London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Saturday, October 19, 2024
Saturday, October 19, 2024

మోదీ సంతృప్తికే సర్వే ఫలితాలు

సుశీల్‌ కుట్టి

బహుశా ప్రధాని నరేంద్ర మోదీ కోరుకున్నట్టుగానే ఈ నెల 14 న వెలువడిన సర్వేలో ఎన్‌డీఏకు ఎవరూ ఊహించలేనంతగా లోకసభ ఎన్నికల్లో సీట్లు రానున్నాయి. సర్వే నిర్వహించిన మీడియా సంస్థలు ప్రకటించిన సీట్ల సంఖ్య బీజేపీకూ నమ్మశక్యంగా లేవంటున్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏకు 411 సీట్లు వస్తాయని, బీజేపీకే 350 సీట్లు వస్తాయని ఆ సర్వేలు తెలిపాయి. మోదీ ప్రచారం చేస్తున్న 370 సీట్లకంటే 20 సీట్లు తగ్గాయి. ఇండియా కూటమికి అత్యంత ఉదారంగా 105 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌ ఒక్కటే అయితే 49 సీట్లు గెలుచుకుంటుంది. దయతలిచి ఇండియా కూటమికి ఆ మాత్రం సీట్లు ప్రకటించింది. సర్వే కేవలం బీజేపీకి 400, ఎన్‌డీఏకి 511సీట్లు వస్తాయని ప్రకటించి ఉండాల్సింది. ప్రధాన స్రవంతి గోదీ మీడియా సర్వే అంకెల ద్వారా ప్రధాని మోదీని పూర్తిగా సంతృప్తి పరిచింది.
పారిశ్రామికవేత్తలు నిర్వహిస్తున్న వెన్నెముకలేని మీడియా సంస్థలు సర్వేను ప్రకటించి ఆశ్చర్యపరచాయి. తమ యాజమాన్యం కోరుకుంటున్నట్లుగా సర్వేలను రూపొందించాయి. మూడవసారి అధికారాన్ని చేపట్టాలన్న కుతూహలంతో మోదీ ఉన్నారు. ఆయన ఆశకు తగినట్లుగానే మితిమీరిన విశ్వాసంతో భారీ అభిప్రాయ ఎన్నికల ఫలితాలను ఊహించి ప్రకటించాయి. ఎన్‌డీఏ భాగస్వాములు బీజేపీ మినహా తక్కినవారు 61సీట్లు గెలుచుకుంటారని చెబుతున్నారు. ఎన్‌డీఏలో భాగస్వాములైన తెలుగుదేశం, జనతాదళ్‌ఎస్‌ లాంటి పార్టీలు భారీగా సీట్లు గెలుచుకుని వేడుకలు చేసుకుంటాయా? హిందీ రాష్ట్రాలలో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ మొత్తం సీట్లను గెలుచుకుంటుందా? ప్రజాభిప్రాయం ఇలా ఉందని సర్వే నిర్వహించిన సంస్థలు ప్రకటించాయి. యూపీ, ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌్‌, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలలో అన్ని సీట్లను ఎన్‌డీఏ గెలుచుకుంటుందని సర్వే ప్రకటించింది. అంతేకాదు, కర్నాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ గణనీయంగా సీట్లు గెలుచుకుంటుందని సర్వే ప్రకటించింది. గుజరాత్‌లోని 26 సీట్లు కూడా మోదీ గెలుపు జాబితాలో ఉంటాయని సర్వే తెలిపింది. తమిళనాడులో 5, కేరళలో2 సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని సర్వే వెల్లడిరచింది. మీడియా సంస్థలు వెల్లడిరచిన సర్వే సక్రమంగానే ఉన్నదా? వాస్తవానికి ప్రజాభిప్రాయాన్ని ఎన్‌డీఏ వైపు మళ్లించేందుకే ఈ భారీ సర్వే అని చెప్పవచ్చు. ఇందులో ఏదైనాకావచ్చు. ఇలాంటి నమ్మలేని సర్వేలు ఎలక్ట్రానిక్‌ ఛానల్స్‌కి, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను మరింతగా పెనవేస్తాయి. ఒపీనియన్‌ పోల్స్‌ ఆ సంస్థల సన్నిహిత మీడియా కాన్‌క్లేవ్‌(భారీ సభ) మీడియాకు ప్రయోజనం కలిగించాయి. ఉదాహరణకు యజమాని, ఎడిటర్‌ అయిన టీవీ న్యూస్‌ ఛానల్‌ మీడియా కాన్‌క్లేవ్‌ను నిర్వహంచి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షానుకూడా ఆహ్వానించింది. యజమానిఎడిటర్‌కి తమకు కావలసిన సమాచారాన్ని ప్రోదిచేసేందుకు ఎంతైనా అవకాశం ఉంటుంది. తేలికగా నిర్వహించే ఒపీనియన్‌ పోల్స్‌కు పాలకులకు అనుకూలంగా ప్రకటిస్తే, పరస్పరం ప్రయోజనకరంగా ఉంటుంది. లాభదాయకమైన పరిశ్రమలను లేదా వాణిజ్యసంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది.
కాంగ్రెస్‌కు 49సీట్లు వస్తాయని ఇవి 2014లో వచ్చిన 44సీట్లకంటే 5 మాత్రమే ఎక్కువని సర్వే ఊహించింది. రాహుల్‌గాంధీ బారత్‌జోడో యాత్ర, భారత్‌జోడో న్యాయయాత్ర సందర్భంగా లక్షలాదిమంది ఆయనతో కలిసి నడిచారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మంచి విజయం సాధించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు మోదీ,షా అన్నిరకాల ఎత్తుగడలూ పన్నారు. ఇక్కడ ప్రభుత్వాన్ని తేలికగా కూల్చివేయగలమని బీజేపీ అంచనా వేసింది. కానీ, సాధ్యంకాలేదు. ఈ సర్వే సృష్టించింది కూడా కావచ్చు. దేశవ్యాప్తంగా మోదీ వేవ్‌ ఉన్నదా అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట ప్రభావం కొన్నివారాలు ఉండవచ్చు. ఇప్పుడు ప్రజలను నమ్మించేందుకు యూసీసీ వేవ్‌ను సృష్టిస్తున్నారు. అలాగే సందేశ్‌ ఖాలీ(బెంగాల్‌)లో జరిగిన కల్లోలానికి సంబంధించిన సమాచారాన్ని విస్త్రతంగా ప్రచారంలో పెట్టారు. నాలుగేళ్లక్రితం రూపొందించి దేశవ్యాప్తంగా నిరసన, ఆందోళన రేకెత్తించిన సీఏఏ కూడా పెద్దఎత్తున ప్రచారంలోకి వస్తోంది. పౌరసత్వనమోదు పేరుతో ముస్లింలకు, హిందువులకు మధ్య ఘర్షణ సృష్టించి తద్వారా హిందువుల ఓట్లను కొల్లగొట్టి గెలుపొందేందుకు మోదీ,షాలు ఎత్తుగడ వేశారు. ఇండియా కూటమికి 105సీట్లు వస్తాయని సర్వేలో పేర్కొన్నారు. ఇతర పార్టీలు అంటే ఏఐఏడీఎంకే, బీఎస్పీ, బీఆర్‌ఎస్‌, బీజేడీ, టీడీపీ, డీఎంకె, వైఎస్‌ఆర్‌సీపీ కలిసి 27సీట్లు గెలుచుకుంటాయా? ఈ సర్వే ఫలితాలు వాస్తవమే అయితే పోలైన మొత్తం ఓట్లలో సగం ఓట్లు బీజేపీకి లభిస్తాయి. సర్వేను ఫిబ్రవరి 12మార్చి 1వ తేదీ వరకు నిర్వహించారు. అన్ని లోక్‌సభ సీట్లలో 95శాతం సర్వే నిర్వహించినట్లుగా చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. వీటి పట్ల విస్త్రత ప్రాంతాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ప్రచారం చేయడానికి మీడియా జాప్యం చేయదు. మోదీ అనుకూల మీడియా బీజేపీ కోసం విస్త్రతంగా ప్రచారం చేస్తున్నది. మధ్యప్రదేశ్‌లో 29లోక్‌సభ సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించి అన్నిచోట్లా తామే గెలుస్తామని అతి విశ్వాసాన్ని ప్రదర్శిసున్నది. ఇండియా కూటమి ఇంకా అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. ఇండియా టీవీసీఎన్‌ఎక్స్‌, న్యూస్‌`18 బీజేపీ మొత్తం ఇక్కడ సీట్లను గెలుచుకుంటుందని ఊహిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అన్ని నియోజక వర్గాల్లోనూ పోటీ చేయవచ్చుగానీ, అన్నిచోట్లా గెలవడం తేలికేమీ కాదు. మోదీని సంతృప్తిపరచేందుకే సర్వే ఫలితాలను సృష్టించినట్లయితే మోదీ ఆశలు వమ్మవుతాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img