London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

తొండాట

చింతపట్ల సుదర్శన్‌

ఇదిగో అరుగు ఎక్కీ ఎక్కగానే కళ్లు మూసుకోకపోతే కాస్సేపు ‘కరెంటఫయిర్సు’ మాట్లాడుకుందాం అంది డాగీ. ‘కరెంటఫయిర్సా కరంట్‌ అఫయిర్సా. నిన్నటిదాకా అసెంబ్లీ మొత్తం కరంటు షాకులే కద అంది డాంకీ కళ్ళు బార్లా తెర్చి. రెండో దాని తంటాలు వాళ్ళు పడతార్లే కాని మొదటి దాని గురించే. ఏం మాట్లాడతాం చెప్పు జరిగేవే మళ్లీమళ్లీ జరుగుతాయి జరగనివి అసలు జరగనే జరగవు అంది డాంకీ. సూటిగా పాయింట్‌కు వస్తా మన తెలుగు అబ్బాయికి ఉద్యోగం లేదుకదా. రోజూ ఇక్కడకివచ్చి అంగలారుస్తున్నాడు కదా. తనకేదైనా ఆర్థిక సాయం చెయ్యాలనే ఆలోచన వచ్చింది నాకు. ఆర్థిక సాయమా! మనమా? అదంతా రాజకీయ నాయకుల అఫయిర్‌ కదా ఓట్ల కోసం పదవుల కోసం. మనమేం చెయ్యగలం. నేను కాగితాలు, నువ్వు విసిరేసిన మాంసపు ముక్కలు ఇదే కదా మన ప్రాపర్టీ అంది డాంకీ. ప్రాపర్టీ అన్నది సృష్టిస్తే వస్తుంది. ఎన్నికల్లో నిలబడేటప్పుడు ఒక వ్యక్తి ఆస్తి ఏమిటి, ఎన్నికయి ఏదైనా పదవి వెలగబెట్టాక కూడబెట్టిన ఆస్తి ఏమిటి ఈ తేడాయే సృష్టి అన్నమాట. మనకలాంటి ఛాన్సు లేకపోయినా అబ్బాయి కోసం కొంత డబ్బు సంపాదించే ఆలోచన వచ్చింది అంది డాగీ. చెప్పేవాడికి వినేవాడు లోకువ కదా కానీ చెప్పు. చెప్తా విను మధ్యలో ప్రతిపక్షం వాడిలా అరుపులూ, కేకలూ వద్దు. టీవిలో బడా బాస్‌ షో అనేది ఒకటి వస్తున్నది కదా అంది డాగీ.
వస్తున్నదేమిటి అయిపూడ్సింది. బస్సులు తగలబడ్డాయి. ఒకరిద్దరిని యమ ధర్మరాజు సంచీలో వేసుకు చక్కాపోయాట్టగదా. అచ్ఛా! అన్నీ చూసినట్టు చెప్పావే అంది డాగీ. దీని వెనక ఏ రాజకీయ తలకాయో వుండే ఉంటుంది. ఉద్దేశ్యం మరేదో అయిఉంటుంది గెలిపించినోడికి అంత సీన్‌ లేదులే అంది డాంకీ. గెలిపించడమా అదెలా ? సినిమాల్లోగానే లాగా స్క్రీన్‌ ప్లే, యాక్షనూ, డైలాగూ అన్నీ ఏర్పాటైతవిలే. అలాగే ఎవడో ఒకడ్ని గెలిపించే ఏర్పాటు కూడా ఉంటుంది . దిక్కుమాలిన ఆట పనికిమాలిన ఎంటర్‌టైన్‌మెంట్‌ దాని సంగతెందుకు? అక్కడికే వస్తున్నా. మనిద్దరం రోబేయే ‘బీబీ’ లో పాల్గొని ఆ డబ్బు మన అబ్బాయికి ఇచ్చేద్దాం. మనమేమన్నా సెలబ్రిటీలమా మననెవరు రానిస్తారు. పైగా కోర్టులో కేసు కూడా వేశారు ఆపాలని అంది డాంకీ. కోర్టువారు తీరిక చేసుకుని తీర్పు ఇచ్చేలోపు ఓ పాతిక సీజన్లవుతాయి కానీ మనని రానిచ్చే సంగతినే చూసుకుంటా. ఆ ఆట నిర్వహకుడి శ్రీమతికి నాలాంటి కుక్కలంటే చాలా ప్రేమట అక్కడ్నించి నరుక్కొద్దాం. నరికావే అనుకో! గృహలక్ష్మి రికమండేషన్‌తో వెళ్లామే అనుకో ఇద్దరమూ వందరోజులు ఆజైల్లో ఉండగలమా. డబ్బుకోసం నానాగడ్డి మేసే మనుషులు, సెలిబ్రటీలు వెళ్తారు గానీ, మనవల్ల కాదు అంది డాంకీ. చెప్పేది పూర్తిగా వినవు. మనం ఆటగాళ్లలా వెళ్లం. ఆటగాళ్లు ఆడే అర్థంపర్థంలేని ఆటల్లో ‘ఆబ్జక్టులుగా’ వెళ్తాం ఒకటి రెండు రోజులే. ఆ మాత్రం చాలు లక్షల్లో ఇస్తారు . ఆసలు ఈ టీవీ వాళ్ల కోసం, సినిమావాళ్ల కోసం ఈ సర్కారు వారు ‘లక్ష నోటు’, ‘కోటి నోటూ’ అచ్చేయిస్తే బాగా వాళ్లకు తెల్సిన అంకెలవే కదా. ఇక మనం ఆటలో ఎలాగ పనికొస్తామో చెప్తా. బిగ్‌ బీ డెన్‌లో ఉండే వాళ్ళను వరుసగా నిలబెట్టి ఎదురుగ్గా నిన్ను నిలబెట్టాలి. ఒకరి తర్వాత ఒకరు నీ తోక పట్టుకుని నువ్వు పరుగెడ్తుంటే నీ వెనకాల పరిగెత్తాలి కిందపడి కాళ్లు విరగ్గొట్టుకోకుండా ఉన్నాడే విన్నర్‌ అన్నమాట అంది డాగీ. బాగుంది సంబడం. ఆళ్లు నా తోక పట్టుకులాగితే అది ఊడిపోతే ఎవడతికిస్తాడు అంది డాంకీ. ఏం ఊడదులే ఊడితే కంపెన్సేషన్‌ కింద మరింత లాగచ్చు. ఇక ఆటగాళ్లందరినీ నువ్వు వెనక కాళ్లతో తన్నాలి ఎవరు ఎక్కువసార్లు తన్నించుకోగలరో వాడే విన్నర్‌. ఇది ఓ.కే. అంది డాంకీ. మూడో ఆట ఇది ఫైనల్‌ అన్నమాట. నిన్ను ఓ గదిలో ఉంచి ఒక్కొక్క ఆటగాడినో, ఆటగత్తెనో నీ ముందుకి పంపుతారు. నువ్వు చెయ్యాల్సిందేమీ లేదు. అప్పుడప్పుడూ చేస్తుంటావుగదా సంగీత సాధన అదే చెయ్యలి. ఇది డబుల్‌ ఓ.కే. నా ‘గానామృతాన్ని’ వాళ్ల చెవుల్లో పోస్తాను నా టాలంటు చూపిస్తాను. నీ టాలంటును చెవులనించి నెత్తురు కారకుండా ఎవడు ఎంజాయి చేస్తాడో వాడే విన్నర్‌. సో! ఇంత చేస్తే చాలు లక్ష నోట్లు దక్కేస్తం మరి అంది డాగీ. నా సంగతి సరే, తోకన్నావు తన్నులన్నావు. మ్యూజికల్‌ నైట్‌ అన్నావు. మరి నువ్వేం చెయ్యగలవో నేను చెప్తా విను. నీనోట్లో ఓ బంతిపెట్టి ఒక్కొక్క ప్లేయర్‌ని చేత్తోపట్టి దాన్ని బయటకు తీయమంటారు. గుడ్‌ఛాన్స్‌ ఎన్నివేళ్లు కొరికేయవచ్చునో. అప్పుడే అవలేదు ఒక్కొక్క ఆటగాడో ఆటగత్తో పరుగెత్తమంటే నువ్వు వెనకనించి వాళ్లని ముట్టిచ్చుకోవాలి. వారెవా! పిక్క కనబడితే ఊరుకోలేను కదా చచ్చారన్నమాటే అంది డాగీ. ఇక ఫైనల్‌గా ఒక్కొక్కళు ్లవచ్చి నీ తోకని, నీ ఈ వంకర టింకర తోకని చక్కగా చెయ్యాలన్నమాట. ఎవడు చెయ్యగలిగితే వాడే విన్నర్‌ అంది డాంకీ. ఈ ఆటలో విన్నరనే వాడుండడు. బండరాయి కట్టినా సరే ఇనుప టైరు చుట్టినా సరే అంది డాగీ హుశారుగా..అరుగు ఎక్కాడు తెలుగు అబ్బాయి. రా ‘బ్రో’ రా నీకోసమే బడ్జెట్‌ ప్లాన్‌ చేస్తున్నాం. మన అపూర్వ స్నేహానికి ఏదోఒకటి చేయాలి మా వంతుగా అని ఆలోచిస్తున్నాం అన్నవి డాంకీ, డాగీ. అవునా! ఆ ప్లానింగేమిటో! అన్నాడబ్బాయి నవ్వుతూ. టీవీలో ఓ షో ఉంది కదా అన్నా దాంట్లో పాల్గొని ఎంతో కొంత సంపాదించి అంతా నీకే ఇద్దాం అనుకుంటున్నాం.డబ్బుతో మాకేం పని ఏ పూటకాపూట కడుపు నిండితేచాలు. మనుషుల్లో తరతరాలకూ సంపాదించి పెట్టాల్సిన పనిలేదు అంది డాగీ. ఆ ‘షో’ లో సంపాదించిన సొమ్మ నాకు వద్దనే వద్దు. ఆ ‘తొండాటా’ సొమ్ము మీరిచ్చినా తీసుకోను అన్నాడబ్బాయి. ‘తొండాటా’?అన్నది డాగీ. అవును అదంతా డబ్బు కోసం జనాల్ని పిచ్చోళ్లని చేసే ఆట. ఏ ఆటయినా ఒకడ్ని గెలిపించాలని ఆడిరచే మోసపు బూటకపు ఆటయితే దాన్ని తొండాట అంటారు అని వివరించాడు అబ్బాయి. దోచుకోవడం, మోసం చెయ్యడం, డబ్బు దోచెయ్యడం అనేది ‘తొండాటన్న మాట అన్నది డాంకీ’.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img