Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మణిపూర్‌ తర్వాత హరియాణా

సుశీల్‌ కుట్టి

దాదాపు మూడు నెలలుగా మణిపూర్‌లో అల్లకల్లోలం ఏర్పడిరది. విచ్చలవిడిగా అల్లర్లు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని జాతుల మధ్య ఘర్షణలనేమాట వాస్తవం కాదన్న వాదనలు మెండుగా వస్తున్నాయి. మణిపూర్‌లో శాంతిభద్రతలు పూర్తిగా నశించిపోయాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మణిపూర్‌లో అనేక ఘోరాలు జరిగినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ రాష్ట్రం మంటల్లో తగలబడిపోతున్నా నిష్క్రియాపరత్వంగా ఉన్నారు. తాజాగా హరియాణలో పెద్దఎత్తున మత కల్లోలాలు చోటుచేసు కున్నాయి. ఇక్కడ కూడా శాంతి భద్రతలు హరించాయి. హింసాయుత సంఘటనలు జరిగిన నేపధ్యంలో మణిపూర్‌లోలాగే సమాచారం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు. ఇక్కడ ప్రభావం ఉత్తరప్రదేశ్‌లోని చాలా జిల్లాలలో ఉండవచ్చునని అక్కడి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మణిపూర్‌లో మంటలు చెలరేగుతుండగా మోదీ న్యూయార్క్‌, వాషింగ్టన్‌, కైరో తదితర ప్రాంతాలలో పర్యటిస్తూ మణిపూర్‌ విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే ఏ చర్యలూ చేపట్టకుండా మౌనంగా ఉందని దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. అలాగే హరియాణలోనూ ఒక పథకం ప్రకారం సంఘపరివార్‌ గ్రూపులు మతాలమధ్య ఘర్షణలను రెచ్చగొట్టినట్లుగా వార్తలు అందు తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అక్కడి బీజేపీ ప్రభుత్వం కూడా మోదీ మణిపూర్‌పైన ఎలా స్పందించలేదో ఇక్కడకూడా పెద్దగా స్పందించకపోవడం వెనుక మత ఘర్షణలు సృష్టించి ఎన్నికల్లో గెలవాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడకూడా శాంతిభద్రతల విషయంలో విఫలమైనందున సుప్రీంకోర్టు తనంతటతానుగా కేసును తీసుకుని విచారిస్తుందా..? లేదా ఇందుకు సంబంధించి పిటిషన్‌ దాఖలవుతాయా? అనే అంశాలు ఇంకా తేలవలసిఉంది. మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ హిందువులుగా పరిగణలోకి తీసుకున్న మెయితీలకు బాసటగా ఉన్నారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మణిపూర్‌లో జరిగిన కల్లోలం వల్లనే హరియాణలోనూ జరిగింది. అక్కడ జాతుల మధ్య చెలరేగిన హింస మాదిరిగానే హరియాణలో రెండు మతాల మధ్య అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మసీదును తగులబెట్టారు. ఆరుమంది అల్లర్లలో చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. రెండవరోజు ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.
హరియాణలో జరిగిన మత ఘర్షణలకు నిరసనగా విశ్వహిందు పరిషత్‌, భజరంగ్‌దళ్‌ భారీ ప్రదర్శన చేశాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ర్యాలీ జరుపుకోవచ్చునని సీిసీటీవీల ద్వారా నిఘా ఉంచాలని సుప్రీంకోర్టు అధికారులను కోరింది. హింసాకాండ జరగకుండా, విద్వేష ప్రసంగాలు లేకుండా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు దిల్లీలోనే దాదాపు 30 ప్రాంతాలలో ప్రదర్శనలు జరిపారు. హరియాణలో ఆస్థులకు తీవ్ర నష్టం జరిగింది. హింసాయుత ఘర్షణలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు చేయాలని నిరసనకారులు నినాదాలు చేశారు. సుప్రీంకోర్టుకి కొందరు పిటిషన్‌లు దాఖలుచేసి తక్షణం హరియాణ ఘటనపై శ్రద్ధవహించాలని కోరారు. ధిల్లీలోని సున్నితమైన ప్రాంతాలలో హింస జరగకుండా భద్రతను పెంచారు. హరియాణ లోనూ కొన్నిజిల్లాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని భావించారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ప్రదర్శనల్లో హనుమాన్‌ చాలీసా చదువుతూ పాల్గొన్నారు. దిల్లీలోనూ, హరియాణలోని సున్నిత ప్రాంతాల్లో పెట్రోలు ధరలను పెంచారు. మణిపూర్‌,హరియాణలు రెండూ హింసాకాండతో అల్లాడిపోయాయి. మణిపూర్‌లో ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదు. అయితే దిల్లీలో ప్రదర్శనలకు కోర్టు అను మతించింది. హరియాణలో అల్లర్లకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న 116మందిని అరెస్టు చేశారు. గాయపడినవారిని వివిధ ఆసుపత్రులలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. అల్లర్లకు కుట్ర పన్నినవారిని గుర్తించామని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img