Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏపీలో మోదీ ఏం చెబుతారు?

వి. శంకరయ్య

2019 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్‌ రెడ్డికి పట్టం గట్టారు. ఈ ఎన్నికల సమయంలో కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వంతో పాటు ప్రధాన మంత్రి మోదీ జగన్మోహన్‌ రెడ్డికి పూర్తిగా అండదండలిచ్చారు. అయితే జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు గల్లంతు కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. రాజధాని అమరావతి సరేసరి. తుదకు చట్టబద్దత గలిగి రాష్ట్ర ప్రజలందరికీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఇద్దరూ గలిసి గోదావరి వరదల్లో కలిపేశారు. నాణేనికి ఇదొక వేపు అయితే సంక్షేమంపేర పేద ప్రజలు ఒకప్పుడు తన బటన్‌ నొక్కుడుపై ఆధారపడే విధానం జగన్మోహన్‌ రెడ్డి చేపట్టి అభివృద్ధి సాగునీటి ప్రాజెక్టులు రహదారులు కొండెక్కించారు.
మరోవేపు జగన్మోహన్‌ రెడ్డి అండ్‌ కో పై లక్షల కోట్ల కుంభకోణంతో సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు రెండంకెల్లో నమోదు చేసిన కేసులు వేలసంఖ్యలో వాయిదాలతో నడుస్తున్నా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. మరోవేపు దిల్లీలో వంద కోట్ల మద్యంస్కామ్‌ పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఎన్నికల సమయంలోనే కటకటాల పాలుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి, ప్రధాన మంత్రి మధ్య అనుబంధానికి ఇంతకన్నా నిదర్శనం అవసరంలేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికల పొత్తులు చిత్ర విచిత్రంగా మారాయి. మొన్నటి వరకు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కొమ్ము కాచిన బీజేపీి తిరిగి టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రసంగాలు ఎలా వుండాలనే అంశంపై కూటమిలో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ ఏం చెబుతారని కూడా రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా వున్నారు. 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధానిమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో (కనిపించిన దేవతా విగ్రహాలకు మొక్కే సత్య నిష్టభక్తుడు) ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్న ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేక పోయారో సరిగ్గా పదేళ్ల తర్వాతనైనా ఎన్నికల సభల్లో రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పవలసి వుంది. గతంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి పద్దతి మేరకు ప్లానింగ్‌ కమిషన్‌ పంపితే 2014 డిసెంబరు వరకు తొక్కిపెట్టి మొత్తంగా ప్లానింగ్‌ కమిషన్‌నే రద్దుచేసి చేతులు దులుపుకొన్నారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి చట్టంద్వారా ఇవ్వకున్నా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి చట్టంలో లేదని బుకాయించడం నిజం కాదా? 14 వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాగల రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా చేసిందని కుంటిసాకుచూపిన కేంద్ర ప్రభుత్వం 2017 లో ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు రాయితీల పద్దు కింద 27 వేల కోట్ల రూపాయలు కేంద్రమంత్రి వర్గంలో ఆమోదించి నిధులు ఇవ్వ లేదు. రేపు ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర ప్రజలకు ఈ అంశాలపై జవాబు చెప్పవలసి ఉంది.
రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 46(3)మేరకు వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రలోని ఏడు ఉమ్మడి జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వవలసి వుంటే అప్పటి ప్రభుత్వం 24వేల కోట్ల రూపాయలతో పథకం సమర్పించితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. జిల్లాకు 50 కోట్లు. అదీ మూడేళ్లే. ఈ రోజు ఏం జరిగింది? మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో వ్యాపించి వున్న అదే బుందేల్‌ ఖండ్‌ ప్రాంతంలో 44 వేల కోట్ల రూపాయల వ్యయంతో కెన్‌బెత్వా నదుల అనుసంధాన పథకం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్నారు. పైగా తాగునీటి వ్యయం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. కాని ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే ఏం జరిగింది? రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 90 మేరకు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన నిధులతో నిర్మించాలి. అటవీ పర్యావరణ అనుమతులు భూసేకరణ నష్టపరిహారం కేంద్రం భరించాలి. కాని చట్టబద్దత గల పోలవరం ప్రాజెక్టులో తాగునీటి వ్యయం భరించబోమని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పడం వాస్తవం కాదా? రాష్ట్రలోని మెట్ట ప్రాంతాలకు చెంది ఒక్క భారీ పథకం జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించలేదు. కేంద్రమూ ఆమోదించలేదు. 43 మంది బలిదానాలతో ఆంధ్రుల భావోద్వేగాలతో నెలకొల్పిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం చేసేందుకు ‘‘స్లో పాయిజన్‌’’ విధానం కేంద్రం అమలు చేస్తున్నది. ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం చేయమని ప్రకటన చేయించాల్సివుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి స్వంతగనులు కేటాయించుతామని ప్రధాన మంత్రి మోదీ చెబితేనే ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గోదావరికావేరి నదుల అనుసంధానం పథకం ఇప్పటికీ రాష్ట్ర ప్రజల మెడ మీద కత్తిలాగా వేలాడుతోంది. ఒక పక్క దేశంమొత్తం మీద ఎన్నికల జరుగుతుండగా మరోవేపు కేంద్ర జలవనరుల శాఖకు చెందిన నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ వెదిరె శ్రీ రాం నదులఅనుసంధానం గురించి సమావేశం ఏర్పాటుచేసి అనుసంధానం ఏమైనా అమలు జరగాలనడం ఒకింత ఆశ్చర్యమూ తెగింపుతనమే. వాస్తవంలో కెసిఆర్‌ మొండిగా వ్యవహరించారు. కాబట్టి ఆగిపోయింది. ఈ అంశంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం గోదావరిలో ఏ మేరకు నీళ్లు వున్నాయో తేల్చిన తర్వాతనే గోదావరికావేరి నదుల అనుసంధానం అమలు చేయమని కోరింది. గోదావరినదీ ప్రజల అవసరాలు పూర్తిగా తీరిన తర్వాతనే ఈ పధకం అమలు జరుగుతుందని మోదీ రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయవలసి ఉంది. నిజానికి 2014 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరిసోమశిల అనుసంధాన పథక రచన చేశారు. అందులో భాగంగానే వైకుంఠం బ్యారేజీ ప్రతిపాదించారు. ఇది రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగమెనదే. ఇందుకు భిన్నంగా గోదావరి`కావేరి అనుసంధానం జరిగితే తీవ్రంగా నష్టపోతాము. ప్రధాన మంత్రి మోదీ ఏం చెబుతారో చూద్దాం. ఇన్నాళ్లూ జగన్మోహన్‌ రెడ్డితో వున్న నెయ్యం పక్కనబెట్టి అతనిపై నాలుగు రాళ్లువేసి పోతే రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదు.

సెల్‌: 9848394013

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img