Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రేపు గ్రామీణ భారత్‌ బంద్‌ సక్సెస్‌ చేయాలి

చలసాని వెంకటరామారావు

గత పదేళ్లుగా నరేంద్ర మోదీ పాలనలో రైతుల, కార్మికుల ఆదాయాలకు బదులు కష్టాలు రెట్టింపయ్యాయి. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. సోషలిస్టు, సెక్యులర్‌ దేశం అని రాజ్యాంగంలో పొందుపర్చుకున్న లక్ష్యాలకు భిన్నంగా వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగాన్ని కొద్దిమంది పెట్టుబడిదార్ల పరం చేస్తున్నారు. రైతులు, కార్మికుల శ్రమ వల్ల కేంద్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది. ఎండ, వానలను లక్ష్యపెట్టకుండా రాత్రింబవళ్లు శ్రమచేసే రైతులకు కనీసమద్దతుధర ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం నిరాకరిస్తున్నది. అందరికీ అన్నంపెట్టే రైతులు, శ్రామికులు అర్థాకలితో, పస్తులతో కాలం వెళ్లబుచ్చవలసివస్తున్నది. సంవత్సరాల తరబడి పోరాటంచేసినా పాలకుల నిర్ణయంవల్ల పంటపొలాలను ఆశ్రయించి ఉండవల్సిన రైతులు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల నిమిత్తం దిల్లీ మహానగరం చుట్టుముట్టవలసిన అనివార్య పరిస్థితులను ప్రభుత్వం కల్పించింది. సంయుక్త కిసాన్‌ మోర్చా నేతృత్వంలో 13మాసాలపాటు మూడు వ్యవసాయచట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ 200 రైతు సంఘాలు చారిత్రాత్మకమైన పోరాటాన్ని దిల్లీ సరిహద్దులలో నిర్వహించారు. చిట్టచివరకు ప్రభుత్వం రైతుల పోరాటానికి లొంగివచ్చి రైతుసంఘాలతో చర్చించి మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేసింది. కనీసమద్దతు ధర, విద్యుత్‌ సవరణబిల్లు, మరికొన్ని ఇతర సమస్యలు విషయంలో రాతపూర్వక హామీలు ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఆ తరువాత ఆ హామీలను ప్రభుత్వం గాలికి వదిలివేసింది. సాగునీటి వనరులు లేక, ప్రాజెక్టుల నిర్మాణం ఏళ్లతరబడి పూర్తిగాక, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే రీతిలో పంటల బీమా పథకం లేక, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఎరువులు, పురుగుమందుల సరఫరా సక్రమంగా లేక రైతులు అప్పులుపాలై గ్రామీణ ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల వ్యవసాయ పెట్టుబడులు రెట్టింపైనప్పటికీ తగిన ఆదాయం రాక దేశ రైతాంగం దివాళా స్థితికి చేరిపోయింది. ఈ స్థితిలో ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాలను అమలుచేయాలని కోరుతూ గత సంవత్సర అన్నిరాష్ట్రాల రాజధానులలో, కేంద్రపాలిత ప్రాంతాలలో పెద్దఎత్తున 30రోజులపాటు కార్మికులు, రైతులు గవర్నర్ల కార్యాలయాలవద్ద పెద్ద ఎత్తున ‘మహాపడావ్‌’ నిర్వహించి ప్రభుత్వానికి తమ సమస్యలను ఏకరువు పెట్టడం జరిగింది. అయినా ప్రభుత్వంలో చలనంలేదు. తిరిగి జనవరి 26న దేశవ్యాపితంగా రైతు, కార్మిక సంఘాలు ట్రాక్టర్లతో నిరసన ప్రదర్శనలను నిర్వహించినా ప్రభుత్వం కళ్లు తెరవలేదు. దీనితో సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల జాతీయ వేదికలు సంయుక్తంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా ‘గ్రామీణ భారత్‌ బంద్‌’ జరపాలని పిలుపునివ్వటం జరిగింది.
దేశంలో రైతాంగం ఆందోళనలను, అసంతృప్తులను పసికట్టిన మోదీ ప్రభుత్వం వారి ఉద్యమసెగపై నీళ్లు చల్లాలనే కుట్రతో వ్యవసాయ సంస్కరణలకు ఆధ్యుడు, వ్యవసాయ శాస్త్రవేత్త డా.ఎం.ఎస్‌ స్వామినాథన్‌కు, మరో ఉత్తరాది ప్రముఖ రైతు నాయకుడు, మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌లకు ‘భారత రత్న’ ఇచ్చి గౌరవించింది. డా.స్వామినాథన్‌ సిఫార్సులు అమలుచేయకుండా, వారు సూచించని విధంగా రైతులు పండిరచిన పంటలకు కనీసమద్దతు ధరను ప్రకటించకుండా డా.స్వామినాథన్‌కు భారతరత్న ఇస్తే అది వారిని గౌెరవించినట్టా అని దేశ రైతాంగం పాలకులను ప్రశ్నిస్తున్నారు. చరణ్‌సింగ్‌ ఉత్తరప్రదేశ్‌లో రైతాంగ హక్కులకోసం నిర్విరామంగా శ్రమించారు. వారి ఆశయాలకు అనుగుణంగా రైతు సంస్కరణలు తేకుండా వ్యవసాయ రంగాన్ని, రైతులను నాశనంచేసే కాంట్రాక్టు వ్యవసాయ విధానం, కార్పొరేట్‌ల దోపిడీనిమిత్తం రైతుల చేతులకు సంకెళ్లువేసే చర్యలకు పాల్పడేవారికి భారతరత్న ఇవ్వటంలో అర్థంలేదు.
దేశంలో రైతులు, కార్మికులు చారిత్రక రైతు పోరాటం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక హామీలను అమలు చేయాలని కోరుతున్నారు. ఈ పోరాటంలో అమరులైన రైతులకు ‘సింగు’ సరిహద్దు వద్ద స్మారక చిహ్నం నిర్మించాలని కోరుతున్నారు. చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం, పునరావాసం కల్పించాలని పెండిరగ్‌లో ఉన్న కేసులను ఎత్తివేయాలని, రైతులను జీపుతో తొక్కించి చంపిన కుట్రలో భాగస్వామి అజయ్‌మిశ్రాని ప్రాసిక్యూట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంకా రైతులకు విత్తనాలు, ఎరువులు విద్యుత్‌పై సబ్సిడీని పెంచాలని కోరుతున్నారు. కనీసమద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని, రైతుల ఆత్మహత్యలను నివారించాలని, ధరల పెరుగుదలను నియంత్రించాలని రైతులు పట్టుబడుతున్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్వామినాథన్‌ సిఫారసులు అమలుచేస్తూ అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఏర్పడి రుణాలు చెల్లించలేని పరిస్థితులలో కమిటీనివేసి విచారణ జరిపించి రుణాలు రద్దు, లేదా వాయిదా వంటి వెసులుబాటు కల్పిస్తున్నది. ఇటువంటి వెసులుబాటు కేరళ తరహాలో దేశమంతా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. కార్పొరేట్‌ ఆనుకూల ప్రధానమంత్రి పంట బీమా పథకాన్ని ఉపసంహరించి, గ్రామం ప్రాతిపదికిన అన్ని పంటలకు ఉచిత సమగ్ర బీమా పథకం తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. ఇక కార్మికులకు సంబంధించి లేబర్‌కోడ్‌లను ఉపసంహరించాలని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని బలోపేతం చేయాలని, అమ్మకం నిలిపివేయాలని అన్ని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కనీసవేతనం 26వేలకు తగ్గకుండా ఇవ్వాలని, స్కీం కార్మికులను కూడా దీని పరిధిలోకి తేవాలని వారు కోరుతున్నారు. ప్రతి కార్మికునికి సంఖ్యతో నిమిత్తం లేకుండా పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు కల్పించాలని, పెన్షన్‌ ఇవ్వాలని కోరుతున్నారు.
సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు 16వ తేదీ గ్రామీణ బంద్‌కు పిలుపునిచ్చాయి. మరో ప్రక్క కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా మరికొన్ని సంస్థలు 13వ తేదీ ‘చలో దిల్లీ’ పిలుపునిచ్చాయి. ఆ మేరకు 13వ తేదీ పంజాబ్‌, హరియానా, ప్రాంతాల నుండి 2500 గూడు ట్రాక్టర్లలలో ఆహారపదార్ధాలతోపాటు దీర్ఘకాలం ఆందోళనకు సిద్ధమై 90వేల మంది రైతులు దిల్లీ బయలుదేరారు. కేంద్రపాలకులు అడుగడుగునా రైతులకు ఆటంకాలు సృష్టించారు. రోడ్లకు అడ్డంగా కాంక్రీటు గోడలు నిర్మించారు. పోలీసుల బలప్రయోగం, భాష్ప వాయుగోళాల ప్రయోగంతో దిల్లీ సరిహద్దులు ఉద్రిక్తంగా మారిపోయాయి. రైతులపై వాటర్‌క్యానన్‌లను ప్రయోగించారు. ఈ దాడిలో పలువురు రైతులు గాయపడినట్లు వార్తలువచ్చాయి. హర్యానా బీజేపీ ప్రభుత్వం 16జిల్లాలలో 144వ సెక్షన్‌ విధించి, 64 కంపెనీల పారామిలిటరీ దళాలను, 50 కంపెనీల పోలీసులను వినియోగించి నిరంకుశంగా రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు పూనుకుంది. అనేక ప్రాంతాలలో కాంక్రీట్‌ బారియర్లు, ముళ్లకంచెలు, జలఫిరంగులు రైతులపై ప్రయోగించారు. పంజాబ్‌, హరియానా, సరిహద్దు ‘శంభు వద్ద పదివేలమంది రైతులకు, పోలీసులకు మధ్య సంకుల సమరం జరిగింది. రైతులపై డ్రోన్లద్వారా టియర్‌ గ్యాస్‌ ప్రయోగించటం జరిగింది. వాటర్‌క్యానన్లు, రబ్బరు బులెట్లను కూడా ప్రయోగించారు. హర్యానా ప్రభుత్వం రైతులను ఉగ్రవాదులలాగా చూచిందని, రాష్ట్రాన్ని కాశ్మీరులోయలా మార్చివేసిందని పలువురు వ్యాఖ్యానించారు.
ఆరుగాలం కష్టించి దేశానికి అన్నంపెట్టే రైతన్నల మీద ప్రభుత్వం పాశవికంగా డాడిచేయటం, ప్రజాస్వామ్య యుతంగా శాంతియుతంగా ఆందోళన చేయటానికి దేశరాజధానికి వెళుతున్న రైతులపై కర్కశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుకు రైతు, కార్మికులు, ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేయాలి. పట్టుదలగా తమహక్కులకోసం 6మాసాలపాటు ఆహారధాన్యం, ఇతర అవసరాలతో సహా రాజధానికి బయలుదేరిన రైతు సోదరులకు ఆసేతు హిమాచల పర్యంతం రైతులు, ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. అందుకు ఫిబ్రవరి 16న రైతుసంఘాలు, కార్మిక సంఘాలు ఇచ్చిన ‘గ్రామీణ భారత్‌ బంద్‌’ను జయప్రదం చేయాలి. రానున్న సార్వత్రిక ఎన్నికలలో రైతు, కార్మిక హక్కులను హరించిన పాలకులకు తగిన బుధ్ధి చెప్పాలి. రైతులకిచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా వారిపట్ల నిర్దయగా వ్యవహరించిన పాలకుల వైఖరికి ప్రజలు బ్యాలెట్‌ ద్వారా సరైన సమాధానం చెప్పాలి. రైతు కంటి కన్నీరు జాతికే కళంకం తెస్తుంది. రైతులను చిన్నచూపు చూసిన ఏ పాలకులకు పాలించే అర్హతలేదు. ఏనాటికైనా రైతేరాజు కావాలి..

సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు
ఫోన్‌: 9490952093

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img