Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

వ్యవసాయ సంక్షోభానికి కారణాలు ఎన్నో!

డా॥ ఎం. సురేష్‌ బాబు

లక్షలాది మంది రైతులు ట్రాక్టర్లు, ట్రక్కులపై భారత రాజధాని న్యూదిల్లీ వైపు కవాతు చేస్తున్నారు, తమ ఉత్పత్తులకు హామీ ధరలు, రుణమాఫీ సహా తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అధికారులు దిల్లీలో పెద్ద సమావేశాలను నిషేధించారు. ఇతర ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పంజాబ్‌, హరియాణా నుంచి రైతులు దిల్లీ చలో పేరుతో దేశ రాజధానిని దిగ్బంధనం చేస్తున్నారు. దేశ ఆహారభద్రతకు కేంద్రంగా వ్యవసాయరంగం ఉంది. ప్రస్తుతం ఆ రంగం కుదేలైనందున దానికి సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వ జోక్యాన్ని డిమాండ్‌ చేస్తున్నందున ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. 2020-2021 నిరసనలలో సంయుక్త కిసాన్‌ మోర్చా కీలక పాత్ర పోషించింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతోపాటు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలం కావడంతో రైతులు తిరిగి ఆందోళన ప్రారంభించాల్సివచ్చింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రానున్న లోక్‌సభ ఎన్నికలలో రైతుల ఓట్లను భారీగా పొందేందుకు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తోంది, తప్ప రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడంలేదు. మోదీ ప్రభుత్వం గత వారం మాజీ ప్రధాని, వ్యవసాయ నాయకుడు చౌదరి చరణ్‌ సింగ్‌, వ్యవసాయ విప్లవానికి మార్గదర్శకుడైన స్వామినాథన్‌కు దేశ అత్యున్నత పౌర గౌరవం భారత రత్నను ప్రకటించింది. చిన్న కమతాలు, కరవు, అనావృష్టి, సరైన నీటి సౌకర్యాలు, ఆధునిక సాగు పద్దతులు లేకపోవడం వంటి సమస్యలతో భారత వ్యవసాయరంగం దశాబ్దాలుగా అతలాకుతలమౌతోంది. దేశ జనాభాలో సగం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. కానీ దేశ జీడీపీలో వ్యవసాయం రంగం ద్వారా వచ్చేది కేవలం 15 శాతం మాత్రమే. వ్యవసాయరంగం సంక్షోభానికి కారణాలు అనేకం ఉన్నాయి.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో వర్షాలు సంమృద్ధిగా కురిశాయి. పంటల దిగుబడి భారీగా పెరిగింది. ఉత్పత్తి పెరగడంతో ఉల్లి, ద్రాక్ష, సోయా, మెంతి, మిర్చి ధరలు భారీగా పతనమయ్యాయి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కనీస మద్దతు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోలేకపోయింది. ప్రభుత్వం రుణ మాఫీ పథకం ఎన్నడూ సరిగా పనిచేసేలా రూపొందించలేదు. అమలు గురించి ప్రశ్న కాదు. పథకం రూపకల్పనలో లోపాలున్నాయి. రుణ మాఫీకి సంబంధించి రెండో విషయం.. అప్పుల్లో అధిక భాగం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నవే. కేవలం బ్యాంకు రుణాలకు మాత్రమే ఉద్దేశించిన రుణ మాఫీ ఈ ప్రైవేటు అప్పులకు వర్తించదు. గ్రామీణ బ్యాంకింగ్‌ వ్యవస్థ అంతకంతకూ సమస్యాత్మకంగా మారుతోంది. ఒకవైపు రుణం పొందడం మరింత ఎక్కువగా కష్టమవుతోంది. ‘వ్యవసాయ రుణాలు నేను రెట్టింపు చేశాను… మూడు రెట్లు పెంచాను’ అని ప్రణబ్‌ముఖర్జీ నుంచి నిర్మలాసీతారామన్‌ వరకు ప్రతి ఆర్థికమంత్రీ చెప్పుకుంటారు. ఆ రుణాలు వ్యవసాయదారులకు చేరటం లేదు, వ్యవసాయ వాణిజ్యానికి వెళుతోంది. 2017 సంవత్సరానికి నాబార్డు మహారాష్ట్ర లింక్‌ క్రెడిట్‌ ప్రణాళికలో 53 శాతం రుణం ముంబై దాని పరిసరాల్లోని పట్టణ ప్రాంతాలకు కేటాయించింది. ముంబైలో వ్యవసాయ దారులెవరూ లేరు, కానీ వ్యవసాయ వ్యాపారాలున్నాయి. అంటే వ్యవసాయ రుణాల్లో సింహ భాగం వ్యవసాయానికి అందటం లేదు. దీనివల్ల చిన్న రైతులు రుణం పొందటం అంతకంతకూ కష్టమవుతోంది వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తారు. నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా వంటి వారు భారీ మొత్తాల్లో రుణాలు పొందుతారు. కానీ ఒక రైతు రూ. 50 వేల రుణమైనా సులువుగా పొందలేడు. ఈ రుణ మాఫీల ద్వారా మనం నీటి కుళాయి కట్టేయకుండా నేల మీద తడిని తుడుస్తున్నామన్న మాట. అందుకే అది పనిచేయడం లేదు. కనీస మద్దతు ధర అనేది స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సు. ఉత్పత్తి వ్యయాన్ని నిర్ణయించటానికి మూడు పద్ధతులున్నాయి. ఎంఎస్‌పీని నిర్ణయించే టప్పుడు… విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారాల వ్యయంతో పాటు కుటుంబ సభ్యుల శ్రమనూ, ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకోవా లని స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది. కానీ కేవలం విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ఖరీదు మాత్రమే ఉండే విధానాన్ని ఎంఎస్‌పీ నిర్ణయానికి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. రైతులకు మేలు చేసేది కాదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ ఆదాయం పెరుగుదల నామ మాత్రంగా ఉంటోందా? వాస్తవికంగా ఉంటోందా? అనేది విస్పష్టంగా చెప్పలేదు. ప్రభుత్వం కేవలం ప్రజలను మభ్యపెట్టే మాటలు మాత్రమే చెప్తోంది.
వ్యవసాయ సంక్షోభం 2014 తర్వాత పెరిగింది నిజమే. కానీ ఇది 2014 లోనే మొదలుకాలేదు. ఇది నూతన సరళీకరణ విధానాలను అమలుచేయటం మొదలైనప్పటి నుంచి 20 ఏళ్లుగా పెరుగుతూ వచ్చిన సంక్షోభం. అయితే 2014 నుంచి ఈ పరిస్థితి మరింతగా దిగజారిందని చెప్పొచ్చు. గత 20 ఏళ్లలో వ్యవసాయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరిన ఉదంతాలున్నాయి. కానీ 2014 నుంచి అది మరింత విషమించిందనేది నిజం. వ్యవసాయం గురించి ఏమాత్రం తెలియని పార్టీ బీజేపీ, నేడు రాజ్యాన్ని నడిపిస్తున్న కార్పొరేట్‌ రంగం లక్ష్యాన్ని పూర్తి చేయడమే ధ్యేయంగా ఆ పార్టీ ఎంచుకుంది. కార్పొరేట్‌ రంగానికి ఉత్తమ సేవలు అందించేందుకు బీజేపీ చాలా ముందుంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మతతత్వం వైపు మళ్లించడానికి బలమైన ప్రయత్నం జరుగుతోంది. సాధారణ ఎన్నికల్లో విభజన సామాజిక-ఆర్థిక విభజన నుంచి సామాజిక-మతతత్వ విభజనకు మారింది, పరిస్థితులు మరింత దిగజారనున్నాయి. ఎన్నికల్లో ఇతర అంశాలు చాలా ఉంటాయి. ప్రతిపక్షం ఏకమవుతుందా లేదా అన్న దాని మీద కూడా ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది. జాతీయ బ్యాంకుల రుణ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేసింది. బ్యాంకులు తమ రుణాలను రైతుల నుంచి మధ్య తరగతికి, ఎగువ మధ్యతరగతికి, నీరవ్‌ మోదీ వంటి వారికి మళ్లించాయి. నిజానికి గత 20 ఏళ్లలో భారతదేశంలో వ్యవసాయ కుటుంబాలు రెట్టింపయ్యాయి. అంటే వ్యవసాయ రుణాలు పెంచాలి. కానీ ప్రభుత్వం ఆ నిధులను సమాజంలో ధనిక వర్గాలకు ప్రత్యేకించి కార్పొరేట్‌ రంగానికి మళ్లించింది. వ్యవసాయాన్ని కార్పొరేట్లు స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వాలు సహాయం చేశాయి. నేడు వ్యవసాయంలో కీలకమైన పెట్టుబడి సాధనాలను కార్పొరేట్‌ రంగం నియంత్రిస్తోంది. బ్యాంకులు తమ రుణాలను రైతులకు బదులుగా కార్పొరేట్‌ రంగానికి మళ్లిస్తున్నాయి. కార్పొరేట్‌ రంగం లక్ష్యాలను నెరవేర్చటానికి ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. జాతీయ రైతు కమిషన్‌ అంటే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయాలి. వ్యవసాయ సంక్షోభం మీద పూర్తిగా చర్చించటానికి ప్రత్యేకంగా పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించాలి,
ప్రజాసైన్స్‌ వేదిక అధ్యక్షుడు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img