Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వర్గ రహిత సమాజం

రా బావ ఏంటి తిట్టుకుంటూ వస్తున్నావు ఎవర్ని ఎందుకు. ఎందుకంటావేమిటి గత ఐదేళ్లలో పెరగనిది ఒకటి చెప్పు. ఇంటిపన్ను, నీటిపన్ను, చెత్త పన్నులతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు అసలు ఒకటేమిటి అన్నీ పెరిగాయి. మధ్యతరగతి వాళ్లం మనం ఎలా బతకాలో చెప్పు. నిజమే పన్నులు పెంచకుండా ప్రజల అవసరాలు ఎలా తీర్చాలి. గతంలో ఒక సామెత ఉంది. తాగినోడె కడతాడు తాళ్ల పన్ను అని. అది నిజమే కాని ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా ఉంది. పెంచిన పన్నులు కట్టేది మనం, తినేది తెల్లకార్డు పేదలు, అది సరేనయ్యా ఉన్న వాడి దగ్గర వసూలు చేయకుండా లేని వాడికి పెట్టడానికి డబ్బులు చెట్లకు కాయవుకదా. నాకిపుడు మహాకవి శ్రీశ్రీ అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి. గతంలో విరసం అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తెనాలి సభలో ఒక మాటన్నాడు. మెరక తవ్వకుండ పల్లం పూడదు. కోడిగుడ్డు పగల కొట్టకుండా ఆమ్లెట్‌ వెయ్యలేమని. ఇప్పుడు జరిగేది అంతే. ఉన్నవాడి వద్ద వసూలు చేయకుండా లేనివాడికి పెట్టలేముకద ఆ పనే జరిగింది గత ఐదేళ్లు. సమాజం సర్వజనులది. అందరూ సుఖంగా జీవించాలంటే అందరి సమస్యలు పరిష్కరించవలసిందె. అందువల్ల పన్నులు పెంచక తప్పదు బావ. గతంలో ఇద్దరో, ముగ్గురో ఉన్న బిలియనీర్లు ఇప్పుడు 200 దాటారు. మరి దేశ సంపద వందల మంది వద్ద ఉండి పోతే పేదలకు చెయ్యడానికి డబ్బు ఎక్కడినుండి వస్తుంది. బీజేపీ పుణ్యమా అని కుబేరులు దేశంలో పెరిగిపోతున్నారు. నిజమే గతంలో రాజకీయాల్లోకి సమాజసేవ కోసం వచ్చేవారు. ఇప్పుడు సంపాదనకోసం వస్తున్నారు. శారీరకంగా, మానసికంగా సమాజంకోసం పని చేయడమేగాక స్వంత ఆస్తులను పార్టీకి ఇచ్చిన నిస్వార్థ నాయకులను గతంలో చూశాం. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మానికొండ సుబ్బారావు లాంటి నాయకులు తమ స్వంత ఆస్తులను పార్టీకి ఇచ్చారు. ప్రజల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం పార్టీలు స్థాపించి వాటి మనుగడకోసం ఆస్తులు అర్పించిన నాయకులు వారు. కాని పార్టీల ద్వారా పదవి చేపట్టి పదవి ద్వారా సంపాదనే ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి. అధి కారంలో ఉన్న పార్టీ చేస్తున్న తప్పులు ఎత్తిచూపి ఏం చేయాలో, ఎలా చేస్తే ప్రజలకు ఉపయోగమో చెప్ప వలసిన బాధ్యత ప్రతిపక్షాలది. కాని ప్రస్తుతం అధికారంలో ఉన్న వారేమిచేసినా తప్పుగా భావించి అల్లరి చేయడమే ప్రతిపక్షాల బాధ్యతగా మారింది. ప్రస్తుతం భూముల రీ సర్వే విషయంలో అదే జరుగుతోంది. అది తెచ్చింది కేంద్రం అయితే, బీజేపీని ఏమీ అనకుండా రాష్ట్ర ప్రభుత్వాల దుశ్చర్యగా మాట్లాడటం గమనార్హం. పేదలకు పెడితే ఉన్నవాడికి కోపం ఉన్న వాడికి లబ్ది చేకూరితే లేనివాడికి కోపం ఉన్నవాడు లేనివాడుగా వర్గాలు విభజించిన సమాజంలో ఇది తప్పదు. ఇది సరే శ్రామికులు లేకుండా అభివృద్ధి జరగదు కదా అని. ప్రాజెక్టులు కట్టాలన్నా, రోడ్ల నిర్మాణం చేయాలన్నా, కాల్వలు తవ్వాలన్నా శ్రామిక వర్గం అవసరంకదా. మరి వారి కడుపు నిండకుండా పనిచేయలేరు కదా. నిజమే అందుకే శ్రీశ్రీ అంటాడు తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లు ఎత్తిన కూలీలెవ్వరు. ఒక్క షాజహాన్‌ నిర్మించలేదు కదా. అందుకే ప్రస్తుతం పేదలు, లోయరు, మిడిల్‌ క్లాసు, అప్పరు మిడిల్‌క్లాసు ధనవంతులుగా నాలుగు వర్గాలుగా సమాజం నిండి ఉంది. ఈ స్థితిలో శ్రామిక వర్గం పనిచేయనిదే అభివృద్ధి జరగదని తెలిసికూడా ఉన్న వారి వద్ద పన్నులు రూపంలో వసూలు చేసి పేదలకు పంచుతున్నా రనడం ఎంత వరకు సబబు. కాకపోతే పేదలకు ఉచితంగా పంచకుండా ఉపాధి కల్పించి తద్వారా వారి మనుగడకు ఇబ్బంది లేకుండా చూడడం మంచిది. అందుకు ప్రాజెక్టుల నిర్మాణం అవసరం. అందుకు ఆర్ధిక వనరులు అవసరం ఇవన్నీ ప్రభుత్వాలకు సవాలు లాంటిదే మరి. వర్గరహిత సమాజం ఏర్పడేంత వరకు ఇంతే మరి.
సెల్‌: 98855 69394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img