London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Sunday, October 20, 2024
Sunday, October 20, 2024

ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం !

బొల్లిముంత సాంబశివరావు

దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రజలను ఆదుకునేందుకు చౌకధరలకు ఆహార ఉత్పత్తులు అందించేందు ప్రజా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు, దాన్ని అమలు చేస్తున్నట్లు ప్రతి పాలక ప్రభుత్వం చెబుతూనే ఉంది. పాలకులు ఎంత ప్రచారం చేసినా వాస్తవాన్ని మభ్యపెట్టటం సాధ్యం కాదు. ఆహార పదార్థాలు అందక పేదలు ఆకలితో ఆహాకారాలు చేస్తూనే ఉన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ విఫలతతో పాటు, పేదల ఆర్థిక శక్తి పెరగక పోవటమే పేదరికానికి కారణం. ఇప్పటికీ దేశంలో పేదరికం 30% దాకా ఉంది. గ్రామీణ పేదలకు ఉపాధిని కల్పించే సేద్యపు భూమి లేక, కష్టపడేందుకు ఉపాధి లభించక, కుటుంబాలను పోషించే ఆధాయం రాక పేదరికంలో మగ్గుతున్నారు. తినీతినక పంటి బిగువుతో కాలం వెల్లబుచ్చుతున్నారు. పేదరికం తొలగించుకోవటానికి భూమి కోసం, ఉపాధి కోసం పేదలు ఉద్యమాలు చేపట్టారు. వలస పాలన నుంచే పేదలు ఆందోళనోద్యమాలు ప్రారంభించారు. అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా పేదల బ్రతుకుల్లో మార్పు ఏమి సంభవించలేదు. పేదల ఆందోళనలు తగ్గకపోగా పెరిగాయి. ఈ ఆందోళనల నేపథó్యంలో వచ్చిందే పాలకులు ప్రవేశపెట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థ.
దేశం బ్రిటీష్‌ వలస పాలనలో వచ్చిన రెండవ ప్రపంచ యుద్ధం వలన ఆహార ధాన్యాల కొరత తీవ్రమై పేదలు ఆకలితో అలమటించారు. బ్లాక్‌ మార్కెట్‌ పెద్దఎత్తున కొనసాగింది. బ్రిటీష్‌ సైన్యాలకు కూడా ఆహార సమస్య తీవ్రమైంది. ఇలాంటి పరిస్థితుల్లో వలస పాలకులు ఆహార రేషన్‌ ప్రవేశ పెట్టారు. అధికార మార్పిడి తర్వాత కూడా పేదరికంతో పాటు తీవ్రమైన ఆహార కొరత ఏర్పడిరది. 1960లో పేద, మధ్య తరగతి ప్రజలకోసం దేశ వ్యాపితంగా 50వేల రేషన్‌ షాపులు ఏర్పాటు చేశారు. అవి 1990-91 నాటికి 3లక్షల 50వేలకు పెరిగాయి. ఆహార ధాన్యాల పరిణామం 6.5 మిలియన్ల టన్నుల నుంచి 16 మిలియన్ల టన్నులకు పెరిగింది. దేశంలో పేదల సంఖ్య పెరుగుదలను ఇది సూచిస్తోంది. 1997లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)ను అధికారికంగా మార్చారు. కుటుంబాలను రెండు వర్గాలగా విభజించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు (బీపీఎల్‌), ఎగువున ఉన్న వారు. బీపీఎల్‌ కేటగిరిలో ఉన్న వారికి మొదట కుటుంబానికి 10కిలోలు దాన్ని క్రమంగా 35కిలోలకు పెంచారు. ఎగువన ఉన్న వారి కుటుంబాలకు చౌకగా 15 కిలోలు, కొద్ది కాలం తర్వాత పూర్తిగా డబ్బులు చెల్లించారు. 2000 సంవత్సరంలో అంత్యోదయ పథకం వచ్చింది. దీన్ని కోటి నుంచి రెండు కోట్ల కుటుంబాలకు వర్తింప చేసినట్లు పాలకులు ప్రకటించారు. కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం లేదా గోధుమలు ప్రకటించారు. 1993-94 నేషన్‌ శాంపిల్‌ సర్వే వినియోగ వ్యయ సర్వే నుంచి అంచనావేసి రాష్ట్రాల వారీగా పేదరికం లెక్కల నిష్పత్తుల అంచనా ప్రకారం రాష్ట్రాల్లో దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలను అంచనా వేశారు. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఐఆర్‌డీపీ) 1992-03లో నిర్వహించిన సర్వే లెక్కలను వినియోగించింది. ఆ తర్వాత 2002లో ఆస్తులు, వృత్తి, భూ యాజమాన్యం మొదలైన 13 అంశాల పరిమితులపై బీపీఎల్‌ కుటుంబాలకు నిర్ణయంగా ప్రభుత్వం ప్రకటించింది. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఐదు కిలో బియ్యం లేదా గోధుమలు రేషన్‌గా నిర్ణయించారు. 1992-93 సర్వే పద్ధతి వలన బీపీఎల్‌లో ఉన్న కుటుంబాల కంటే తక్కువ గుర్తించారు. 2004-05 నాటికి 34% కుటుంబాలు మాత్రమే బీపీఎల్‌, ఏఏఐ కార్డులు అత్యంత సంపన్నులైన కుటుంబాల్లో 20నుంచి 25% వరకు కలిగి ఉన్నారంటే కార్డుల జారీలో అవినీతి ఎలా ఉందో వెల్లడైంది. నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ అంచనా ప్రకారం 2020 నాటికి బీపీఎల్‌కు అర్హత ఉన్న కుటుంబాల్లో 59% మాత్రమే రేషన్‌ కార్డులు పొందగలిగారు. ప్రజా పంపిణీకి ధాన్య సేకరణకు నిధుల కొరత: వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహార, ప్రజా పంపిణీకి రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి ఆహారం, ప్రజా పంపిణీ, రెండు వినియోగదారుల వ్యవహారాలు. ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ ద్వారా ఆహార భద్రత నిర్ధారించటానికీ, చక్కెర రంగాన్ని నియంత్రించటానికి ఆహార, ప్రజా పంపిణీ వ్యవస్థ బాధ్యత వహిస్తోంది. ఇందుకు వినియోగదారుల మంత్రిత్వ శాఖ నిధులు కేటా యిస్తుంది. ఈ శాఖకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు జరుగు తాయి. వినియోగదారులకు హక్కుల గురించి అవగాహన కల్పించటం, వారి ప్రయోజనాలు పరిరక్షించటం, ప్రమాణాలను అమలు చేయటం, బ్లాక్‌మార్కెట్‌ ను నిరోధించటం వంటి బాధ్యతలను వినియోగదారుల విభాగం బాధ్యతగా ఉంటుంది. ఈ రెండు శాఖలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిం చటంలో విఫమయ్యాయి. ఆహార పంపిణీకి 2020-21లో మంత్రిత్వ శాఖ 5,55,432 కోట్లు ఆహారం, ప్రజా పంపిణీ శాఖకు కేటాయించగా, 1921-22లో సవరించిన దానితో సహా 3,02,000 కోట్లకు తగ్గి, 2022-23 నాటికి 2,15,960కు పరిమితమైంది. ఇదే సంవత్సరాల్లో వియోగదారుల వ్యవహారాలకు 11,365 నుంచి 2,454కు, 1,725 కోట్లకు నిధులు తగ్గిపోయాయి. ఈ శాఖకు 30% నిధులు తగ్గగా, మొత్తం మీద ప్రజా పంపిణీ ఆహారం, ప్రజా పంపిణీి, మంత్రిత్వ శాఖ ద్వారా ఆహార సబ్సిడీకి ఎక్కువ నిధుల కేటాయింపుల జరుగుతున్నట్లు, అందుకు 96% ఖర్చు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ లెక్కలు తెలుపుతున్నాయి. 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రభుత్వ నోటిఫైడ్‌ ధరలకు విక్రయించటానికి భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) రాష్ట్రాలకు సబ్సిడీ అందిస్తారు. ఈ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 75%, పట్టణ ప్రాంతాల్లో 50% జనాభా ప్రజా పంపిణీ వ్యవస్థ లో ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి, నిల్వ, పంపిణీకి, కార్య కలాపాల్లో కలిగే నష్టాన్ని రీఎంబర్స్‌మెంట్‌గా ఆహార సబ్సిడీ ఇస్తున్నది. మోదీ ప్రభుత్వం 2016-20 మధ్య సంవత్సరాల్లో భారత ఆహార సంస్థకు చెల్లింపుల కోసం డిపార్ట్‌మెంట్‌ తగిన కేటాయింపులు పొందినప్పటికీ, కేంద్ర బడ్జెట్‌ కోతల కారణంగా, ఎఫ్‌సీఐకి చెల్లించిన వాస్తవ మొత్తం చాలా తక్కువ. దాని బకాయిలను క్లియర్‌ చేయటానికి ఆహార సబ్సిడీ సరిపోనప్పుడు, అటు వంటి బకాయిలు వచ్చే సంవత్సరానికి బదలీ చేసినట్టు ‘కాగ్‌’ గమనించింది. బడ్జెట్‌ కోతల కారణంగా 2016-17 చివరి నాటికి ఉన్న 81,303 కోట్ల బకాయిలు 2019-20 నాటికి 2,43,779 కోట్లకు చేరాయి. ఎఫ్‌సీఐకి కేంద్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించక పోవటం వల్ల దాని కార్యక్రమాలకు ఆర్ధిక సమస్యలు తీవ్రమైనాయి. బకాయిలు చెల్లించని కేంద్రం, ప్రజలు దాసుకున్న జాతీయ చిన్న మొత్తాల పొదుపు నుంచి రుణాలు అందించింది. 2019-20 మధ్య 2,54,600 కోట్ల విలువైన ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ రుణాలు ఎఫ్‌సీఐ వద్ద ఉన్నాయంటే ప్రజల సొమ్ము ఎలా మళ్లించారో అర్ధమౌతుంది. రాష్ట్రాలపై మోపిన భారం: ఆహార ధాన్యాలు ప్రత్యక్ష కొనుగోలు నుంచి ఎఫ్‌సీఐని తొలగించిన మోదీ ప్రభుత్వం, కేంద్ర ప్రజా పంపిణీకి అవసరమై ధాన్యం ఎఫ్‌ సీఐకి అందించే బాధ్యత మిల్లర్లపై పెట్టింది. రాష్ట్రాల అవసరాలకు ధాన్య సేకరణ రాష్ట్ర ప్రభుత్వాలే సేకరించుకో వాలని, కేంద్రం సేకరించదని పేర్కొన్నది. ఈ భారమే కాకుండా బియ్యం, గోధుమల మద్దతు ధరలు పెరుగుదల కారణంగా ఆహార సబ్సిడీ బిల్లు కేంద్రానికి పెరిగిందని, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఆహార ధాన్యాల సేకరణ, అమలు చేయటం అన్ని రాష్ట్రాల జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సేకరించటం ద్వారా కేంద్ర కేంద్ర ప్రభుత్వ ఖర్చును కొంత భర్తీ చేయవచ్చని స్టాండిరగ్‌ కమిటీ అభిప్రాయ పడిరది. 15వ ఆర్థిక సర్వే కూడా ఆహార సబ్సిడీ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి నిర్వహించలేని విధంగా ఉందని చెప్పింది.భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు నిధులు తగ్గించటం, ఎఫ్‌సీఐ ని ధాన్య సేకరణ నుంచి తిప్పించటం, రాష్ట్రాలే ధాన్య సేకరణ చేసుకోవటం, బీపీఎల్‌ కుటుంబాలను తగ్గించటం వలన మోదీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నది.
సెల్‌: 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img