై ఆధారపడిఉంది. అదే సమయంలో దిల్లీ జల్‌బోర్డు నిధులు లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దిల్లీ ప్రజలందరికీ శుభ్రం చేసిన నీటిని జల్‌బోర్టు సరఫరా చేస్తుంది. నీటి సరఫరాపైన దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ పార్టీ తీవ్రమైన కృషిచేస్తూ ప్రజల అదరణ పొందుతున్నది. ప్రజలకు సంబంధించిన ఇతర పథకాలు ముఖ్యంగా వైద్యం, విద్యుత్‌, విద్య ఇంకా ఇతర అనేక సమస్యలపైన ఆప్‌ ప్రభుత్వం చేసిన కృషి అద్భుతమన్న ప్రశంసలు వచ్చాయి. గత రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఆప్‌ గెలిచి రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ప్రజల మన్ననలు పొందింది. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలుచేస్తూ ప్రచారం సాగించారు. ప్రధాని ప్రచారం చేసినప్పటికీ బీజేపీ ఓటమిపాలైంది. కొంతమంది ఆప్‌ మంత్రులను కూడా మోదీ ప్రభుత్వం అరెస్టులు చేయించింది. కేజ్రీవాల్‌ ప్రభుత్వం పాలనా నిర్వహణ అధ్వాన్నంగా ఉందని ప్రచారం చేయడం కోసమే ప్రధాని ఆప్‌ నాయకులను వేధిస్తున్నారు. చివరకు ప్రభుత్వం సరిగా నడవకుండా అధికార యంత్రాంగం ఆటంకాలు కల్పించడం వెనుక బీజేపీ ఉన్నది. కేజ్రీవాల్‌ మార్చి 24న జైలునుంచే పంపిన మొదటి ఉత్తర్వులో నీటికోసం జనం ఇబ్బందిపడకుండా చూడాలని కోరారు. ఈ సమస్య చాలా తీవ్రమైనందున నీటి సరఫరాకు అనుగుణంగా కేజ్రీవాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దిల్లీ కేబినెట్‌ నాయకురాలు అతీషి మర్లేనా మాట్లాడుతూ, నీటి సమస్యను ముందుగా తీర్చాలని అలాగే నగరంలో నీటికి సంబంధించిన ఇతర సమస్యలు కూడా ఉన్నాయని కేజ్రీవాల్‌ తనకు పంపిన లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. దిల్లీ పాలనాయంత్రాంగం ఎలా ఉందో చెప్పడానికి నీటి సమస్యే ఉదాహరణగా అతీశి తెలిపారు. ఆప్‌పైన బీజేపీ ద్వేషంతో అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నదని దీని వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు.
ఎన్నికైన ప్రభుత్వానికి అధికార యంత్రాంగం సహకరించకపోవడం పదేపదే జరుగుతోంది. ఆప్‌ను శత్రువులాగా చూస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకు కారణమైందని ప్రజలు కూడా గ్రహించారు. అందువల్లనే రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిరచి ఆప్‌ను గెలిపించారు. ఇక తాజాగా జైలునుంచి కేజ్రీవాల్‌ పరిపాలించవచ్చునా లేదా అనే అంశం వివాదాస్పదమైంది. అరెస్టు అయినందున కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని బీజేపీ ఒత్తిడిచేస్తోంది. అయితే జైలునుంచి ప్రభుత్వాన్ని నడపకుండా నివారించాలన్న చట్టం ఎక్కడా లేదని దిల్లీ హైకోర్టు తన ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఆ రోజు నుంచీ దిల్లీ ప్రభుత్వం పాలనకు సంబంధించిన ఫైళ్లు ఒక అధికారి నుంచి మరొక అధికారికి చేరడానికి కూడా ఎక్కువ సమయం పడుతోంది. అంటే ప్రభుత్వాన్ని యంత్రాంగం కావాలనే ఇబ్బంది పెడుతోంది. జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆప్‌ కలిసి పోటీచేయాలని ఒప్పందం కుదుర్చుకున్న నాటినుంచి మోదీ ప్రభుత్వానికి మరిన్ని కష్టాలు కలుగచేయడానికే నిర్ణయించు కున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ దిల్లీలో ఓడిపోవడం ఖాయమని కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తర్వాత అనేక విశ్లేషణలు వస్తున్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో దిల్లీలో ఏడు లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుచుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img