Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

గత నవంబరు నుంచే నితీశ్‌కు వల

2024 లోకసభ ఎన్నికల్లో ఓటమి చెందవచ్చునన్న భయంతో బిహార్‌ ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు 2023 నుంచే మోదీషాలు కుట్రపన్నారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ నాయకత్వంలో నరేంద్రమోదీ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత రాష్ట్రాలలో ప్రభుత్వాలను మార్చివేయడం పరిపాటి అయింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంఖ్య తగ్గితే ఎంఎల్‌ఏలను కొనుగోలు చేయడం కూడా జరుగుతోందని దేశమంతటా చెప్పుకుంటున్నదే. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఇండియా కూటమి ఏర్పాటుకు మొదట ప్రతిపాదిం చారు. ఇండియా కూటమి మొదటి సమావేశం పట్నాలో నిర్వహించారు. అనేక సార్లు పార్టీలు మార్చి నితీశ్‌కుమార్‌ పరువు పోగొట్టుకున్నారు. ఉదయం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, సాయంత్రం బీజేపీ ఎంఎల్‌ఏలను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావచ్చు ఇండియా కూటమి బలహీపనడుతుందని మోదీకి లొంగిపోయిన మీడియా ప్రచారంలో పెట్టింది. బిహార్‌లో ఆర్‌జేడీ నాయకులు, లాలూప్రసాద్‌, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తేజస్వీలపై ఉన్న కేసుల విషయంలో సీబీఐ ఉపయోగించి శిక్ష విధించి జైలుకు పంపాలని మోదీ వ్యూహం పన్నారు. ఆర్‌జేడీ, ఇతర కూటమి పార్టీలు కలిసి పోటీ చేసినా జేడీ(యు), బీజేపీ కూటమిని గట్టిగా ఎదుర్కొంటాయి. బిహార్‌లో ఆర్‌జేడీ కూటమికి సీట్లు తగ్గవచ్చు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీతో నువ్వా నేనా అని గెలుపు ఉంటాయి. నితీశ్‌ పదే పదే పార్టీలు, ప్రజలను మోసం చేస్తున్నారని బిహార్‌లో ఇరత రాష్ట్రాల్లో ప్రజలు ఈసడిరచుకుంటున్నారు. ఇండియా కూటమి కన్వీనర్‌ చేయలేదన్న ఆక్రోశం కూడా నితీశ్‌కు ఉందంటున్నారు. నిన్న మొన్నటి వరకు, మోదీషాలను దూషించిన నితీశ్‌ ఒక్కసారిగా ఆశ్చర్యకరంగా పార్టీని మార్చడంతో బిహార్‌ ప్రజలు సహించరని, తగిన గుణపాఠం చెప్తారని ఎన్నికల విశ్లేషకులే గాకుండా ప్రజలు సైతం శాపనార్థాలు పెడుతున్నారు. రాజకీయంగా ఇదే చివరి అవకాశమని, రాజకీయపతనం అవుతుందని చెప్తున్నారు. ఇది క్రూరమైనదని అనుకుంటున్నారు. జేడీ(యు) బీజేపీ కలిసి రాష్ట్రంలో ఉన్న మొత్తం సీట్లను గెలుచుకుంటామని ఆశిస్తుండగా, ప్రజలు ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహాఘట్‌ బంధన్‌ ప్రభుత్వం ఏర్పడటానికి ముందు బీజేపీతో ఉన్న పొత్తు నుండి వైదొలిగారు. అప్పుడు జీవితంలో నితీశ్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని మోదీ శపధం చేశారు. అయితే మోదీ ఏ విషయంలోనూ మాటకు కట్టుబడి ఉండే అలవాటులేదు. అబద్ధాలు చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఇండియా కూటమిని నితీశ్‌ తీవ్రంగా దెబ్బతీశారని చెప్తున్నారు. నితీశ్‌ వెళ్లిపోయినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా సీట్లు రాబోవని అంచనా వేస్తున్నారు. నితీశ్‌ అనేకసార్లు పొత్తు కుదుర్చుకుని ముఖ్యమంత్రి పదవికి ఆరాటపడు తున్నారు. ఇంతవరకు వ్యక్తిత్వం ఉన్నదని భావిస్తుండగా, ప్రభుత్వం కావాలని కోరుకుంటున్న ప్రజలకు ద్రోహం చేశారు. దాదాపు పదేళ్లుగా పాలిస్తున్న మోదీ సామాన్య ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించలేదు. కార్మికులకు, కర్షకుల, సామాన్య ప్రజల జీవనాన్ని దుర్బరం చేశారు. నల్లధనులను మరింత సంపన్నులను చేశారు. రాజకీయ మిత్రపక్షాలకు ద్రోహం చేసిన నితీశ్‌ ప్రజలకు ముఖం చూపలేని స్థితి ఏర్పడిరది. నిన్నటి వరకు నితీశ్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ బీజేపీ నాయకుడు ఇప్పుడు పొగుడుతున్నారు. రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాలు మరింత భ్రష్టుపట్టాయి. బిహార్‌ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లున్నాయి. ఆర్‌జేడీకి 79 సీట్లున్నాయి. అన్నిటి కంటే ఇదే పెద్దపార్టీ. బీజేపీ`78 సీట్లు, జేడీ(యు)కి 45 సీట్లు ఉన్నాయి. బీజేపీ, ఎన్‌డీఏ కలిస్తే 128 సీట్లున్నాయి. ఇండియా కూటమికి 114 సీట్లున్నాయి. నితీశ్‌ ప్రభుత్వానికి, ఇండియా కూటమికి మధ్య సీట్ల తేడా ఎక్కువగా లేదు. స్పీకర్‌ ఆర్‌జేడీకి చెందిన ఎంఎల్‌ఏ. ఒకవేళ ఆర్‌జేడీ కొంతమంది ఇతర పార్టీల ఎంఎల్‌ఏలను ఆకట్టుకుని నితీశ్‌ ప్రభుత్వాన్ని ఓడిరచవచు ్చనని, అందుకు స్పీకర్‌ అవాధ్‌ బిహారి చౌదరి సహకరించ వచ్చునన్న సందేహంతో స్పీకర్‌ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బిహార్‌లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది.
టి.వి.ఎస్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img