Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఓటర్ల వేటుతో మోదీకి శృంగ భంగం

డివివియస్‌ వర్మ

ఎన్నికలు ముగిశాయి. ఫలితాలూ వచ్చేశాయి. మళ్ళీ మోదీ సర్కార్‌ రాబోతుంది. ఈ సారి మోదీ స్వంత కాళ్ళ మీద అందలం ఎక్కడం లేదు. రెండు ఊత కర్రల సాయంతో కుర్చీని అతి కష్టం మీద అందుకోబోతున్నారు. ఈ ఎన్నికలలో దేశ ప్రజలు తమ ఓటుతో మోదీకి శృంగ భంగం చేశారు. ఇది నైతికంగా మోదీకి పరాజయం. రాజ్యాంగం మీద దాడికి సిద్ధమైన మోదీ పరివారం దూకుడికి ప్రజలు కళ్ళెం వేశారు. రాజ్యాంగాన్ని మారుస్తామని, ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే నేత అన్న మోదీ గ్యారంటీకి ఓటర్లు బ్రేకు వేశారు. అందుకే ఇది ఘనమైన ప్రజావిజయం. ప్రజాస్వామ్యాన్ని మట్టుపెట్టాలని, విద్వేష రాజకీయం కోసం మోదీ తలపెట్టిన వికృత క్రతువును భగ్నం చేసిన జనవిజయం ఇది. ఓటర్ల తీర్పులో పాలక, ప్రతిపక్షాలు నేర్చుకోవలసిన గుణ పాఠాలున్నాయి. ఓటర్లుగా వ్యవహరించే మనకు స్ఫూర్తినిచ్చే అంశాలు వున్నాయి.
మొదటగా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. మోదీ ఆ రాష్ట్రం నుంచే పోటీ చేశారు. యోగీ ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. వీరిద్దరూ అజేయుల కింద లెక్క. పైగా ఈ రాష్ట్రంలోనే అయోధ్య లో రామాలయాన్ని నిర్మించారు. దానిపేరు మీద దేశం మొత్తం మీద ఓట్లు దండుకోగలమని భావించారు. ఉత్తరప్రదేశ్‌లో ఆలయంఉన్న ఫైజాబాద్‌లోనూ బీజేపీ ఓటమిపాలైంది. నిత్య జీవితం సంకటితమైనప్పుడు ప్రజలు తమ ఓటు శక్తిని ప్రయోగిస్తారు. ప్రజలు తలుచుకుంటే అజేయులంటూ ఎవరూ వుండరని అందరూ పరాజితులే అవుతారని రుజువు చేశారు. మోదీ హవా, సమ్మోహనా శక్తి తాత్కాలిక నీటి బుడగలేనని తేల్చేశారు.
ఈ ఎన్నికలకు మరొక ముఖ్యమైన ప్రత్యేకత వుంది. ఎన్నికల ప్రచారంలో సిద్ధాంత పరమైన, విధాన పరమైన అంశాలు ప్రధాన పాత్ర పోషించడం ఒక కొత్త మేలి మలుపు. ఇండియా కూటమి ఈ చర్చను సమర్థవంతంగా నిర్వహించింది. ప్రజాస్వామ్యాన్ని, పౌరస్వేచ్ఛనే కాదు దళితులకు, ఆదివాసీలకు, బహుజనులకు, మైనారిటీలకు రక్షణ కవచంగా వున్న రాజ్యాంగాన్ని పరిరక్షించే ఎన్నికల పోరాటంగా రాహుల్‌ గాంధీ ప్రకటిస్తూ రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ చేసిన ప్రసంగాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. బీజేపీ, ఆర్‌ ఎస్‌ ఎస్‌ మత విద్వేష సిద్ధాంతాలను ఇండియా కూటమి ఎండగట్టింది. కులగణన ద్వారా సామాజిక న్యాయాన్ని అందించే అవకాశాలను ప్రచారంలోకి తెచ్చింది. రాజకీయం అంటే అదానీలకు, అంబానీలకు దేశాన్ని దోచిపెట్టడం కాదంటూ మోదీ పాలన ప్రజల కోసం కాదని ప్రచారం చేసింది. రానున్న కాలంలో పార్టీల మధ్య జరిగే సిద్ధాంత సంఘర్షణ కు ఈ ఎన్నికల ప్రచారం దారి చూపించేది గా వుంది
ఈ ఎన్నికల ప్రచారం రెండు కూటములూ రెండు భిన్నమైన ధోరణుల్లో సాగించాయి. ఇండియా కూటమి సిద్ధాంత పరమైన అంశాలతో పాటు ప్రజా సమస్యల చుట్టూ, నిర్దిష్ట మైన తక్షణ ఉపశమన పథకాల చుట్టూ ప్రచారాన్ని సాగించాయి. దేశంలో తాండవిస్తున్న నిరుద్యోగాన్ని ప్రచారాస్త్రంగా మలిచింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ వాగ్దాన భంగంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఖాళీగా వున్న 30 లక్షల ఉద్యోగాల భర్తీ తోపాటు, నిరుద్యోగులకు అప్రెంటీస్‌షిప్‌ పథకాన్ని ప్రకటించారు. పూనకం వచ్చినట్టు ‘‘ మోదీ మోదీ’’ అంటూ కేరింతలు కొట్టిన చాలా మందిని యువతని ఆకర్షించగలిగారు.
నిత్యజీవితంతో చెలగాటం ఆడుతున్న ధరల పెరుగుదలను మరో ప్రచార సాధనం చేసుకున్నారు. ధరలు తగ్గించడానికి మోదీ ప్రవేశ పెట్టిన తప్పుడు జియస్‌టీ ని సరిదిద్దుతామని, పేద కుటుంబాల మహిళలకు నగదు బదిలీ ద్వారా ఉపశమనం కల్పిస్తామని ప్రచారం చేశారు.రైతుల పంటలకు లాభసాటి ధరలు వచ్చేలా కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేస్తామని ప్రచారం చేశారు. మహిళలపై అత్యాచారాల దోషులపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపకపోగా నిందితులను ఎలా అక్కున చేర్చుకున్నదీ బ్రిజ్‌ భూషన్‌, బిల్కిన్‌ బానో కేసులో నిందితులకు క్షమాభిక్ష పెట్టడం, మణిపూర్‌ అత్యాచారాలపై మౌనం పాటించడం వంటి అంశాలు ప్రచారంలో భాగం చేశారు.
మరో పక్క మోదీ తన పదేళ్ళ పాలనపై తీర్పు చెప్పమని కోరే సాహసం చెయ్యలేదు. ప్రజాసమస్యలపై చర్చ సాగకుండా పక్కదారి పట్టించడానికి రోజుకో వివాదాస్పద అంశాన్ని ప్రచారంలోకి తెచ్చారు. మోదీ తన పేరులోని మొదటి అక్షరం ‘‘ మ’’ తో ప్రారంభమయ్యే పదాల నినాదాలు ఎంతగా వాడితే అంతగా ఓట్ల వరద పారుతుందన్న జ్యోతిష్యాన్ని నమ్ముకుని దాని చుట్టూ ప్రచారాన్ని రూపొందించుకున్నారు. మతం, మందిరం, మసీదులతో సరిపెట్టు కోకుండా మచిలీ, మటన్‌, మంగళ సూత్రం, చివరికి ముజ్రా దాక సాగలాగారు. మొత్తం మీద ఇండియా కూటమి ‘‘ పాజిటివ్‌’’ ప్రచారం చేసి లాభపడిరది. మోదీ ‘‘ నెగిటివ్‌’’ ప్రచారానికి దిగి చతికిలపడ్డారు .
ఒకే దేశం ఒకే ఎన్నికను ఉమ్మడి పౌరస్మృతి అన్నది మోదీ ఎన్నికల నినాదం. ఈ దేశంలో వున్న భిన్నత్వాన్ని మోదీ సర్కారు గుర్తించదు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి పేరుతో ప్రాంతీయ ప్రత్యేకతల్ని, వారి ఆకాంక్షల్నీ, వాటికి ప్రాతినిథ్యం వహించే ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడమే దీని లక్ష్యం. ఈ ఎన్నికలలో ప్రాంతీయ ప్రత్యేకతల ముందు మోదీహవా సాగదని తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, పంజాబు కొంత మేరకు మహారాష్ట్రలు తీర్పు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో పొత్తు లేకుండా పోటీచేస్తే బీజేపీకి ఇక్కడ ప్రవేశం వుండేది కాదు. మోదీ వచ్చి ప్రచారం చేసినా వారికి ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కేవి కావు. దేశంలో ప్రాతీయ వైవిధ్యానికి గల శక్తిని ఈ ఎన్నికలు ధృవపరుస్తున్నాయి.
ఎన్నికలలో మోదీ అనుకున్నది ఒకటైతే ఓటర్లు తీర్పు మరొకటైంది. మోదీ కోరిన 370 సీట్లకి ఓటర్లు జై కొట్టలేదు. 239కి దించి కూర్చో పెట్టారు. ఇప్పుడు మిత్రపక్షాలుగా వున్న చంద్రబాబు నాయుడు, నితీష్‌ కుమార్‌లు లేకపోతే మోదీకి ప్రధాని పదవి గల్లంతయ్యేది. అయితే ఈ ఇద్దరు నిన్నటి శత్రువులు, నేటి మిత్రులు. చంద్రబాబు 2018లో ఎన్‌డీఏ నుంచి బైటకు వచ్చి కాంగ్రెస్‌తో కలిశారు. 2023 నితీష్‌కుమార్‌ ఎన్‌డీఏ నుంచి ఇండియా కూటమికి తిరిగి ఎన్‌డీఏ కూటమికి చేరారు. ఒకప్పుడు మోదీ పంచన చేరి అడుగులకు మడుగులొత్తినవారు ఇప్పుడు చక్రం తిప్పేవారయ్యారు. వీరిద్దరికీ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల పదవులే ముఖ్యం మిగిలినవన్నీ తర్వాతే. గతంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది బలమైన ఎన్నికల సమస్య కాగానే ఆయన ఎన్‌ డి ఎ ను వదిలి పెట్టారు. ఇక్కడ రాజకీయంగా తనకు ముప్పు వాటిల్లే సమస్య ఎదురైతే ఎన్‌డిఎ ను వీడతారో గాని మోదీ కోసం రాష్ట్రాన్ని వదులుకోరు. ఇదే నితీష్‌ కీ వర్తిస్తుంది.
మొత్తం మీద మోదీ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం. దినదిన గండంతో గడిచే ప్రభుత్వం. ఈ ఎన్నికలు ‘‘బాహుబలి’’ మోదీ ని
ఇతరుల దయా దాక్షిణ్యాల మీద ఆధార పడి ప్రభుత్వాన్ని నడుపుకునే చేదు అనుభవాన్ని ఓటర్లు చవిచూపించారు.
ఈ తీర్పు రాజ్యాంగ పరిరక్షణకు, ఆధిపత్య ధోరణుల మీద, ఫాసిస్టు పోకడల మీదా పోరాడే వారికి ప్రజలను జాగృతం చెయ్యడానికి తగిన సమయాన్ని, అవసరమైన భూమికను ఇచ్చింది. అందుకే ఇది అభినందనీయమైన ప్రజా తీర్పు.

దారి దీపం సంపాదకులు
సెల్‌: 85006 78977

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img