Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పదేళ్లలో విఫలమైన ఆర్థిక విధానాలు

గత పదేళ్లకాలంలో బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనాకాలంలో ఆయన అనుసరించిన ఆర్థిక విధానాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఏదోవిధంగా చిన్న, చితక పనులు చేసుకొని బతకడానికి అలవాటు పడవలసిందే. ఈ నేరాన్ని ఎవరు అంగీకరిస్తారు? పౌర సమాజమంతా ఎలా బతకాలో తెలుసుకోవలసి ఉంటుంది. కరువు పరిస్థితిలో మనం జీవించవలసిందే. అన్ని వస్తువుల ధరలు ఊహించలేని స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో ఉద్యోగాలు లేవు. జీవితమే భరించలేని స్థాయికి చేరుతుంది. ఉద్యోగాలు, ఉపాధిలేక యువత ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. నిరుద్యోగం అసాధారణంగా పెరిగి గరిష్టస్థాయికి చేరింది. భవిష్యత్‌లో మనం మాంద్యోల్బణాన్ని చవిచూడవలసిరావచ్చు.
1930లలో ఏర్పడిన మహామాంద్యం తరువాత మొదటిసారిగా నిరుద్యోగం మనల్ని భయపెడుతోంది. ఎన్నికల ప్రచారంలో మాత్రం గొప్పగొప్ప వాగ్దానాలు చేసి ప్రజలను సంతృప్తి పరిచి గెలుపొంది ప్రభుత్వాలు ఏర్పాటుచేసి నిరంకుశపాలన సాగిస్తూ, ప్రజలకు మేలుచేయకపోగా అనేక విషయాలలో వేధిస్తున్నారు. ఉద్యోగాలు సృష్టించని అభివృద్ధి జరుగుతున్నా అది సంపన్నులకే పరిమితమవుతోంది. 2023`2024 మొదటి మూడునెలల్లో 8.4శాతం జీడీపీ నమోదైందని ఆర్థికశాఖ ప్రకటించింది. ఆ తర్వాత జరిపిన సర్వేనివేదిక అంచనా ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. అనేక ప్రశ్నలు వస్తున్నాయి. లోకనీతి సిఎస్‌డిఎస్‌ యువతపైన జరిపిన సర్వేప్రకారం, 80శాతం మందికి ఉద్యోగాలు లభించడం లేదని చెప్పారు. అభివృద్ధి జరిగిందని చెప్పినా ఉద్యోగాలులేవు. అభివృద్ధికి, ఉద్యోగాలలేమికి సంబంధమేలేని స్థితి వచ్చింది. జీవితంలోకి వస్తున్న ప్రారంభదశలో మన జనాభాలో 63శాతం అధిక సామర్ధ్యంతో పనిచేయగలరు. వివిధరంగాలలో ఉత్పత్తిలో పాల్గొనే కీలకమైన దశ ఇది. ఉద్యోగాలు లేకుండా ఆర్థికవృద్ధి సాధ్యం కాదు. ఉద్యోగాలు కావాలని కోరుకోకుండా నేటి యువత ఉద్యోగాలు సృష్టించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదేపదే సూచిస్తున్నారు. యువత ఉద్యోగాలు సృష్టించే కలలు కనాలని ఆయన అంటున్నారు. అయితే ప్రధానమంత్రి సూచన అనుసరించడానికి నేటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? పని కల్పించడానికి బాధ్యతను తీసుకునే పరిస్థితి దేశంలో నెలకొని ఉందా? పెట్టుబడులు పెట్టడానికి తిరిగి ఆ పెట్టుబడి లాభాలు పొందే పరిస్థితులను ప్రభుత్వం సృష్టిస్తుందా?
నేటి దుర్బర పరిస్థితులకు కేంద్రప్రభుత్వానిదే బాధ్యత అని మెజారిటీ భారతదేశ ప్రజలు భావిస్తున్నారు. విధ్వంసానికి దారితీసే పరిస్థితులున్నాయని సర్వేలో పాల్గొన్న అత్యధికులు చెప్పారు. నేటి విషాద పరిస్థితికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని సర్వేలో పాల్గొన్న ప్రతి ఆరుగురిలో ఒకరు చెప్పారు. ప్రభుత్వం ఆర్థికరంగంలో పూర్తిగా విఫలం చెందిందని ఉద్యోగ అవకాశాలను ఏ మాత్రం సృష్టించలేదని అన్నారు. నిరుద్యోగ పరిస్థితుల గురించి మాట్లాడకుండా కేవలం ఓట్ల కోసమే ప్రచారం చేస్తుంటారు. 2023 చివరి త్రైమాసికంలో పట్టణప్రాంత ఉద్యోగ అవకాశాలు 6.5శాతానికి పడిపోయాయి. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం, దేశంలోని యువత ప్రత్యేకించి చదువుకున్నవారిలో ఎక్కువమంది ఉద్యోగాలు లేనివారే కనిపిస్తారు. ఆర్థికరంగంలో పరిస్థితి నిరాశజనకంగా ఉన్నది. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన యువతలో ఉద్యోగాలు లేని యువత 29.1శాతం ఉన్నది. చదువులేని వారిలో నిరుద్యోగం రేటు 3.4శాతానికంటే ఎక్కువగాఉంది. ఉన్నతవిద్య చదువుకున్నవారిలో నిరుద్యోగం 18.4శాతం ఉన్నది. మన దేశంలో చదువుకున్న యువత నిరుద్యోగులుగానే ఉండే స్థితి ముందుముందు మరింత పెరగనుంది. ప్రత్యేకించి మహిళల్లో నిరుద్యోగం రేటు ఎక్కువగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో పనిచేసే శ్రామికుల సంఖ్య పెరిగింది. జనాభా పెరుగుదల రేటుకు అనుగుణంగా ఉద్యోగాల సృష్టిలేదు. అందువల్ల నిరుద్యోగుల రేటు పెరుగుతోంది.
కార్మిక మార్కెట్‌లో అసమానతలు ఎక్కువగా ఉన్నందున ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదు. నైపుణ్యాలను పెంచడం ఎంతైనా అవసరం. అదే సమయంలో క్రియాశీలంగాఉన్న కార్మిక మార్కెట్‌కు అనుగుణంగా విధానాలను రూపొందిచాలి. గ్రామీణ ప్రాంతాలనుంచి వ్యవసాయ కార్మికులు పట్టణ ప్రాంతాలకు వలసవెళ్లడంతో పట్టణప్రాంతంలో నిరుద్యోగిత పెరుగుతోంది. భారతదేశంలో మార్కెట్‌ ఆర్ధిక వ్యవస్థ ప్రజలు ఇతర ప్రాంతాలకు మేలైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తప్పనిసరిగా వెళతారు. ఒకవైపు ఆహార ధాన్యాల ఉత్పత్తి దేశంలో ఎక్కువగా ఉందని ప్రభుత్వం ప్రకటిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితిలో ప్రజలకు తగినంత ఆహారం ఎందుకు లభించడంలేదు? అలాగే వ్యవసాయరంగం తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌ ప్రకారం, భూమి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలే వ్యవసాయరంగం అభివృద్ధి చెందేందుకు ప్రణాళిక అమలుచేయాలి. ఇదే సమయంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని అందించాలి. అయితే ప్రస్తుతం కేంద్రం తన స్వప్రయోజనాలకోసం భూమిని స్వాధీనం చేసుకుంటోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img