London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Sunday, October 20, 2024
Sunday, October 20, 2024

గోయల్‌ రాజీనామాతో తీవ్ర గందరగోళం

డా.జ్ఞాన్‌ పాఠక్‌

రోజుల్లో 2024 లోకసభ ఎన్నికల్లో షెడ్యూలు ప్రకటించవలసి ఉండగా ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌గోయల్‌ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల ప్రక్రియ తీవ్ర గందరగోళంలో పడిపోయింది. ఇలా ఎందుకు జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలి. ముందుగా రాజీనామా తంతును పక్కనపెట్టి ఈ సమస్యకు ముందుగా పరిష్కారం కనుగొనాలి. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూలు ప్రకటించాలి. అసలు కారణం ఏమిటో మోదీకి మాత్రమే తెలిసిఉంటుంది కానీ, బహిరంగంగా తెలిసే అవకాశం లేదు. ఊహించవలసిందే. ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయడం సర్వసాధారణ అంశమేమీ కాదు. దేశం మొత్తంమీద ఎన్నికల నిర్వహణను చూడవలసిన బాధ్యత కమిషన్‌కి ఉంటుంది. మొత్తం ముగ్గురు కమిషనర్లు ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశ పరిపాలనలో ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ తీవ్ర విమర్శలకు గురైంది. ప్రత్యేకించి 2018 తరువాత కమిషన్‌ ఒకవిధంగా భ్రష్టుపట్టిపోయింది. 2019 లోకసభ ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీలు విపరీతంగా విమర్శించాయి. అయితే మోదీ విమర్శలను పట్టించుకునే రకంకాదు. ఆయన నిరంకుశుడైన రాజువలే తనకు నచ్చిన పనులే చేస్తాడు. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మాత్రమే ఉన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు చట్టబద్దమైన రక్షణ ఉంటుంది. పార్ల మెంటు ఆభిశంసనద్వారా మాత్రమే కమిషనర్‌ను తొలగించ డానికి వీలవుతుంది. అయితే 2023లో చేసిన ఇతర కమిషనర్లకు చట్టబద్దమైన రక్షణ ఉండదు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సిఫారసు మేరకు ఇతర కమిషనర్లను తొలగించవచ్చు. కొత్తగా 2023లో చేసిన చట్టానికి అరుణ్‌గోయల్‌ బలైపోయారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కి, అరుణ్‌గోయల్‌కి మధ్యలో తీవ్ర విభేదాలు వచ్చాయని చెబుతున్నారు. బెంగాల్‌లో ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను పరిశీలించేందుకు అరుణ్‌గోయల్‌ వెళ్లిన ప్పుడు రాజీవ్‌కుమార్‌తో విభేదాలు తలెత్తాయి. బెంగాల్‌ నుంచి అరుణ్‌గోయల్‌ తిరిగివచ్చాక ప్రధాన కమిషనర్‌ మాత్రమే పత్రికలవారితో మాట్లాడారు. ఇద్దరిమధ్య సయోధ్య కుదిర్చేందుకు వీలులేనంతగా విభేదాలు వచ్చాయని అందువల్లనే అరుణ్‌గోయల్‌ రాజీనామా చేశారని చెబుతున్నారు. ప్రధాన కమిషనర్‌ను తొలగిస్తే, గోయల్‌ అవమానానికి గురవుతారు. లేదూ గౌరవంగా రాజీనామా చేయడం మంచిదవుతుంది. అందువల్లే ఆయన రాజీనామా చేశాడు. గౌరవంగా తప్పుకోడానికే గోయల్‌ ప్రాధాన్యత నిచ్చారు. అరుణ్‌గోయల్‌ నియామకం, ఇప్పుడు రాజీనామా చేయడం వెనుక తీవ్రమైన రాజకీయ, పాలనాపరమైన కుట్ర దాగిఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నిరంకుశ వ్యవస్థలో ఇలాంటి వ్యవహారాలు జరగడం సాధారణమే. 2022 నవంబరు 19న గోయల్‌ని కమిషనర్‌గా నియమించడం వెనుక తగిన కథనం ఉంది. రాజీనామాకు ఒకరోజు ముందు గోయల్‌ ప్రధానమంత్రి మనిషేనన్న వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా గోయల్‌ మోదీ మనిషేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనేకమంది ప్రతిపక్షనాయకులు ఈపరిణామంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అరుణ్‌గోయల్‌ ద్వారా ప్రభుత్వం ఎలాంటి పనిచేయించుకోదలచిందని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ నేపధ్యంలో గోయల్‌ రాజీనామా చేయక తప్పలేదు. 2019లో ప్రభుత్వం వైపు నుంచి భరించలేనంత ఒత్తిడికిలోనైన ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవస మొదటిసారిగా రాజీనామా చేశారు. నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు మోడల్‌కోడ్‌ను ఉల్లంఘించినందున అశోక్‌ లవస తమ అసంతృప్తిని, అసమ్మతిని తెలియజేసి ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిచేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లం ఘించలేదని ఎన్నికల కమిషన్‌లో అత్యధిక సభ్యులు తీర్పు చెప్పడంతో అశోక్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. దానితో పైస్థాయిలో ఉన్న ప్రభుత్వ బాధ్యులు ఎంతగానో ఒత్తిడిచేయడం వల్ల రాజీనామా చేశారు. ఇది జరిగాక ఆదాయపు పన్నుశాఖ అశోక్‌ భార్యకు నోటీసులు జారీ చేసింది. ఆమె ఆదాయానికి, ఆమె వద్దనున్న విదేశీ మారకద్రవ్యానికి మధ్య ఎంతో తేడాఉందని ఆరోపిస్తూ నోటీసులు జారీ చేశారు. అయితే అశోక్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించడానికి ముందు ఆయన భార్యపై ఎందుకు చర్య తీసుకోలేదనేది తేలని ప్రశ్న. మోదీ, అమిత్‌ షాలు ఇద్దరూ విద్వేషప్రసంగాలు చేసినప్పటికీ ఏ మాత్రం చర్యలు లేవు. పాలకపార్టీకి చెందిన ఉన్నతస్థాయి నాయకులు ఎక్కడా విద్వేష ప్రసంగాలు చేసినప్పటికీ కనీసం కేసులు కూడా నమోదు చేయలేదు. అరుణ్‌గోయల్‌ రాజీనామాకు ముందు జరిగిన వ్యవ హారాలన్నీ బట్టబయలైనాయి. ఎన్నికల కమిషన్‌ పాలకపార్టీకి సహకరిస్తుందని అందువల్ల తగిన చర్య తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. కార్యనిర్వాహక పాలనావ్యవస్థను రాజ్యాంగ స్వాతంత్య్రాన్ని మోదీ ప్రభుత్వం పూర్తిగా దిగజార్చిందని ప్రతిపక్షపార్టీలు విమర్శిస్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ పట్టించు కోలేదు. 2021 నవంబరు 16న ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, సీఈడీతోపాటు మోదీ పిలుపుమేరకు రెండుసార్లు అయనవద్దకు వెళ్లారు. దీనిపైన తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. 2019 లోకసభ ఎన్నికల ఫలితాలను ఎన్నికల కమిషన్‌ తారుమారు చేసిందని, ఈవిఎంలను కూడా తారుమారుచేసి పాలకపార్టీ అనుకూల ఫలితాలను ప్రకటించారన్న ఆరోపణలుకూడా వచ్చాయి. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ తర్వాత బాండ్లకు సంబంధించిన వివరాలను మార్చి 6లోపు ఎన్నికల కమిషన్‌కి అందచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ బాండ్లను విక్రయించే అధికారంగల స్టేట్‌బ్యాంకు వివరాలివ్వకుండా సుప్రీంకోర్టును కూడా ధిక్కరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img