London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

గాంధీని చంపుతూనే ఉన్నారు

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

‘‘గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు?’’ గుజరాత్‌ సంఫ్‌ు విద్యాసంస్థ ‘సుఫలం శాల వికాస్‌ సంకుల్‌’ 12.10.’19న 9వ తరగతి పరీక్షల్లో ప్రశ్న. గాంధీది హత్య కాదని సంఫ్‌ు ఉవాచ. గాంధీ చావు తప్పుడు ప్రచారమే ఈ ప్రశ్న అంతరార్థమని గాంధేయవాది ధీమంత్‌ బధియా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పెరిగిన సారా అమ్మకాల అక్రమ వ్యాపారులతో ఇబ్బందుల గురించి పోలీసు అధికారికి జాబు రాయమని 12వ తరగతి పరీక్ష ప్రశ్న. గుజరాత్‌ ఎన్నికల్లో సారా పారిందని చదివాం. సారా అమ్మకాలు పెరిగాయని, అక్రమ సారా వ్యాపారులు ప్రజలను ఇబ్బందిపెడుతున్నారని ఈ ప్రశ్న ధృవీకరిస్తోంది. ప్రశ్నాపత్రంలో మా పాత్ర లేదని విద్యాధికారి భరత్‌ వధేర్‌ అన్నారు. గుజరాత్‌ విద్యా వ్యవస్థ సంఫ్‌ు అధీనమని, కార్పొరేట్ల బానిసని దీనర్థం. గాంధీ జన్మభూమిలో సారా ప్రవాహం గాంధీని మరోమారు చంపుతోంది.
‘‘ముందు జాతీయవాదం తెలుసుకున్నాను. తర్వాత చరిత్ర అర్థం, అవగాహన నేర్చుకున్నాను.’’ మీన్‌ కాంఫ్‌ (నా పోరాటం) స్వీయకథలో హిట్లర్‌. మోదీ మొదటిదే నేర్చుకున్నారు. తన ఆధిక్యత స్థిరీకరణలో ఎదురుదెబ్బ తిన్నప్పుడు హిట్లర్‌ చరిత్రనే మార్చాడు. నవతరాన్ని తనవైపు తిప్పుకున్నాడు. నిన్న గుజరాత్‌లో జరిగిందీ, కొనసాగుతున్నదీ, నేడు మొత్తం దేశంలో వ్యాపిస్తున్నది ఇదే. 25ఏండ్ల క్రితమే మోదీ గుజరాత్‌లో గాంధీ ఆదర్శాల భూస్థాపిత కుట్ర మొదలైంది. గాంధీని చంపిన నథూరాం గోద్సేను సంఫ్‌ు తప్పుబట్టలేదు. గుజరాత్‌లో గోద్సేకు గుడి కట్టారు. ఇది నాటి ముఖ్యమంత్రి మోదీ దృష్టికి రాలేదు! సావర్కర్‌, గోద్సేలను భారతరత్నతో సత్కరించగలరు. హిందుతాత్వికుడు, స్వదేశీ పరిమిత జ్ఞాని పటేల్‌ను కాకుండా నాస్తికుడు, సామ్యవాది, దార్శనికుడు, విశ్వవిజ్ఞాన ప్రజ్ఞాశాలి నెహ్రూను ప్రధానిగా ప్రతిపాదించారని గాంధీపై సంఫ్‌ుకు కోపం. ‘‘పటేల్‌ ను కాక తనను ప్రధానిగా ప్రకటించమని నెహ్రూ గాంధీని వత్తిడిచేశారు. సున్నిత మనస్క మహాత్ముడు బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. నెహ్రూయే గాంధీ హంతకుడు.’’ అని మోదీ, షా డప్పుకొట్టగలరు. పాఠ్యాంశాల్లో చేర్చగలరు. 30.01.’19 గాంధీ వర్ధంతి నాడు సంఫ్‌ు స్త్రీలు గాంధీబొమ్మపై గుండ్లు పేల్చారు. ఇది ప్రతి ఏడాది గాంధీ వర్ధంతి వేడుకని ప్రకటించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. మోదీ, షాలతో సహా ఎవరూ దాన్ని వ్యతిరేకించలేదు. మోదీ-షా స్ఫూర్తితో ఈ ప్రక్రియ పెరిగింది. గోద్సేను దేశభక్తుడని కీర్తించిన సాధ్వి ప్రజ్ఞ సంఫ్‌ు పార్లమెంటు సభ్యురాలు. ఏదేశం కోసం జీవితాన్ని అర్పించారో ఆ దేశవాసుల చేతిలో గాంధీహత్య నాటినమ్మలేని నిజం. నేటి పాలకుల అసూయద్వేషాలతో గాంధీచరిత్ర మారటం, ఆత్మహత్య గుణహీనతకు గురికావటం ఊహించని వాస్తవాలు. గాంధీ నిరాడంబరత,సత్యవాక్కు నీతినిజాయితీలు, మానవత్వం మరువరానివి. గాంధీ జీవితంతో ప్రపంచ నాయకులు స్ఫూర్తిపొందారు. గాంధీని చంపిన సంఫ్‌ు ఆయన వారసత్వానికి తూట్లుపొడిచింది. గాంధీని చరిత్ర నుండి తొలగించటం, ఆ మహత్తర వ్యక్తిత్వానికి మసిపూయటం భవిష్య భారతానికి చేటు.
మహాత్ముని మరణ వాస్తవాలు చరిత్రలో ఉన్నాయి. ‘‘38 ఏళ్ళ నథురాం వినాయక్‌ గోద్సే 30-01-‘48 సాయంత్రం 5-12 గం.కు మూడడుగుల దూరం నుండి గాంధీ గుండెలో, కడుపులో 3 గుండ్లు పేల్చాడు. మహాత్ముడు మరణించాడు.’’ 31-01-48 న ప్రపంచ పత్రికల వార్త. గోద్సే హిందు మహాసభ మరాఠీ దినపత్రిక ‘హిందురాష్ట్ర’ సంపాదకుడు. హిందు జాతీయవాద సంస్థలు సంఫ్‌ు, హిందు మహాసభల్లో క్రియాశీలక పాత్రధారి. సంఫ్‌ు కల్పించిన విషపూరిత వాతావరణంతోనే ఇంతటి భయంకర, విషాద హత్య సాధ్యపడిరదని తీర్మానించి నాటి హోం మంత్రి వల్లభ్‌ పటేల్‌ సంఫ్‌ును నిషేధించారు. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టడానికి బీజేపీి పటేల్‌ను నెత్తికెత్తుకుంది. గాంధీ హత్యకు వెళుతున్నప్పుడు విజయులై తిరిగిరండని ఆప్టే, గోద్సేలను సావర్కర్‌ దీవించారని హిందు మహాసభ సభ్యుడు, గాంధీ హత్యాపథక భాగస్వామి దిగంబర్‌ బడ్గె కోర్టులో చెప్పారు. హత్యకు ముందు ఆప్టే, గోద్సేలు సావర్కర్‌ను అనేక మార్లు సంప్రదించి, సలహాలు తీసుకున్నారని న్యాయమూర్తి జీవన్‌ లాల్‌ కపూర్‌ నిర్ధారించారు. ప్రజాస్వామ్య పద్దతులను గాఢంగా విశ్వసించే గాంధీ అభిప్రాయభేదాల పరిష్కరణకు గోద్సేను చాలాసార్లు చర్చలకు పిలిచారు. గోద్సే రాలేదు. పారదర్శక, ప్రజాస్వామ్య పద్దతులను నమ్మని గోద్సే, తాము వ్యతిరేకించేవారిని చంపే ఫాసిస్టు విధానాలనే పాటించాడు. రాజ్యాంగ అధికరణ 19(2) భావప్రకటన దురుపయోగాన్ని నిషేధించింది. కానీ ‘‘మీ నథురాం గోద్సే బోల్తోయ్‌ (గోద్సేను మాట్లాడుతున్నాను)’’ నాటకకర్త ప్రదీప్‌ దాల్వి, హిందుత్వ తీవ్రవాదులు, తమను అంగీకరించనివారిపై హింసాద్వేష ప్రచారం, వారి హత్య, ప్రత్యర్థి హత్య మత త్యాగమని చాటుకునే హక్కులు కావాలని వాదించారు. నేడు ఇవే జరుగుతున్నాయి. గాంధీ హంతకులు గాంధీకి భావజాల శత్రువులు. సంఫ్‌ు వీరి మెదళ్ళలో విషం నింపింది. గాంధీ దేశానికి నష్టమని, దేశభక్త గోద్సే అర్జునుని వలె గాంధీని చంపాడని సంఫ్‌ు అభిప్రాయం. గాంధీని జాతిపిత అనరాదని హిందుమతమే జాతీయతని 1961 లో సావర్కర్‌ ఉద్బోధించారు. వాప్‌ా శరణార్థ శిబిరంలో సంఫ్‌ు సేవల ప్రస్తావనకు స్పందిస్తూ, గాంధీ, నియంతలు హిట్లర్‌, ముసోలినీల నాజీలు, ఫాసిస్టులు ఇదే చేశారన్నారు. సంఫ్‌ు మతోన్మాద, నియంతృత్వ సంస్థ అన్నారు. దశాబ్దాల మేధోవక్రీకరణ ఫలితమే గాంధీ హత్య. 1934 లో మొదలైన గాంధీ వ్యతిరేకత 6 హత్యాయత్నాలతో 30-01-1948 న గోద్సే గాంధీని చంపడానికి దారితీసింది.
ఖాది గ్రామోద్యోగ సంస్థ, 2017 క్యాలెండర్‌, డైరీలపై గాంధీకి బదులు మోదీని ముద్రించారు. గాంధీ జయంతిని ‘స్వచ్ఛ భారత్‌ దివస్‌’ చేశారు. ఆ రోజును చెత్తతో నింపారు. గాంధీ వ్యతిరేకి, గాంధీ హంతకునికి గుడి కట్టిన సంఫ్‌ు చనిపోయిన గాంధీపై కూడా ప్రతీకారం తీర్చుకుంటోంది. నియంతలు గతకాలపు ఘనతలను రూపుమాపి వాటి స్థానంలో కొత్త గుర్తులను ప్రతిష్టిస్తారు. చరిత్రను తమకు అనుకూలంగా పునర్లిఖిస్తారు. వర్తమానాన్ని తమ తాత్విక ప్రచారానికి, పాలన తోడ్పాటుకు వాడుకుంటారు. ఇందుకు నాజీ నియంత హిట్లర్‌ పాలన, ఆయన రుద్దిన స్వస్తిక్‌ గుర్తు ఉదాహరణలు. మోదీయం నాజీయిజాన్ని మించిపోతున్నది. మందబుద్ధి వందిమాగద మిత్రులు క్షుద్ర శత్రువులతో సమానమని ఆంగ్ల కవి, నవలారచయిత నికొలస్‌ బ్రెటన్‌ వ్యాఖ్య. నోట్లపై గాంధీ బొమ్మను తీసేయాలని హిందు మహాసభ మీరట్‌ అధ్యక్షుడు భరత్‌ రాజూ పేర్కొన్నాడు. ‘‘గాంధీ పేరు ఖాదీ అమ్మకాలను తగ్గించింది. గాంధీని తీసి మోదీని పెట్టడం మంచిదయింది. గాంధీబొమ్మతో రూపాయి విలువ తగ్గింది. గాంధీని మించిన గుర్తింపు మోదీ పొందారు.’’ హరియాణా బీజేపీ మంత్రి అనిల్‌ విజ్‌ సమర్థించారు. తాను ఇందిర, నెహ్రూలను మించినవాన్నని, గాంధీని తలదన్నే జాతిపితనని మోదీ నమ్మకం. ‘‘పాకిస్తాన్‌ మతభావాలతో మరణించింది. భారత్‌కూ ఆ గతే పట్టబోతోంది.’’ అని పాకిస్తాన్‌ ప్రముఖ పాత్రికేయుడు ఖలేద్‌ అహ్మద్‌ రాశారు. గాంధీ నుండి నెల్సన్‌ మండేలా, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ప్రేరణ పొందారు. విశ్వమంతా గాంధీని చదివి, అనుసరించి లబ్ధిపొందింది. విశ్వకవి రవీంద్రుడు మహాత్మా అన్న మహానేత గాంధీ. ఆ మహాత్ముని ఘన వారసత్వాన్ని ఆచరించటమే ఆ మహామనీషికి అసలైన నివాళి.

ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి
చరవాణి: 9490204545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img