Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

లంకెబిందెలు

చింతపట్ల సుదర్శన్‌

సూర్యుడి కిరణాలు సీబీఐ వారి ప్రశ్నల్లా చెట్ల ఆకుల్ని వేడిగా గుచ్చుకుంటున్నాయి. మెరిసే ఎండలో నోటితో ఏదో పట్టుకుని అరుగువైపు ఉరికివస్తున్న డాగీవైపు పరిశోధనాత్మకంగా చూడసాగింది డాంకీ. దీనికివ్వాళ తిండి ఎక్కువైనట్టుంది. కడుపులో జాగాలేక నోటితో పట్టుకొస్తున్నట్టుంది అనుకున్న డాంకీ, డాగీ నోట్లో మందంగా నలుచదరంగా మెరుస్తున్న వస్తువు బేకరీలో కొట్టుకువచ్చిన ‘బన్ను’ కావచ్చు ననుకంది.
పరుగుపరుగున వచ్చి అరుగు ఎక్కిన డాగీ తన నోట్లో ఉన్న వస్తువుని డాంకీ ముందు పడేసి ‘ఎంజాయ్‌’ అని అరిచింది. అప్పుడు గానీ అర్థం అవలేదు అదేమిటో. కట్టగా కట్టిన కొత్త కాగితాల కట్ట అది. ఉత్తి కాగితాల కట్టకాదది జనం నానా గడ్డీమేసి కూడబెట్టే కరెన్సీ కట్టఅది. ఇదేమిటిది? నా ముందు పడేశావు? అంది డాంకీ. నీ కోసమే అట్టుకొచ్చేను. ఆకలైతే ఇప్పుడే తినెయ్యి, కాకపోతే డిన్నర్‌ టైంలో నమిలెయ్యి నీ కోసం ప్రేమతో తెచ్చానిది. నా లైఫ్‌లో నేను నీకిస్తున్న మొట్ట మొదటి గిఫ్టు ఇదే అంది డాగీ గర్వంగా తోక ఊపుతూ. గిఫ్టా, మరీ ఇంత ఖరీదైనదా. ఇది ఉత్తి కాగితాల కట్టకాదురోయ్‌ అన్నీ కొత్త ఐదువందల నోట్లు. లెక్కగడితే యాభైవేలు అనగా అరలక్ష దీన్ని నమలమంటున్నావా. ఏం నమిలితే ఏం? అయినా వీటి విలువ ఎంతయితే నీకేంటి నాకేంటి? నీకివి ఉత్తుత్తి కాగితాలే. పైగా ఓ పద్ధతిగా ఉన్నాయి. మరో ఆలోచన లేకుండా నమిలేసెయ్య అంది డాగీ. ఇది మనుషుల మాత్రమే తినే గడ్డి గాడిదలు తినేదికాదు. అయినా ఎ్కడ్నించి కొట్టుకొచ్చావు ‘ఏటీఎమ్‌’లో మూతి పెట్టవా? ఏటీఎమ్‌లు బద్దలు కొట్టడం, కార్డులు కొట్టేయడం మనుషులు చేసే దగుల్బాజీ పనులు.
నేనెందుకు చేస్తాను? మరి ఎక్కడివివి. దారిన పోతున్న దానయ్యదగ్గర నోటివాటం చూపేవా?అంది డాంకీ, కాదు నేనేం జేబు దొంగనీ, గల్లీ లీడర్నికాను. ఇది దొంగ సొమ్ముకాదు, దొరికిన సొమ్ము, దొరికిన దొంగ దొంగసొమ్మా మరి? అయితే అయి ఉండవచ్చు. ఐ డోంట్‌ నో. పెద్దోళ్లు ఉండే పెద్ద బంగళాల కాలనీలో ఓ విల్లా గేట్‌ మందు నోట్లని వ్యాన్‌లోకి ఎక్కిస్తున్నాడు. ఒకటి రోడ్డు మీద పడితే బన్నులా ఉన్నా ఉన్న దీని మీద కన్నుపడిరది. కాగితాలు నమిలితే నువ్వు గుర్తొచ్చేవు. ‘ఎ ఫ్రెండు ఇన్‌ నీడ్‌ ఈజ్‌ ఎ ఫ్రండ్‌ ఇండీడ్‌’ అని తెచ్చేశానంతే.
ఇప్పుడర్థమైంది. ఆ బంగాళాబాబు ఇంటిమీద ‘రెయిడ్‌’ అయింది. కప్‌బోర్డులనుండా కట్టలుకట్టలుగా ఉందట డబ్బు. డబ్బేకాదు. కిలోల లెక్కన బంగారమూ, దస్తాల లెక్కన భూ సంబంధ డాక్యుమెంట్లూ దొరికేయంట. నిన్నట్నించీ సోదాలు మోదలైనాయిలే. నువ్వంటే పేపర్‌ చదువుతావుకదా అన్నీ తెలుస్తయి. ఇంతకీ వాడెవడో డబ్బు జమ చేసుకుంటే ఈళ్లెందుకు సోదా చెయ్యాలి అంది డాగీ. అంది సంపాదించేవాడి కషార్జితం కాదు! సక్రమంగా చెయ్యాల్సిన పనిచెయ్యకుండా, అక్రమంగా చెయ్యకూడనిపని చెయ్యడానికి తీసుకున్న లంచమనెడి బహుమానమన్నమాట. ఇంగ్లీషువాడు మనవాళ్లకు అంటించిన ఒక మాయరోగం అన్నమాట అంది డాంకీ. ఇప్పుడు విషయం పూర్తిగా అర్థమైంది. ఎలక్షన్లప్పుడు ఓటు వెయ్యడానికి లీడర్లు బహుమతి అనబడే లంచం ఇస్తారుగదా ఓటర్లకి. అనవునవును ఉచితాలపేర జనాల ఓట్లు కొల్లగొట్టుడానికి ఇచ్చేవి కూడా లంచమే అసలీ భూ ప్రపంచమంతా లంచం చుట్టూనే తిరుగుతున్నది అని డాంకీ అంటుండగానే అరుగుఎక్కాడు అబ్బాయి.
ప్రజలసొమ్ము దోచుకోడానికి నాయకులు, ఉన్నత పదవుల్లో ఉన్న ఉద్యోగులూ పోటీపడుతున్నారు. వీళ్ల వెనక వాళ్లు, వాళ్లని నమ్ముకుని వీళ్లు ప్రజల్ని అమ్ముకుంటున్నారు. కప్‌బోర్లుల్లో వీళ్లూ వాళ్లూ లంకెబిందెలు దాచుకుంటున్నారు అన్నాడబ్బాయి. లంకెబిందలా ఈ కాలంలో కూడానా అంది డాంకీ. కోట్ల రూపాయల ఖరీదుచేసే, అనేక ఎకరాల డాక్యుమెంట్లు లంకెబిందెలే మరి తరతరాలకూ తరగని సిరి మరి అన్నాడబ్బాయి.
ప్రజల సొమ్ము పాపపు సొమ్మేకాదు, దొంగసొమ్ము కూడా. రోడ్డు మీద దొరికే చెత్తకాగితాలైనా తింటానుకాని ఈ నోట్లు తిని కడుపునొప్పి తెచ్చుకోను అంది డాంకీ. నిరుద్యోగివైనా నిజాయితీ ఉన్న మనిసివి అన్నా, నువ్వూ ఈ సొమ్ము ముట్టుకోవు నాకు తెల్సు. దీన్నిపట్టుకుపోయి ఆ వ్యాన్‌ దగ్గరేపడేసి వస్తానని నోట్లకట్టని నోటితో పట్టుకు బయలుదేరింది డాగీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img