Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కేజ్రీవాల్‌ అరెస్టులో బెడిసిన బీజేపీ వ్యూహం

సుశీల్‌కుట్టి
దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ను అత్యంత హైడ్రామా మధ్య గురువారం రాత్రి అరెస్టు చేయడం బీజేపీకి నష్టం జరగవచ్చునని అంచనాలు వస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రతిపక్ష నాయకులను ఏదో ఒక సాకు చూపి అరెస్టు చేయించి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నించడం ఇటీవల పెరిగింది. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ కీలక పాత్ర ఉందని విచారణ కోసం ఏడుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా హాజరుకాక పోవడంతో కేజ్రీవాల్‌ ఇంట్లో సోదాలు చేసి అరెస్టు చేశారు. హైకోర్టు కేజ్రీవాల్‌ ను అరెస్టు చేయకుండా స్టే ఇవ్వడానికి తిరస్కరించింది. దీంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను ఆయన ఇంట్లో అరెస్టు చేశారు. దీనిపై ఆప్‌ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లి అనంతరం పిటిషన్‌ ఉపసంహరించారు. కేజ్రీవాల్‌ అరెస్టు బెడిసి కొడుతుందనీ, ఎన్నికల్లో తమకు నష్టం కలుగుతుందని బీజేపీ అభిప్రాయపడిరది. ఈ నేపథ్యంలో ఆప్‌ కేసు ఉపసంహరించుకున్నదని పరిశీలకుల భావన. సుప్రీంకోర్టు విచారణకు సిద్ధమవుతున్న సమయంలో కేసు ఉపసంహరించుకున్నట్టు ఆప్‌ న్యాయవాది అభిషేక్‌మను సింఘ్వి ప్రకటించారు. అరెస్టు సార్వత్రిక ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు సానుకూలతను కలిగించవచ్చునని అనుకుంటున్నారు. కోర్టును ఆప్‌ తప్పుదారి పట్టిస్తోందని సొలిసిటర్‌`జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. కేసును సుప్రీంకోర్టు కొట్టివేసే వరకు కేజ్రీవాల్‌ను రిమాండ్‌కు హాజరుపరచవద్దని ఈడీకి చెప్పానని తుషార్‌మెహతా వెల్లడిరచారు. అరెస్టు పట్ల కేజ్రీవాల్‌ ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఇది ‘పూర్తిగా న్యాయ సంబంధమైన’ అంశమని బీజేపీ వ్యాఖ్యానించగా, ‘‘పూర్తిగా రాజకీయ కుట్ర’’ అని ఆప్‌ విమర్శించింది. 2019 ఎన్నికలలో బీజేపీ దిల్లీలోని ఏడు లోకసభ సీట్లను గెలుచుకున్నది. అయితే ఈసారి ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వాములైన కాంగ్రెస్‌, ఆప్‌ పొత్తు పెట్టుకొని పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో బీజేపీ ఆందోళనకు లోనైంది.
కేజ్రీవాల్‌పై సానుభూతి:
కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి వేధించి ఉన్నట్లయితే ప్రధాని నరేంద్రమోదీపై వ్యతిరేకత పెరిగి ఉండేదని, ఇప్పుడు కేజ్రీవాల్‌పై దిల్లీ ఓటర్లు సానుభూతితో ఉన్నారని విశ్లేషిస్తున్నారు. కేవలం సానుభూతి మాత్రమే కాకుండా ఓట్లు కూడా ఆప్‌కి వేస్తారని అంచనా వేస్తున్నారు. సంక్షోభం నుంచి ఆయన బయటపడతారని అనుకుంటున్నారు. ఆప్‌ తదితర పార్టీలపై వివక్ష చూపుతూ వేధిస్తున్నారని భావిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయనున్నారు. అయితే ఆప్‌ పట్ల తీవ్రమైన ఒత్తిడి చేయవచ్చునని భావిస్తున్నారు. ఆప్‌కి ఇప్పుడు నాయకత్వం లోపం ఏర్పడుతుంది. కేజ్రీవాల్‌తో సమానమైన నాయకుడెవరూ పార్టీలో లేరు. యోగేంద్రయాదవ్‌, కిరణ్‌బేడీ, ప్రశాంత్‌భూషణ్‌, కుమార్‌విశ్వాస్‌ లాంటి వాళ్లు ఉన్నప్పటికీ కేజ్రీవాల్‌తో పోల్చలేం. కేజ్రీవాల్‌ బయటపడి మళ్లీ ఎన్నికల్లో పాల్గొంటే ప్రయోజనం కలుగుతుంది. బహుశా ఆయన సతీమణి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవచ్చు అని భావిస్తున్నారు. కేజ్రీవాల్‌ స్థానంలో అతిషిమర్లేనా, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మన్‌ తదితరులు కలిసి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్న సమయంలో కేజ్రీవాల్‌ అరెస్టు ఎదుర్కోవలసింది కాదు. ఈడీ అనేక సార్లు సమన్లు పంపినప్పటికీ హాజరు కాకపోవడంతో పరిస్థితి అరెస్టు దాక వచ్చింది. దిల్లీని రాజకీయంగా, ఆర్థికంగా మార్చివేస్తానని చెబుతున్న మోదీ ఆప్‌ని రకరకాలుగా వేటాడవచ్చు. ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకుండా ఉన్న ఓటర్లు ఇప్పుడు కేజ్రీవాల్‌కు అనుకూలంగా మారతారని కొంతమంది వార్తలు రాశారు. అయితే ఎవరు ముందంజలో ఉంటారో ఊహించడం కష్టమే. పత్రికల వార్తల్లో మాత్రం మోదీదే పైచేయిగా ఉంది. దిల్లీ విషయంలో మాత్రం మోదీ పైచేయిగా ఉంటుందని చెప్పటం కష్టం. కాంగ్రెస్‌ ఆమ్‌ఆద్మీ పార్టీ వైపు దృఢంగా నిలుస్తుంది. ఆప్‌, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఫలితాలు కచ్చితంగా బీజేపీకే అనుకూలంగా ఉంటాయని చెప్పడానికి అవకాశం లేదు. తాజా పరిణామం మూలంగా కాంగ్రెస్‌, ఆప్‌ కూటమి దిల్లీలో పరిస్థితిని పూర్తిగా మార్చివేయవచ్చు.
కాంగ్రెస్‌కు అనుకూలంగా ముస్లింలు అత్యధికంగా ఓటు వేస్తారు. అలాగే ఆప్‌కి కూడా ముస్లింలు ఓటు వేస్తారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ముస్లింలు అత్యధికంగా ఓటు చేశారు. పాఠశాలలు విరివిగా ఏర్పాటు చేసి చదువును మెరుగ్గా తీర్చిదిద్దటం ప్రతి మొహల్లాలోను వైద్యశాలలు ఏర్పాటు చేయటం ఆప్‌కి ఓట్లు కురిపించే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం ఆప్‌ చేసిందేమీ లేదంటూ ప్రచారం చేస్తోంది. కేజ్రీవాల్‌ అరెస్టు తర్వాత పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారనున్నాయి. అయితే కేజ్రీవాల్‌ ఎన్నికల బరిలో లేకపోవటం లోపమే అవుతుంది. తాజాగా పరిస్థితి మారినందున బీజేపీ మరింత వేగంగా ప్రచారం సాగించనున్నది. ఆప్‌ ఒక ప్రణాళిక ప్రకారం ఎన్నికలలో పాల్గొనవలసి ఉంటుంది. ఒక దశలో కేజ్రీవాల్‌ తప్పుడు అంచనా వేశారు. ఇప్పుడు ఆప్‌ కూడా అవినీతికి పాల్పడిరదన్న ఆరోపణలు వచ్చాయి. మళ్లీ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని దిల్లీని పాలించే అవకాశం కచ్చితంగా ఉంటుందని ప్రతిపాదించటం సరైనది కాదు. ఏదో విధంగా మోదీ ప్రభుత్వం దిల్లీలో ఆప్‌ ప్రభుత్వాన్ని తుడిచిపెట్టే అవకాశం లేకపోలేదు. ఆప్‌ నూతన ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసి దిల్లీని పాలించవలసి ఉంటుంది. కేజ్రీవాల్‌ తీహార్‌ జైలు నుంచే పోరాడటం కష్టమే. ప్రతి విషయానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. విశాలమైన నాయకత్వాన్ని ఆప్‌ ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది. ఏమాత్రం వివాదాస్పదం కాని నాయకుడిని ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలి. దిల్లీ ప్రభుత్వం కూడా కుంభకోణాల్లో ఇరుక్కుపోయిందని మోదీ ప్రచారం చేస్తారు. ఎక్సైజ్‌ విధానం, దిల్లీ జల్‌ బోర్డు విధానాలు కుంభకోణాలేనని బీజేపీ ప్రచారంలో పెట్టింది. మోదీ ప్రభుత్వం నిరంతరం కేజ్రీవాల్‌ను ఎలా దెబ్బతీయాలి అని ఎదురుచూస్తుంటుంది. జల్‌ బోర్డు విషయంలో కూడా ఆప్‌కి సమన్లు జారీచేశారు. కేజ్రీవాల్‌ అవినీతికి ప్రతీక అని కూడ బీజేపీ ప్రచారం చేసేందుకు వ్యూహం పన్నింది. బీజేపీ నుంచి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఇండియా కూటమి, ఆప్‌ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img