London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

యువతకు మార్గదర్శులైన యువకిశోరాలు

నక్కి లెనిన్‌ బాబు

భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని అనేకమంది పోరాటలు చేసిన చరిత్ర తెలిసిందే. సిపాయిల తిరుగుబాటు ఉద్యమానికి నాయకత్వం వహించిన మంగళ్‌ పాండే, సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టిన మహాత్మా గాంధీ, సాయుధ పోరాటాన్ని ప్రారంభించిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, విదేశాల్లో చదువుతున్న యువతను ఐక్యం చేసి గదర్‌ పార్టీ ఏర్పాటుచేసి నాయకత్వం వహించిన కర్తార్‌ సింగ్‌ సారాభాలు, సైమన్‌ కమిషన్‌ గో బ్యాక్‌ అంటూ లాలాలజపతిరాయ్‌ ఉద్యమించారు. బ్రిటిష్‌ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి వీర మరణం పొందిన రaాన్సీ లక్ష్మీబాయి, తెలుగు గడ్డపై విరోచితమైన పోరాటాలు చేసిన అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ ఆర్మీ సభ్యులు సర్దార్‌ భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌ దాపర్‌, శివరాం రాజ్‌ గురుల వీరోచితమైన త్యాగాలు అసమానవైనవి.
సర్దార్‌ భగత్‌ సింగ్‌ 1907 సెప్టెంబర్‌ 28వ తేదీన బంగా గ్రామంలో కిషన్‌ సింగ్‌, విద్యావతి దంపతులకు జన్మించాడు. భగత్‌ సింగ్‌ పినతండ్రి అజిత్‌ సింగ్‌ భారత స్వాతంత్ర పోరాటంలో క్రీయాశీలకంగా పాల్గొంటున్న రోజులవి. ఈ నేపధ్యంలో భగత్‌ సింగ్‌పై చిన్నప్పటి నుంచే స్వాతంత్ర ఉద్యమ ప్రభావం పడిరది. 1919 ఏప్రిల్‌ 13వ తేదీన జలియన్‌వాలాబాగ్‌ దారుణ సంఘటన నాటికి 12 సంవత్సరాల వయస్సు ఉన్న భగత్‌ సింగ్‌పై చెరగని ముద్రవేసింది. బ్రిటిష్‌ ప్రభుత్వంపై పోరాడాలని నిర్ణయించు కున్నాడు. జలియన్‌వాలాబాగ్‌లో రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా సుమారు 20వేల మంది సమావేశమైన సందర్భంలో జనరల్‌ డయర్‌ విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో వందలాదిమంది మరణించడం, అనేకమంది గాయాలపాలై రక్తంతో జలియన్‌వాలాబాగ్‌ తడిసిపోయింది. అక్కడికి వెళ్లిన భగత్‌ సింగ్‌ రక్తంతో తడిచిన మట్టిని తీసుకొని డయ్యర్‌ను చంపాలని ప్రతినబూనాడు. నౌ జవాన్‌, భారత సభ ప్రేరణతో అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. లాహోర్‌ నేషనల్‌ కాలేజీలో చేరిన భగత్‌ సింగ్‌ చురుకుగా ఉంటూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేవాడు. 1928 అక్టోబర్‌ 30 తేదీన వచ్చిన సైమన్‌ కమిషన్‌ను గో బ్యాక్‌ అంటూ పోరాటం చేసిన పంజాబ్‌ సింహం లాలాలజపతిరాయ్‌ను పోలీస్‌ అధికారి స్కాట్‌ లాఠీచార్జి చేయడంతో తలపై బలమైన గాయం అయ్యింది. లాలా లజపతిరాయ్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పంజాబ్‌ ప్రజలు ఆయన మృతి పట్ల పెద్ద ఎత్తున బ్రిటిష్‌ పాలన కు వ్యతిరేకంగా ఉద్యమించారు.
బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్ర లక్ష్యం కావాలని పోరాడుతున్న నేపథ్యంలో చంద్రశేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో హిందుస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ ఏర్పడిరది. బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా యువతను ఐక్యం చేసి కళాశాలలో విద్య నభ్యసిస్తున్న సర్దార్‌ భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌ థాపర్‌తోపాటు శివరాం రాజ్‌ గురు పోరాడారు. హిందుస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ ని హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ గా మార్చుకొని చంద్రశేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో పనిచేశారు. లాలాలజపతిరాయ్‌ పై లాఠీ ఛార్జ్‌ చేసి మృతికి కారణమైన బ్రిటిష్‌ పోలీస్‌ అధికారి స్కాట్‌ను హత్య చేయాలని నిర్ణయించుకొని 1928లో భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌ గురులు లాహోర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఉన్న స్కాట్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటికి రాలేదు. అదే సమయంలో మరో పోలీస్‌ అధికారి జెపి సాండర్స్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు వచ్చిన వెంటనే సాండర్స్‌ పై కాల్పులు జరిపి అతన్ని హతమార్చారు.
ఉద్యమాలను అణిచివేయాలని దేశంలో నూతన చట్టాల అమల కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం కుట్ర చేస్తున్న నేపథ్యంలో శాసనసభలో సర్దార్‌ భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌ ఇతర ఉద్యమ నాయకులు పొగబాంబు వేశారు. వలస పాలన నశించాలని, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనే నినాదాలు చేస్తూ పోలీసు లకు లొంగిపోయారు. బ్రిటిష్‌ పోలీస్‌ అధికారి జెపి సాండర్స్‌ హత్య కేసులో వీరు భాగస్వామ్యంగా ఉన్నారని విచారణ ప్రారంభించారు. జైల్లోనే ఉంటూ రాజకీయ ఖైదీలకు హక్కులు కల్పించాలని, సరైన సౌకర్యాలు కల్పించి, వార్తాపత్రికలు అందించాలని కోరుతూ భగత్‌ సింగ్‌ సుమారు 64 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. జెపి సాండర్స్‌ హత్య కేసులో సర్దార్‌ భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌ థాపర్‌, శివరాం రాజ్‌ గురులను దోషులుగా ప్రకటించి 1931 మార్చి 24వ తేదీన మరణశిక్ష ప్రకటిం చారు. మరణ శిక్ష నుంచి జీవిత ఖైదీగా ఉండేందుకు మిత్రులు క్షమాభిక్ష పిటిషన్‌పై సంతకం చేయాలని కోరగా నేను నమ్మిన సిద్దాంతంకోసం ప్రాణాలు అర్పిస్తానని, చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన దేశభక్తుడు. విచారణ సంద ర్భంగా జడ్జి ముందు మీరు వ్యక్తులను చంపడం సులువైనప్పటికీ సిద్ధాంతాలను సమాధి చేయలేరని జడ్జితో అన్నారు. గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయినా సిద్ధాంతాలు మాత్రం సజీవంగా ఉంటాయని భగత్‌ సింగ్‌ అన్నారు. మీ చివరి కోరిక ఏమిటని జడ్జి అడిగితే గదర్‌ పార్టీ నాయకుడు కర్తార్‌ సింగ్‌ సారాభా మళ్లీ జన్మిస్తే మీ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఉరి కంబాన్ని ముద్దాడుతామని చెప్పారు. ఉరితీసే ముందు పోలీసు అధికారులు వచ్చి మీరు స్నానం చేసి తయారు కావాలని చెప్పగా రష్యా కమ్యూనిస్టు విప్లవ నేత వి.ఐ.లెనిన్‌ రచన చేసిన వాట్‌ డూ జీవిత చరిత్ర చదువుతూ ఒక కమ్యూనిస్టు మరొక కమ్యూనిస్టు తో మాట్లాడుతున్నానంటూ సమా ధానం చెప్పాడు. 23 సంవత్సరాల వయసు కలిగిన సుఖదేవ్‌, రాజ్‌ గురులను విడుదల చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది. లాహోర్‌ జైలు గోడలు బద్దలు కొట్టి విడిపించాలని లక్షలాది మంది ప్రజలు అక్కడికి చేరుకోవడంతో నిబంధనలకు విరుద్ధంగా ఒక్కరోజు ముందే మార్చి 23 సాయంత్రం 7 గంటలకు సర్దార్‌ భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌ గురులను ఉరితీసి దొంగ దారిన హుస్సేనీవాల దగ్గర్లో ఉన్న సట్లేజ్‌నది దగ్గర వారి అంతక్రియలు నిర్వహిస్తున్న విషయం ప్రజలు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. వేలాదిమంది ప్రజలు అక్కడికి రావడంతో పోలీసు అధికారులందరూ పరారు కావడం అనంతరం ప్రజలు భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌ గురుల సగం కాలిన శరీరాలకు ప్రజలే అంత్యక్రియలు నిర్వహించారు.
ఎన్నో త్యాగాలు, పోరాటాలు, బలిదానాల వల్ల సాధించుకున్న స్వాతంత్రాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం స్వాతంత్ర ఫలాలను పక్కనపెట్టి ప్రజా సంక్షేమం కాకుండా కార్పొరేట్‌ సంక్షేమం కోసం కుట్ర చేస్తున్న నేపథ్యంలో యువత అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది. లాభాలు బాటలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను మూసివేసి ప్రైవేటీకరణ చేయాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. రైల్వే, ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఓడరేవులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, గ్యాస్‌, ఆయిల్‌ కంపెనీలన్నీ కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు పరిపాలన సాగిస్తున్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీనీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన హామీ అమలు కాలేదు. విదేశాల్లో దాగిన కోట్లాది నల్లధనాన్ని తీసుకురావడంలో వైఫల్యం చెంది మతోన్మాద రాజకీయాల ద్వారా లబ్ధి పొందేందుకు మోదీ ప్రయత్నిస్తున్నాడు. భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం, లౌకిక అనే పదాలను తొలగించి మను ధర్మశాస్త్రం అమలు కోసం మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రల పట్ల యువత అప్రమత్తంగా ఉండడంతోపాటు విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాది,ó ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం, మతసామరస్యాన్ని కాపాడుకుంటూ ఉద్యమించినప్పుడే అమరవీరులకు నిజమైన నివాళి.

(మార్చి 23 సర్దార్‌ భగత్‌ సింగ్‌ 93వ వర్ధంతి సందర్భంగా)

ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి
సెల్‌: 918247806001

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img