London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Monday, October 21, 2024
Monday, October 21, 2024

పేదరిక నిర్మూలన కొలతలపై ఆహార భద్రత ప్రభావం

గత కొన్ని రోజులుగా భారత కార్పొరేట్‌ మీడియా దాని తోకలు భారత దేశంలో పేదరికం పూర్తిగా నిర్మూలన అయిందని, రెండు శాతానికి దిగువకు యీ సంఖ్య గత పదేళ్ళ ఆర్థిక విధానాల కారణంగా తగ్గిపోయింది అని ప్రచారం మొదలుపెట్టింది. ఇదో పెద్ద వింత. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రభావం దేశ ప్రజలను అభివృద్ధి వైపు నడిపిస్తుంది అనటానికి యిదే నిదర్శనం. దేశ విదేశాల్లో వున్న ఆర్ధిక శాస్త్రవేత్తలు, ప్రచారకులు దీనిపై పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు, టీవి డిబేట్‌లు నిర్వహిస్తున్నారు ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి పాలక పార్టీ నిజంగానే తమ కిరీటం లో కలికితురాయిగా ప్రచారం చేసుకుంటుంది. ఇది నిజమేనా! పేదరికం అన్న భావనను 1889 లో సామాజిక శాస్త్రవేత్తయిన ఇంగ్లండ్‌కు చెందిన చార్లెస్‌ బూత్‌ మొదటిసారిగా ఇలా పేర్కొన్నాడు. అతని ఉద్దేశంలో మనిషి బ్రతకటానికి భౌతికంగా సామర్ధ్యంగా పనిచేయడానికి కావలసిన కనీస అవసరాలు లేకపోతే పేదరికం వున్నట్లే. ఈ సమస్యను ఆర్ధిక శాస్త్రవేత్తలు ముఖ్యంగా భారత దేశంలోని ప్లానింగ్‌ కమిషన్‌ లో వున్న కొంతమంది 1962 లో ఒక వర్కింగ్‌ గ్రూప్‌గా ఏర్పడి నాటి మన దేశ పేదరికంపైన, దాన్ని తగ్గించే వ్యూహాలపై చర్చించారు. వారి ఉద్దేశంలో నాటికి సగటున నెలకు రూ.20, గ్రామీణ ప్రాంతంలో రూ.25 పట్టణ ప్రాంతంలో బ్రతకటానికి అవసరం అని తేల్చారు. అప్పట్లో అది పెద్ద సంచలనం. రామమనోహర లోహియా పార్లమెంటులో నెహ్రూను దుయ్యబట్టడానికి కొన్ని వివరాలతో సంచలనం సృష్టించిన విషయం పత్రికల్లోను, నాటి రాజకీయ వేత్తల మధ్య చర్చకు దారి తీసింది. పేదరికాన్ని ఒక ఆర్ధిక, సామాజిక సమస్యగా గుర్తించి దానిపై పరిశోధన చేసిన వారు వి.యమ్‌. దండేకర్‌, రత్‌ అన్న ఆర్థిక శాస్త్రవేత్తలు 1971 లో ప్రచురించిన పేదరికంపై పరిశోధన చాలా చర్చలకు దారి తీసింది. ప్రధానంగా వీరు మొదటిసారి మనిషి పని చేయటానికి కావలసిన శక్తి కేలరీలలోకి మార్చి, దానికి కావలసిన ఆదాయాన్ని గణించారు. వారి ఉద్దేశం ప్రకారం నెలకు సగటున గ్రామీణ ప్రాంతంలో రూ.171లు, పట్టణ ప్రాంతంలో రూ.271.70 1960-61 ధరల ప్రకారం వుండాలని ప్రకటించారు. అప్పుడు మొదలయిన చర్చ యిప్పటికీ కొనసాగుతోంది. అది రాజకీయ పార్టీల మేనిపెస్టోలలో చేరిపోయింది. ఇందిరా గాంధీ పెద్ద స్లోగన్‌ ‘గరీబీ హటావో, పేదరిక నిర్మూలన’ అంటూ ప్రచారం చాలాకాలం కొనసాగించి అధికారంలో కొనసాగారు. పేదరిక నిర్మూలన కాదు గాని, గరీబుల నిర్మూలన జరుగుతోందని ప్రతిపక్షం వేళాకోళం చేయటం చూశాం. అయితే దీనికంతటికీ కారణం ప్రభుత్వాలు పేదరికం నిర్మూలించాలనే చిత్తశుద్ది లేకపోవడం. దానికి కావలసిన వనరుల సమీకరణ పెట్టుబడిదార్లను, భూస్వాములను నియంత్రించి ప్రజలకు కావలసిన అవసరాలను తీర్చే మెరుగైన ఆర్ధిక విధానాలు చేపట్టక పోవటం. అందుకు రాజకీయ నాయకుల మద్దతు లేకపోవడం. అదే కాలంలో కేరళలో పేదరిక నిర్మూలన చేబట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలను యివ్వటంతో చర్చ ఆర్ధిక, సామాజిక శాస్త్రాలను దాటి రాజకీయ వేదికల మీదకు మళ్ళింది. ఇంతలో ప్రపంచ బ్యాంక్‌ ప్రవేశించి పేద దేశాల్లో పేదరిక నిర్మూలనకు మా వద్ద మందుంది. మీ ఆర్ధిక ఆస్థులన్నీ ప్రైవేట్‌ పరం చేసేయండి, ఆర్ధిక నియంత్రణ నుండి ప్రభుత్వ తప్పుకుంటే పేదరికం దానంతట అదే మాయమై పోతుంది అన్నారు. 1991లో నాటి ఆర్ధిక సమస్యల దృష్ట్యా పి.వి.నరసింహారావు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు వద్ద అప్పుతెచ్చి దేశాన్ని అగ్ర రాజ్యాలైన అమెరికా వంటి వ్యవస్థలతోను వాషింగ్టన్‌ కన్సెస్‌ అనే ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాలు చేబట్టారు. అయినా పేదరిక నిర్మూలన సగటు శాతం గతం కంటే ఎక్కువగా తగ్గలేదు. అంటే ముందు ఏడాదికి సుమారు ఒక శాతం తగ్గితే ప్రపంచ బ్యాంకు విధానాల ద్వారా కూడా అంతకంటే ఎక్కువ తగ్గలేదు. దీనిపై వేల పేజీల్లో పరిశోధనా వ్యాసాలు, పుస్తకాలు టెండూల్కర్‌, రంగరాజన్‌, సక్సేనా వంటి నిపుణుల నివేదికలు వున్నాయి. ఈ గణాంకాలలో తేలిన విషయ మేమిటంటే, వారు సర్వే చేసి లెక్క కట్టిన వివరాలు, వాస్తవ రూపంలో కనబడకపోవటం. అంటే అంకెల్లో చూపిన విధంగా పేదల సంఖ్య తగ్గకపోగా దళిత, ఆదివాసి, సేవక కులాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎప్పటిలాగానే జీవించటం ప్రజల పక్షం వహించే వామపక్షాలకు, పౌర సమాజానికి కొంత ఆవేదన కలిగింది. మనం అంకెలను కాకుండా ప్రజల దైనందిన జీవితంలో పనిచేసుకోవటానికి ఉపాధి కల్పన, తినటానికి కావలసిన కనీస ఆహారం కల్పించాలి, అన్న ఆచరణాత్మక కార్యక్రమాలు కావాలని ఉద్యమాలు చేశారు. అప్పట్లో పక్క సంచీ గాళ్ల్లు అవి వేళాకోళంచేసే పౌర సమాజ ఉద్యమకారులు యు.పి.ఎ ప్రభుత్వంతో ఉన్న వామపక్ష వాదులు కలిసి ప్రజల కనీస అవసరాలు తీర్చే ఆర్థిక కార్యక్రమాలు వుండాలి అని ప్రభుత్వంపై పెద్ద ఒత్తిడి తెచ్చారు. గతంలో ఈ ఆలోచన వున్న యు.పి.ఎ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం 2005లో చేశారు. తద్వారా దేశంలో, ప్రతి గ్రామంలో పనిచేసే వ్యక్తికి వంద రోజులు కనీస ఉపాధి వచ్చేలా 625 జిల్లాల్లో ప్రవేశపెట్టడంతో పేదల చేతిలోకి కొనుగోలు శక్తి వచ్చి చేరింది.
అప్పటి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అమ్మే కనీస అవసరాలైన ఆహారం, బియ్యం, గోధుమ, పంచదార వంటి వస్తువులు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. పేదరికం తగ్గుముఖం పట్టింది. మానవ నాగరికత చరిత్ర అంతా వెనుకబాటుతనం, అనాగరిక పరిస్థితులను అధిగమించి ముందుకు సాగడమే కనిపిస్తుంది. ఎక్కడో ఆఫ్రికా వంటి కొన్ని దేశాల్లో అక్కడి రాజకీయ వ్యవస్థ కుమ్ములాటల మూలంగా అభివృద్ధి లేక ఘనీభవించినా, ప్రపంచంలో అన్ని దేశాలు ముందుకు వెళుతున్నాయి. 18వ శతాబ్దంలో పేదరికంలో నలిగిన దేశాలు యిప్పుడు ఆర్ధికంగా ముందున్నాయి. అది మానవ నాగరిక లక్షణం. ఇది ఎవరో ఒకరు చేస్తే జరిగేది కాదు దాన్ని అడ్డుకుంటే కొన్ని రోజులు స్తంభించినా, దాన్ని ఎదిరించి ప్రజలు పీడితులు పోరాటం చేసి ముందుకు తీసుకు వెళతారు. అందుకే అంతర్జాతీయంగా కొన్ని వ్యవస్థలను నిర్మించుకున్నాము. ఐక్యరాజ్యసమితి, దానికి అనుబంధంగా ఆహార, ఆరోగ్య, అభివృద్ధి, సంస్కృతి సంస్థలు వున్నాయి. ఇవి ప్రతి తరంలో మనిషి అభివృద్ధికి కావలసిన విధానాలను రూపొందించి సభ్యదేశాలు అవలంబించేలా చేస్తాయి. అలా వచ్చిందే మానవ అభివృద్ధి నివేదిక, పేదరిక నిర్మూలన, వైద్యం, విద్య, ఆహారం వంటి విషయాల్లో ఒక స్థిరమైన వృద్ధి వుండాలనే అంతర్జాతీయ ప్రణాళిక, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వంటివి. వీటి ద్వారా సభ్య ప్రభుత్వాలు తమ ప్రణాళికలు రూపొందించుకున్నాయి. మన దేశంలో పేదరికం అధికంగా వుండటం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు అందించినా సరైన కొనుగోలు శక్తి లేక పేదలు, పేదలుగానే మిగిలిపోతున్నారు. అందుకే పేదలకు ఆహార భద్రత కల్పించాలీ అని ఉద్యమం వచ్చింది. దానికోసం 2013లో ఆహార భరోసా చట్టం వచ్చింది. అప్పుడు నేను జాతీయ మానవహక్కుల కమిషన్‌లో దక్షిణ భారతదేశ రెపోర్టరీ (ప్రతినిధిగా వున్నాను. ఆ చట్టంపై జాతీయ మానవ హక్కుల సంఘం చర్చలో పాల్గొని ఆహార భద్రత కంటే ఆదివాసీ ప్రాంత ప్రజల గౌరవం యినుమడిరచేలా ప్రభుత్వం బాధ్యతగా ఆహారం సరఫరా చేయాలి అని ఒక పరిశోధక పత్రం సమర్పించాను. కారణం లేకపోలేదు. ఆదివాసీలు కాయలు, ఆకులు, ఎలుకలు (ముసాహర్‌ కులం) తింటూ జీవితం గడపడం వారికి గౌరవప్రదం కాదు. వారి పోషక విలువలు మాత్రమె కాదు వారి మానవ గౌరవం, అధికారం గుర్తించి హక్కుగా ఆహారం అందించాలి అన్నాము. అది చట్టమయింది. దాని ప్రకారం ప్రతి మనిషికి ఆహారం అందించే బాధ్యత ప్రభుత్వానిది. చట్టంలో మొత్తం 45 అధికరణలు 4 షెడ్యూల్లో వున్నాయి. దీని ప్రకారం ప్రతి ఒక్కరికి వారి అర్హత ప్రకారం ఆహార వస్తువులు బియ్య గోధుమలు వారి యింటి వద్దనే సరఫరా చేయాలి. ఏయే వయసు వారికి ఎంతెంత కేలరీలు వుండాలి అంటే, మధ్యాహ్నం భోజనం ద్వారా సరఫరా చేయాలి. నాటికి ప్రభుత్వ సబ్సిడీ బియ్యం మీద బియ్యం కిలో రూ.3, గోధుమలు రూ.2, ముతక ధాన్యం రూ.1, చొప్పున సరఫరా చేయాలి. ఒక్కో రాష్ట్రానికి ఎంతెంత కేటాయించింది చట్టంలోనే పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు 32.10 లక్షల టన్నులు, దేశానికంతటికి 549.0 మిలియన్‌ టన్నులు అని ప్రకటించారు. ఇందులో పిల్లలు, మహిళలు, బాలింతలకు ప్రత్యేక ఏర్పాట్లను పేర్కొన్నారు. యిప్పుడు 80 కోట్ల మందికి వారి యింటి వద్దే బియ్యం గోధమలు ఇస్తున్నారు. చట్టం వుంది కాబట్టి 31 లక్ష ల కోట్ల కేంద్ర బడ్జెట్ట్‌ లో 2.72 లక్షల కోట్లు అంటే 9 శాతం దీనికి కేటాయిస్తున్నారు. ఇది ప్రజల విజయం. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 65 ఏళ్లకి ప్రజా ఉద్యమాల ప్రభావంతో చట్టం రూపంలో ప్రజలకు ఆహార భద్రత కల్పించారు. సామాన్య ప్రజలకు ఆహార భద్రత దొరికితే మిగతా అవసరాలు తీర్చుకోవటం సులభం.
ఇప్పుడు ప్రచారం చేస్తున్న పేదరిక నిర్మూలనకు వాడిన గణాంకాలు వినిమయం వస్తువులపై చేసే ఖర్చు ఆధారంగా లెక్కించి చేసింది. ఈ ఖర్చులు దిగువ 5% జనాభా నెలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1373, పట్టణ ప్రాంతంలో రూ.2001 ఖర్చు ఉంది కాబట్టి వీరంతా బహుళ పరిణామ సూచిక ప్రకారం పేదరికంలో వున్నట్లు మిగతా 95% పేదరికం పైన వున్నట్లు అన్నారు. కాదు, కాదు మా లెక్కల ప్రకారం 2 శాతమే అని నీతి ఆయోగ్‌ వారు వాదిస్తున్నారు. మరి వాస్తవ పరిస్థితి ఏమిటి ? గణాంకాలు జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషణ చేయకపోతే అనేక రకాల ముగింపులు పలకవచ్చు. ఎందుకంటే ఈ లెక్కలకు ప్రపంచ 125 దేశాల ఆకలిసూచీ లో భారత్‌ 111వ స్థానంలోకి దిగజారిన పరిస్థితి అర్థం కాదు. వీటి మధ్య పొంతన లేకపోవటానికి కారణం గణాంకాలను సరిగా అర్థం చేసుకోలేకపోవడం. ప్రజలకు ప్రజా ఉద్యమాల ద్వారా లభించిన ఆహార భద్రత మూలంగా వారిని నిజ ఆదాయం పెరిగి, దాన్ని కొన్ని వినియోగ వస్తువులపై ఖర్చు చేయడంతో అది వారి పేదరికం తగ్గి నట్లు కనిపిస్తుంది. గానీ, ప్రపంచ ఆహారసూచీ అంటే ఐదేళ్ల లోపు పిల్లల సాధారణ బరువుతగ్గటం, వారి పొడుగు తగ్గ బరువు, మరణం, సరైన పోషణ విలువలు లభించకపోవడంతో జరిగే లేమి తెలియజేస్తుంది. మన దేశంలో జరిగిందిదే. కడుపుకు తిండి పెట్టినంత మాత్రాన పోషక విలువలు అందించినట్లు కాదు. మధ్యాహ్న భోజన పథకంలో కూడా కొన్నిచోట్ల గుడ్డు కూడా పెట్టడం లేదు. అది మాంసాహారం మత విరుద్ధం అని ఆపేశారు. అంటే భారతదేశం సాధారణ ఆహార ఆధారిత పేదరికం తగ్గించింది గాని నిజమైన లేమిని జయించే పేదరిక నిర్మూలన యింకా జరగలేదు. ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాల సరసన మనం చేరాలంటే అంబాని, అదాని సంపద పెంచితే లెక్కల్లో జాతీయాదాయం పెరిగి భారత్‌ ట్రిలియన్‌ జాబితాలో చేరవచ్చు. గానివారి పక్కన డొక్కలు మాడిన, కుంచించుకుపోయిన శరీరాలతో పేదలు మనల్ని వెక్కిరిస్తూనే ఉంటారు. వారి శాతం సున్నా అయినప్పుడే మన అభివృద్ధి సాధించినట్లు!
సెల్‌ : 7702200026

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img