Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

బీజేపీతో కలిస్తే దేవతల పాలనా?

జి.ఓబులేసు

మార్చి 27న ఒక ప్రముఖ దినపత్రికలో ‘‘ఈ దానవ పాలన అంతానికి సహకరిద్దాం కామ్రేడ్స్‌’’ శీర్షికన వ్యాసం ప్రచురితమైంది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు జగన్‌ రాక్షస పాలనను ఎదిరించలేక అంతకన్నా పెద్దరాక్షసి బీజేపీని కలుపుకొని దానవపాలన అంతానికి కలిసివచ్చే అవకాశానికి కమ్యూనిస్టులు అడ్డుపడుతున్నట్లు మేఘనాథ్‌ రెడ్డి విలపించారు. వ్యాసం ముగింపులో ఒకేసారి ఇద్దరు రాక్షసులతో పోరాడే శక్తి తెలుగు ప్రజలకు లేదు కాబట్టి పెద్ద రాక్షసి బీజేపీ సహకారంతో చిన్న రాకాస జగన్‌ను సాగనంపడానికి కామ్రేడ్స్‌ను కలసిరావాలని కోరుతూ గతంలో కలసిపోయారు కదా! ఇప్పుడెందుకు ఎత్తుగడలువ్యూహంతో అడ్డుపడు తున్నారని ప్రశ్నించారు. వివిధ సందర్భాల్లో వ్యూహంఎత్తుగడల అర్థం నిర్వచనం మేఘనాధరెడ్డికి తెలిసి వాడినట్లుగా కనిపించదు. వ్యూహం దీర్ఘకాలికం ఎత్తుగడ తాత్కాలికం. 1967 ఐక్యసంఘటన ఎత్తుగడలు 2024 ఎన్నికలకు ఎలా వర్తింపచేయాలో కమ్యూనిస్టులకు మేఘనాధరెడ్డి బోధిస్తున్నారు. పెద్ద రక్కసిని దెబ్బ తీయాలంటే చిన్నరాకాసితో చేతులు కలపాలంటారు. కేరళలో ముస్లిమ్‌ లీగుతో జత కట్టారుకదాఇపుడు మతతత్వ పార్టీ అయిన బీజేపీతో బాబు కలిస్తే మీరు కలవాలి కానీ ఎడంగా ఉంటూ శాపనార్ధాలు పెట్టడం దేనికి అంటూ తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు. స్వాతంత్య్రం కొరకు జరిగిన సంగ్రామంలో మత్య్సకారులు మొదటగా కమ్యూనిస్టు, కాంగ్రెస్‌, ముస్లిం లీగు జెండాలు పడవులకు కట్టి ఊరేగించారు. ఆ స్వాతంత్య్రపోరులో నేటి బీజేపీ పూర్వనామమైన జనసంఫ్‌ు లేదు. పైగా వారికి తొత్తుగా వ్యవహరించినారు. నాటి ముస్లిమ్‌ లీగు పార్టీ దేశభక్తిని చాటుకుంది. 1985 ఎన్నికల్లో యన్‌టిఆర్‌ ఒకవైపు బీజేపీ మరోవైపు కమ్యూనిస్టులతో కలిసివెళ్లారు. మరిఇపుడు బాబు బీజేపీతో కలిస్తే మీరెందుకు దూరంగా ఉంటారు అని బాధ, ఆక్రోశం వెళ్లగక్కారు.
1985 నాటికి దేశంలో కాంగ్రెసు ఏకపక్ష నిర్ణయాలు, రాష్ట్రాలను దిల్లీకి గులాంలుచేసి పెండ్లిలో వధూవరులు బట్టలు మార్చినట్లు ముఖ్యమంత్రులను మార్పుచేయటం రాష్ట్రాల స్వతంత్రత, స్వేచ్ఛాభిమానాలను హరించే పద్ధతి తారాస్థాయికి చేరింది. ఆ స్థితిలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన టీడీపీ చెప్పినమాటకు కట్టుబడే ఆ పార్టీ సారధి యన్‌టిఆర్‌, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో సాగుతున్న మహోద్యమంలో కమ్యూనిస్టులు ఇరుసుగా పనిచేసారు. ఆ సమయంలో వచ్చిన ఎన్నికల్లో యన్‌టిఆర్‌ గెలుపునకు సహకరిస్తూ నాదెండ్ల భాస్కరరావు రూపంలో కాంగ్రెసు ఆడిన దుర్నాటకానికి తెరదించడానికి కమ్యూనిస్టులు కాంగ్రెసుతో, బీజేపీతో పోరాడుతూనే యన్‌టిఆర్‌కు సహకరించారు.
నాటి రాజకీయ పరిస్థితికి, నేటి స్థితికి పొంతనేలేదు. యన్‌టిఆర్‌ నిజాయితీగా కమ్యూనిస్టులతో చెప్పేవాడు, బీజేపీ సహాయం పొందారు. మరినేడు ఏమి జరిగింది? చంద్రబాబు రాష్ట్ర ప్రజలను, దానవపాలనకు వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్న ప్రతిపక్షాలతో మాటవరసకైనా , మర్యాదకైనా చెప్పకుండా అసురపార్టీని కావలించుకోవటం దేనికిదానికి వంచనతోకూడిన రాష్ట్రహితం, రాష్ట్రాభివృద్ధి అని సూత్రీకరణచేసి తన స్వార్థ రాజకీయ పదవికొరకు వెంపర్లాడడాన్ని ఎలా సమర్థించుకుంటారు. బాబు భయంతో బీజేపీతో జతకడితే దానవపాలన అంతానికి అనే నమ్మాలా? యన్‌డీఏతో ఉంటేనే అభివృద్ధి అని బాబు, పవన్‌ వారికి వంతపాడే మేధావులు,ప్రసార మాధ్యమాలు తెగ ప్రచారం చేస్తున్నారు. 2015 నుంచి 2019 వరకూ ఇపుడు గొప్పపాలనా దక్షుడుగా, ముందుచూపు, దీర్ఘదృషి ్టకలిగిన 40 ఇయర్స్‌ ఇండస్ట్రీఅనుభవంతో కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ పాలనలో భాగస్వామి. బీజేపీ కూడా ఇక్కడ రాష్ట్రంలో బాబు పాలనలో భాగస్వామియే కదా? మరలాంటప్పుడు 2014 పునర్విభజన చట్ట హామీలు సెక్షన్‌ 46 (వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకనిధులు) సెక్షన్‌ 93, సెక్షన్‌ 94లో పేర్కొన్న విద్య, వైద్య సంస్థల ఏర్పాటు ప్రత్యేక తరగతి హోదా, పోలవరం, కడప స్టీలు ప్లాంటు నిర్మాణాలు ఏమైనాయి. ఎన్‌డీఏలో ఉండి వాటన్నింటిని మోదీ షాపు దగ్గర తాకట్టుపెట్టి మోదీ గ్రాఫ్‌ తగ్గిందని దింపుడు కల్లాల ఆశతో ఆఖరు నిమిషంలో బైటకువచ్చి ధర్మపోరాట దీక్షలతో దొంగనాటకాలు ఆడినా జనం పట్టించుకోలేదు. నేడు బాబు డ్రామాలవల్లే రాష్ట్రంలో దానవపాలన వచ్చింది. కేంద్రంలో ఇంతకు పదింతలు దుష్టపాలన జరుగుతున్నది. ఆ దుష్టపాలనకు ఉపకరించే అన్ని బిల్లులకు, పార్లమెంటులో మద్దతు ఇస్తూవచ్చారు. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి, వ్యవస్థలను గాడిలో పెట్టడానికని కరుడుకట్టిన కమ్యూనల్‌, కార్పొరేట్‌, అవినీతి, క్రిమినల్‌పార్టీ బీజేపీని నోటా కన్నా తక్కువ ఓట్లువచ్చిన బీజేపీ అనే రాక్షసిని తాను నెత్తినపెట్టుకుని ఊరేగుతూ నట్టింట స్థానం కల్పిస్తూఉంటే కామ్రేడ్స్‌ ఎత్తుగడల పేరుతో అడ్డుకాలు వేయటం ఏమిటి,వంతపాడకుండా ఒక శాతం ఓట్లుకూడా లేవని, బీజేపీతో జత కలిస్తే వచ్చే ఓట్లు తగ్గుతాయని బాబుకు తెలియదా? బాబు ఏ చెత్తపని చేసినా కామ్రేడ్స్‌ కలసిరావాలి. లేకపోతే చట్టసభల్లో ప్రవేశించి ఎన్నికల రాజకీయాలు, విప్లవోద్యమం నడపడంలో వైఫల్యాలు అని దుమ్మెత్తిపోయటానికి కుహనా మేథావులు పుట్టుకు వస్తారు. కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలనకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్నది. ఉద్యమాలు చేస్తున్నది కమ్యూనిస్టులే అన్నవాస్తవాన్ని మరచి మీడియా ద్వారా హంగామా చేసేవారు దానవపాలన అంతానికి నడుంకట్టినట్లు దేశాభివృద్ధి, రాష్ట్ర హితం కోసం అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాదా? బీజేపీ ఎంత ప్రమాదకరంగా తయారైందో మణిపూర్‌ సంఘటన, రెజ్లర్లపై అఘాయిత్యం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి తమ చేతికిందకు తెచ్చుకోవటం, అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుండటం, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం, కార్పొరేటు రంగానికి అప్పచెప్పటం, ప్రతిపక్షపార్టీలు కాంగ్రెసు అకౌంట్స్‌ సీజ్‌ చేయటం, కేజ్రీవాల్‌ అక్రమ అరెస్టు, ఎదురుతిరిగే వారందరిపై ఈడీ, సీబీఐ,ఐటి దాడులు జరుగుతున్నా బాబు అండ్‌ కో కు జ్ఞానోదయం కలగలేదు. ఎవరు ఎట్లాపోతే మాకేంటి మాకు అధికారం ముఖ్యం. దాన్ని కైవసం చేసుకోవ టానికి దెయ్యాలతో కూడా చేతులు కలుపుతాం. మీరురండి అంటే కమ్యూనిస్టులు మీ మాదిరి ఊసరవెల్లి రాజకీయాలు చేయరు. చేయలేరు.కాంగ్రెసు, కమ్యూనిస్టులు, ఇండియా కూటమి జోగి జోగిరాసుకుంటే బూడిదవుతుంది అనే సన్యాసులు మరి ఈ ఈకూటమి ఏర్పాటు, ఎన్నికల పోరాటానికి బెంబేలు ఎత్తడం దేనికి. ఈ మధ్య వారం రోజుల కిందట మాజీ ఐఏఎస్‌ అఫీసరు జేపీ సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో చేయగల్గిన నాయకులు మోదీ, బాబు, పవన్‌లు గనుక నేను వారికి మద్దతు పలుకుతున్నానని పత్రికా సమావేశంలో చెప్పారు. అంతకుముందంతా జగన్‌ పాత పెన్షన్‌కు వ్యతిరేకంగా ఉండటాన్ని సమర్థిస్తూ మాట్లాడిన పెద్దమనిషి ఇప్పుడు పెన్షన్‌మద్యం ధరలు తగ్గించి నాణ్యమైన మద్యాన్ని అందిస్తానని చెప్పారు. 8,10,000 కోట్లు ప్రస్తుతం అప్పులున్నా, బాబు అమలుకు సాధ్యంకాని వాగ్దానాలతో ఏమి అభివృద్ధి సాధిస్తారు? నరంలేని నాలుక ఎలాగైనా తిరుగుతుంది అన్ననానుడిని సో కాల్డ్‌ మేథావులు రుజువు చేస్తున్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img