Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రైతు, కార్మికుల ర్యాలీలు సక్సెస్‌

కె.వి.వి. ప్రసాద్‌

2024 జనవరి 26 గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా రైతు, కార్మిక శ్రేణులు ట్రాక్టర్‌, బైక్‌లతో ర్యాలీలు నిర్వహించి కేంద్ర బీజేపీి ప్రభుత్వ విధానాలకు నిరసనధ్వనులు వినిపించాయి. ‘బీజేపీ హఠావో దేశ్‌ బచావో’ నినాదం ఎల్ల్లెడలా మారుమోగింది. కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16 న ఈ కింది డిమాండ్‌ల సాధనకు జరుగు గ్రామీణ, పారిశ్రామిక బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని సంయుక్త కిసాన్‌మోర్చా, కార్మికసంఘాల ఐక్యవేదికలు మరో మారు పిలుపునిచ్చాయి.
డిమాండ్స్‌ : (1) స్వామినాథన్‌ కమిటి సిఫార్సుల మేరకు అన్ని పంటలకు సి2G50 ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలి. కేరళ విధానాన్ని అమలు చేయాలి. (2) రైతుల రుణాలు మాఫీ, రుణ ఉపశమన చట్టం చేయాలి. (3) నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి. (4) కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి. (5) ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్‌లో రూ.2లక్షల కోట్లు కేటాయించి 200 రోజులకు పెంచాలి. వేతనం రూ.600 లు పెంచాలి. రెండు పూటల పని, ఆన్‌లైన్‌ మస్టర్‌ రద్దు చేయాలి. (6) ఆహార భద్రత చట్టాన్ని పటిష్టపరచాలి. (7) విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి. కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలి. (8) విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించాలి. స్మార్ట్‌ మీటర్ల బిగింపును నిలుపుదల చేయాలి. (9) భూ హక్కుల చట్టం 22 ను ఉపసంహరించాలి. (13) పోలవరం ప్రాజెక్టుకు నిధులు, నిర్వాసితులకు పూర్తి పునరావాసం, నష్టపరిహారం ఇవ్వాలి. (11) కరువు, తుపాను నష్టపరిహారాలను, ఇన్‌పుట్‌ సబ్సిడీలను వెంటనే ఇవ్వాలి. అందరికీ పంటల బీమా కల్పించాలి. (12) సాగులో ఉన్న కౌలు రైతులకే నష్టపరిహారాలు, బీమా సౌకర్యం ఇవ్వాలి. (13) అటవీ హక్కుల చట్టం సవరణలు ఉపసంహరించాలి. ఆదివాసుల హక్కులను కాపాడాలి.
రైతాంగ ఉద్యమ విరమణ సమయంలో రైతు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం రాత పూర్వకంగా ఇచ్చిన హామీలైన పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం, విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరణ అమలు చేయకుండా వ్యవసాయాన్ని కార్పోరేటీకరణ చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాలు, స్వాతంత్య్రం సిద్దించిన నాటినుండి కార్మికవర్గం సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి, ఎనిమిది గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచి శ్రామికవర్గ ప్రజల శ్రమ దోపిడికి చేసే ప్రయత్నాలు, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాల హమీ అమలు చేయకపోవడం, రిజర్వేషన్ల ఎత్తివేతకు ప్రయత్నాలు, ధరల పెరుగుదల, ఉపాధి హామీ నిధులలో కోత, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, రాజ్యాంగం రూపొందించిన సెక్యులర్‌ విధానాలను పాతరేస్తూ, మనువాద సిద్ధాంత అమలుకు పూనుకోవడంలాంటి చర్యలను ఖండిస్తూ రైతు, కార్మిక శ్రేణులు ఈ ర్యాలీలలో పెద్దపెట్టున నినదించాయి.
బీజేపీ పాలనలో అదానీ, అంబానీలు ప్రపంచ కుబేరుల జాబితాలో చేరారు. పేద రైతులు, గ్రామీణ పేదలు, అసంఘటిత రంగ కార్మికులు అప్పులపాలై సుమారు ఒక లక్ష యాభైవేల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభానికి గురయ్యాయి. ఫలితంగా నిరుద్యోగం పెరిగి యువత ఆత్మహత్యలకు ప్రేరేపితులౌతున్నారు. నరేంద్రమోదీ హయాంలో ప్రజాస్వామ్య హక్కులు హరించారు. పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయింది. రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతున్నది. రాజ్యాంగ విలువలు, మత స్వేచ్ఛపైన, బాషలు, సంస్కృతులపై బీజేపీ, ఆర్‌.ఎస్‌.ఎస్‌.ల దాడులకు అడ్డులేకుండాపోయింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిపై తమ అధీనంలోని ప్రభుత్వ దర్యాప్తు సంస్థ్ధలను ప్రయోగించి లొంగదీసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గత 10 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి రంగాలతోపాటు దేశ అభివృద్ధిలో వైఫల్యం చెందుతూ ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడిదారులకు కట్టబెడుతూ దేశాన్ని అప్పులకుప్పులా మార్చి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలని అయోధ్య రామమందిరం సెంటిమెంట్‌ను ప్రజలలో వ్యాపింపచేస్తున్నది. హిందువులు ఆరాధ్యదైవంగా పూజించే శ్రీరాముడిని రాబోయే ఎన్నికలలో ప్రచారకునిగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నది. మతాన్ని రాజకీయాలతో మిళితం చేస్తూ ప్రజల సమస్యలను పక్కదారి పట్టించే నీచానికి పాల్పడుతున్నది బీజేపీ.
కేంద్రప్రభుత్వం అమలుచేసిన ప్రజా వ్యతిరేక విధానాలను, మోసపూరిత వాగ్దానాలను ప్రజలు మర్చిపోకుండా సెంటిమెంట్‌కు లొంగిపోకుండా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిరచి దేశాన్ని కాపాడాలన్న నినాదంతో రైతులు, కార్మికులు ప్రజలను కలిసి ఎన్నికల చైతన్యవంతులను గావించి ఎన్నికల సమరానికి సిద్ధం చేయాలి. నరేంద్రమోదీ దుర్మార్గ పాలన అంతానికి సన్నద్ధం కావాలి…
ఏపీ రైతుసంఘ ప్రధాన కార్యదర్శి
ఫోన్‌: 490952737

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img