Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఎంఎస్‌పీ కోసం రైతు ఉద్యమాలు

రావుల వెంకయ్య

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో 48 లక్షల కోట్లు కేటాయిస్తే అందులో వ్యవసాయానికి దాని అనుబంధ సంస్థలకు కలిపి లక్షా 27 వేల కోట్లు కేటాయించారు. గతంలో మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 4.26 శాతం ఉంటే ఈనాడు 2.4 శాతానికి కుదించారు. దానిలో రైతు మద్దతు ధర ఊసేలేదు. ప్రధాన మంత్రి సమ్మాన్‌ నిధికి 60వేల కోట్లు కేటాయించినా రైతు కుటుంబానికి 6వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. కనీసం 9వేల కోట్లు అయినా పెంచుతారని రైతులు ఆశించారు. ఆ సమ్మాన్‌ నిధి కూడా భారత దేశంలో 15 కోట్ల రైతు కుంటుబాలుంటే 11.5 కోట్ల మందికి అని చెప్పి ఆచరణలో 9కోట్ల మందికి మాత్రమే అమలు చేస్తున్నారు. ఎరువుల మీద సబ్సిడీలు గతంలో 2 లక్షల 64 వేల కోట్లుంటే నేడు 2 లక్షల 51 వేల కోట్లకు కుదించారు. ధరల స్థిరీకరణ నిధి గతంలో ఉన్నది కూడా రద్దు చేశారు. ఈ నిధి కింద లక్ష కోట్లు కావాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రధానమంత్రిగా మోదీ ఉన్న ఈ 10 సంవత్సరాల కాలంలో అప్పుల భారంతో లక్ష మందికి పైగా రైతులు ఆత్యహత్యలు చేసుకున్నారు. కేరళ తరహా రుణ విమోచణ చట్టాన్ని దేశవ్యాపితంగా చట్టబద్ద హక్కుగా రైతులు కోరుతున్నారు. దాని ప్రస్థావనే బడ్జెట్లో లేదు. ఇటీవల కేంద్రం న్యూస్‌ క్లిక్‌, ఎఫ్‌ఎఆర్‌ వార్త సంస్థల మీదనే అసత్య ప్రచారం చేసిందని అనుకున్నాం. కానీ రైతు ఉద్యమం మీద బురద చల్లింది. దేశవ్యాపితంగా జరిగిన చరిత్రాత్మక రైతు ఉద్యమాన్ని విదేశీ నిధులతో జరిగిన ఉద్యమంగా అపవాదు వేసింది. రైతుల కోసం పనిచేసిన డాక్టర్‌ స్వామినాథన్‌, మాజీ ప్రధాని చౌదరిచరణ్‌ సింగ్‌లకు ఇటీవల భారతరత్న ప్రకటించడం సంతోషకరమే. కానీ వారి విధానాలను ఏమాత్రం అమలు జరపకపోవడం వారికి అపకారం చేసినట్లే. డాక్టర్‌ స్వామినాథóన్‌ సిఫార్సుల ప్రకారం రైతుల పంటలకు కనీస మద్దతు ధర కోసం (ఎంఎస్పీ) సి టుప్లస్‌ 50ని చట్టబద్ధ హక్కుగా కావాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందు 2014 ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే డాక్టర్‌ స్మామినాథóన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. డాక్టర్‌ స్వామినాథóన్‌ కమిటీ సిఫార్సులు ఆచరణ సాధ్యం కాదని, అమలు చేయలేమని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆ సిఫార్సులు అమలు జరిపితే వినియోగదారుల మీద అధిక భారాలు పడతాయని పేర్కొంది. తన ప్రభుత్వం 2022 నాటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తుందని 2016లో మోదీ వాగ్దానం చేశారు. 8సంవత్సరాలు గడుస్తున్నా దానిమీద ఎటువంటి స్పందనాలేదు. 2020-21లో దేశవ్యాపితంగా 13 నెలలపాటు జరిగిన చరిత్రాత్మక రైతు ఉద్యమం వల్ల చివరికి నరేంద్రమోదీ దిగివచ్చి యావత్‌ రైతాంగానికి క్షమాపణలు చెప్పి రైతు నష్టదాయకమైన మూడు నల్ల చట్టాలను పార్లమెంట్‌ సాక్షిగా ఉపసంహరించారు. నాడు రైతు సంఘాలకి రాత పూర్వకంగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు జరపలేదు. ఆ హామీల్లో రైతుకి మద్దతు ధర చట్టబద్దత, కేరళ తరహా రుణవిమోచణ చట్టాన్ని అమలు జరుపుతామని వాగ్దానం చేశారు. ఆ ఉద్యమంలో చనిపోయిన 750 మంది కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని, రైతులపై పెట్టిన వేలాది కేసులు ఉపసంహరించుకుంటామని అప్పుడు ఇచ్చిన హామీల్లో ఉన్నాయి. రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఈ నాటికీ ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. మాజీ ప్రధాని, రైతు ఉద్యమ నేత చౌదరి చరణ్‌సింగ్‌కు భారతరత్న ఇచ్చారు కానీ ఆయన సొంత రాష్ట్రంలోని లఖింపూర్‌లో రైతుల మీద కారు నడిపి నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణానికి కారణమైన కేంద్ర హోం మంత్రి అజయ్‌ మిశ్రా, ఆయన కుమారుడు అశిశ్‌ మిశ్రాల మీద ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చరణ్‌ సింగ్‌కి మోదీ ప్రభుత్వం ఇచ్చిన గౌరవంగా దీనిని చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు, ఎస్‌కేఎం, కార్మిక సంఘాలు కలిసి ఒక ఐక్యవేదికను ఏర్పాటు చేసుకుని దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాల్లో మహా పడావ్‌, ట్రాక్టర్‌ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. రాష్ట్ర గవర్నర్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చాయి. ఫిబ్రవరి 16వ తేదీ దేశవ్యాపితంగా గ్రామీణ బంద్‌, పట్టణాల్లో సార్వత్రిక సమ్మె జయప్రదంగా నిర్వహించాయి. ఇటీవల ఫిబ్రవరి 13,14 తేదీల్లో దిల్లీ సరిహద్దుల్లో పంజాబ్‌, హర్యానా రైతులు చలో దిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వారిని నిలువరించడానికి పోలీసు, సైన్యాన్ని ఉసిగొల్పి నిర్బంధాలను, బాష్పవాయువు, జలఫిరంగులతో యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ప్రభుత్వ ఈ చర్యను దేశవ్యాపితంగా ప్రజలందరూ ఖండిరచారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాపితంగా యూరప్‌ దేశాలైన ఫ్రాన్స్‌, జర్మనీ, గ్రీస్‌ తదితర దేశాల్లోనూ, పశ్చిమాసియా దేశాలైన నేపాల్‌, శ్రీలంక, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ లాంటి దేశాల్లో కూడా రైతు ఉద్యమాలు మొదలైనాయి. వారి దేశాల్లో రైతాంగానికి మద్దతు ధరల కోసం, సబ్సిడీలు ఇవ్బాలని పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. రాజధాని కేంద్రాలకు వేలాదిగా ట్రాక్టర్ల ర్యాలీలు, వివిధ రూపాల్లో పోరాటాలు జరుగుతున్నాయి. మన దేశంలో కూడా రైతాంగ ఉద్యమాన్ని దేశవ్యాపితంగా ఉధృతంగా కొనసాగించి ప్రభుత్వం మెడలు వంచాలని సంయుక్త కిసాన్‌ మోర్చా దేశ వ్యాపితంగా రైతు లోకానికి పిలుపు ఇస్తోంది. ఏఐకేఎస్‌ అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img