Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సత్యాగ్రహి సుమిత్రమ్మ` స్త్రీల హక్కులు

ఏప్రిల్‌ నెల వచ్చింది. ఎండలు ముదిరి గాడ్పులు సాగించాయి. ఓనాడు సాయంకాలం బయలుదేరి చాలా రోజుల నాడు చూచిన చెల్లెలు మంగమ్మను చూడటానికి వాళ్ల ఊరు వెళ్లాను. ఈ సోదరి తన స్వతంత్ర అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిరచుతుంది గాన ఆమె ఎడల నాకు గౌరవం మెండు. ఆ రాత్రి ఉక్కగా నుంటచే ఆరుబయటనే పరున్నాము. లోకాభిరామాయణం కబుర్లు కొంతసేపు జరిగిన తరువాత నిద్దురపోయాను. ‘‘సునిశితమతి వైశుభాంగ మేలుకో’’ అనే పాట హెచ్చు స్థాయిలో ఎవరో పాడుతున్నారు. నాకు మెలకువ వచ్చింది. బయటకు పోయి చూశాను. దేశ సేవికలు పాడుకుంటూ బజారునే వెళ్లుచున్నారు. ఆ ఊరి వాళ్లు చాలామంది మేల్కొని వారిని చూడటానికి బయటకు వచ్చారు. దేశ సేవికల వెంటనే ఇద్దరు పోలీసులున్నారు మఫ్టీలో. గుడివాడలో పికెటింగు చేస్త్తున్న వారిని, పోలీసులు మోటారు లారీలో ఎక్కించి ముదినేపల్లి వైపు దింపినారట. అక్కడ నుంచి వారు నడిచిపోతున్నారు. అక్కడ జేరిన వారితో నేను అన్నానుÑ స్వతంత్రాభిలాష ఎంత ఉత్సాహాన్నీ, శక్తినైనా ఇస్తుంది. పాపం! ఎన్నడూ నడిచి యెరుగని వారు అర్ధరాత్రి వేళ ఎంతో దూరం ప్రయాణం చేస్తున్నారు, ఆశ్చర్యం గదా! ఒక కాంగ్రెసు అభిమాని అన్నాడు:నిజంగా సత్యాగహోద్యమం ప్రజలలో నూతనోత్తేజాన్ని కలుగజేస్తోంది. స్త్రీలు కూడా మండిపోయే వేసవికాలంలో పికెటింగు చేయటం, లాఠీ దెబ్బలు తింటూ కూడా యువకులు ముందుకు రావటం నూతన శక్తిని సూచిస్తున్నాయి. ఒక సనాతనుడన్నాడు: అఘోరించినట్టులే ఉంది లెద్దురూ! ఏమిటబ్బా వచ్చింది! దెబ్బలు తింటేనూ, కావాలని జైలుకు పోతేనూ మాత్రమే వస్తుందేమిటి స్వరాజ్యం, ప్రభుత్వం వేళ్లు పాతుకుని ఉంటేనూ. పైగానేమో! స్త్రీలను కూడా బజారులకెక్కించారు. కాంగ్రెసు అభిమాని:ఆనకట్టకు పూర్వం కబుర్లు చెబితే యెలాగండి. స్వరాజ్యం కోసం అందరూ పోరాడాలిసిందే. ప్రజల్లో సగంమంది బానిసతనంలో ఉంచిన మనం స్వాతంత్య్రానికి అర్హులమెలా అవుతాం? చెల్లెలు మంగమ్మ: ఏమో! ఇది స్త్రీలు పొందిన స్వాతంత్య్రానికి చిహ్నమని నేను నమ్మను. పురుషుల ఆజ్ఞల్లో ఒక భాగంగానే, నేనెంచుతాను, వారి కోర్కెలు నెరవేర్చడానికే స్వరాజ్యం కోసమని యేర్పరచి కార్యక్రమంలో యీ దేశ సేవికలు పాల్గొంటున్నారు.
నేను:అల్లా అని నీవు మాపై చాలా అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నావు. మా కాంగ్రెసు వాళ్లు నిజంగా స్త్రీ స్వాతంత్య్రాన్ని ఆమోదిస్తారు. వారి ఉద్యమాలకు తోడ్పడతారు. చెల్లెలు మంగమ్మ: ‘కబుర్లు కేమిలే! ఇప్పుడు ఉద్యమంలోకి వచ్చిన సోదరీమణులను, ఎంతమందిని తరువాత రాచకీయోద్యమాల్లో పనిచేయడానికి అవకాశమిస్తారో! చూస్తాంగా! అప్పుడు వీరిని యింతగా కొనియాడే మీరు స్త్రీల హక్కు సత్వాల కోసం పోరాడే వారికి ఎంత సాయం చేస్తారో చూస్తానుగా’ అంది.
సోదరి సుమిత్రమ్మ ఆ దేశ సేవికలందరికి నాయకురాలు. వితంతువు. ఆ దళంలో అందరికంటే ధైర్యవంతురాలు. పోలీసులు పిచకారీలతో మసిలేనీళ్లు వూపిరి తిరుగుకుండా ముఖముపై కొట్టినపుడూ ఆమె భీతినొందలేదు. ఆమె అచంచలత్వమే తక్కిన సోదరీమణులందరికీ ధైర్యము నొసగి ఉద్యమాన్ని రేకొట్టించింది. సత్యాగ్రహోద్యమంలో తీవ్రంగా పనిచేయని కాంగ్రెసు నాయకులు, వలంటీరులు ఆమెను చూడడానికి సిగ్గుపడేవారు. సూటిపోటు మాటలతో ఆమె యీసడిరచి వేస్తుందనే భయంతో ఆమె దగ్గరకు వెళ్లటానికే జడిసేవారు. పోలీసులు దేశ సేవికలను సాయంత్ర బస్సుసై ఎక్కించి చాలా దూరాన విడిచి వస్తూంటే వారంతా పాడుకుంటూ ఏ తెల్లవారగట్టకో శిబిరానికి జేరుకునే వారు బస్సులపై యెక్క నిరాకరించితే బలవంతాన ఎక్కించుటకు ఆడ పోలీసులను కూడా నియమించారు. ఒక్కొక్కపుడు వీరిని అరెస్టు చేసి సబ్‌జైలులో 2 రోజులు ఉంచి విడుదల చేసేవారు. ఎలాగైనా యాతనపెట్టి ఉద్యమంలో నుంచి విరమించేటట్లు చేద్దామని పోలీసులు ప్రయత్నిస్తే, వారికే విసుగు పుట్టించేది సుమిత్రమ్మ. పోలీసువారు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఆమె చాలా గ్రామాల్లో జాతీయ వారం జయప్రదంగా జరిపించింది. చివరకు విసిగి వేసారి సుమిత్రమ్మను అరెస్టుచేసి సబ్‌జైలులో నుంచారు. ఆమె భారతదేశం నాదేరా! భారతీయుడనేనేరా అని సన్నని గొంతుతో పాడుతుంటే ఆఫీసులో వాళ్లంతా నివ్వెరపోయేవారు. ఒకసారి సర్కిలు ఆఫీసు పని జరుగుటలేదని కోపంతో ఆమె ఉన్న సెల్‌ (కొట్టు) ఎదుటకివచ్చి ‘‘సుమిత్రమ్మా నీవు మగవాడవై పుట్టి లంగోటి కట్టవలసిన దానవు’’ అన్నాడు. వెంటనే ఆమె అపుడు నీబోటివారు చీరకట్టి గాజులు తొడిగించుకోవాలసి వచ్చేది’’ అంది. మళ్లా తలయెత్తలా సర్కిలు.
విచారణచేసి సంవత్సరం శిక్షవేసి జైలుకు పంపారు సుమిత్రమ్మను. జైల్లో తాను యెన్నో బాధలుపడి, ఉపవాసాలు చేసి జైలు అధికారులను ఏడ్పించి, శిక్ష పూర్తిగా అనుభవించి బయటికివచ్చింది సుమిత్రమ్మ. అప్పటికపుడే గాంథీగారు శాసనోల్లంఘనాన్ని దిగవిడిచి హరిజన సమస్యను పైకి తెచ్చారు. హరిజనులకు దేవాలయ ప్రవేశ హక్కు కొరకు కాంగ్రెసు వారు ప్రచారం చేస్తున్నారు. సుమిత్రమ్మ తన సహజ వుత్సాహశక్తులతో తన వూళ్లో ప్రచారం సాగించింది. గ్రామంలో ప్రజలు చాలామంది హరిజనుల దేవాలయ ప్రవేశానికి సుముఖులయ్యారు. కాని ధర్మకర్తలు ఒప్పుకోలేదు. అంతట ఆమె ప్రజలందరి వద్దనుంచి సమ్మతులు తీసికొంది. నూటికి ఎనుబదిమంది దేవాలయ ప్రవేశానికి అనుకూలురే. కాని, లాభం! ధర్మకర్తలు ప్రజాభిప్రాయాన్ని లెక్కచేయనపుడు. అయితే సుమిత్రమ్మ స్వభావంలో ఏపనిని సగంలో విడుచుట కానిపని. దేవాలయం ముందు ఉపవాసాలు చేయడం మొదలుపెట్టింది. హరిజనులు దేవాలయంలో ప్రవేశించందే ఆహారం ముట్టనని ప్రతినచేసింది. పదిహేను రోజులుపవాసం జరిగింది. ఒకసారి స్మారకం తప్పింది. ప్రజలంతా ధర్మకర్తలను దూషించారు. వారు ప్రజాభిప్రాయానికి భయపడి అనుమతించారు. ఈసారి జయం సుమిత్రమ్మదే. ఉపవాసం మానివేసిందామె.
సుమిత్రమ్మ దేశ స్వాతంత్య్రం కొరకు పోరాటంలో పాల్గొని ఖ్యాతి పొందింది. తోటి దేశీయుల చేతనే అణచివేయబడిన హరిజనుల హక్కుల కొరకు పోరాడి దూషణాభూషణా కూడా పొందింది. కాని ఇకనో?….. సుమిత్రమ్మకు భర్త వారసులు మనోవర్తి యిస్తూ ఉండేవారు. కాని మనోవర్తి పుచ్చుకోడం హీనంగా కనబడిరదామెకు. తన భర్తకు ఆస్తిని న్యాయంగా తానే అనుభవించాలి. ఇట్లాగే అనేకమంది స్త్రీలు తమకు ధర్మంగా చెందాలసిన ఆస్తిని వారసులనుభవించగా, మనోవర్తితో జీవితాన్ని గడపటం దుర్భరంగా తోచిందామెకు. వారసుడైన మరిదితో తన భర్త భాగం తనకివ్వాలని పోరాడిరది. పొలంలో కోతకు అడ్డము తగిలింది. కాని ఆమె లేని సమయంజూచి, కోతకోసి కుప్పవేశారు. సుమిత్రమ్మ కుప్పలో తనకు భాగం ఉందని పేచీపెట్టింది. కాని ఆమెకు ఎవరూ సాయంచేయలేదు. పైగా యిది వరకు భూషించినవారే దూషించమొదలెట్టారు జాయింటు కుటుంబంలో భర్త చనిపోయిన తరువాత విధవకు ఆస్తిపై హక్కేమిటన్నారు. ‘లా’ లేదు గాన సుమిత్రమ్మ పోరాడటం ‘తెలివి తక్కువ’ ‘పిచ్చ’ అన్నారు. కాని ఆమె ‘శాసనాలతో లెఖ్క ఏమిటి? ధర్మాన్ని సాధించాలిÑ అనుకొంది. చాటుగా కుప్ప కొట్టుకుపోవాలని మరిది ప్రయత్నాలు తెలుసుకొంది. ఏ విధంగానైనా ధాన్యం అతనికి చెందకుండా చెయ్యాలనుకుంది. ఆ ధాన్యపు కుప్పకు నిప్పంటించి భస్మం చేసింది.
తా చేసినపని సుమిత్రమ్మ నిర్భయంగా ప్రజలందరికీ చెప్పింది. కొందరామెకు పిచ్చెక్కిందన్నారు. కొందరు మదించి అలాంటి పనులు చేస్తోందన్నారు. రిపోర్టు ననుసరించి పోలీసులు అరెస్టుచేసి సబ్‌జైలులో పెట్టారు. ప్రజలంతా సుమిత్రమ్మను కుప్ప తగులబెట్టి జైల్లో పడిరదని విపరీతంగా చెప్పుకుంటున్నారు. మితృలు రాజీపడి కేసు ఎత్తివేయునటుల చేదామని ప్రయత్నం చేశారు. న్యాయాధికారి ‘తానేమీ ఎరుగనని’ చెప్పితే, కేసు కొట్టివేస్తానన్నాడు. కాని వీనిలో దేనికీ సుమిత్రమ్మ ఒప్పుకోలా. ‘తన భర్త ఆస్తిని స్త్రీ అనుభవించడం ధర్మం కాదా! అందులకు విరుద్ధంగా కలిగే ఆటంకాలను ఆమె యెదుర్కోవడంలో తప్పేముంది. అందుకొరకు జైలుకు పోతే మాత్రం తప్పేమి’, అని ఆమె వాదన.
అనుమతి పొంది నేనూ, సోదరి మంగమ్మ సుమిత్రమ్మను చూడడానికి సబ్‌ జైలుకు పోయాము. నేను సుమిత్రమ్మతో అన్నాను. ‘మీరిలా చేయడం బాగుండలేదు. స్త్రీలకు ఆస్తి హక్కులు సంపాదించాలంటే, బలమైన ప్రచారం స్త్రీల మధ్య చెయ్యాలి. స్త్రీ జనమంతా ఉద్యమంలో పాల్గొని పోరాడేటట్లు చెయ్యాలి.
సుమిత్రమ్మ:సాగని మాటలు చెప్పవద్దు. స్త్రీలంతా పురుషుల ఆధీనంలో ఉన్న బానిసలు ప్రచారకుల మాటలు వారి చెవుల్లో దూరవు. అసలు పురుఫులు మాబోంట్లను వారి దగ్గరకే పోనివ్వరు. కాన వారి హృదయాల్లో ఆవేశం పుట్టించి, పులకాంకితులచేసి, వారి స్ధితిని ఆలోచించుకొనేటట్లు చేసే, ఉత్తేజకరమైన పనులు చెయ్యాలిసిందే. నేను: లాభమేముంది, వృథా కష్టమేగాని. ప్రచారంద్వారా శక్తులన్నింటిని సంఘటితం చేసుకోవాలి. ఆందోళన చేసి శాసనం మార్పించాలి.
సోదరి మంగమ్మ:` అన్నయ్యా! నీవు కూడా పాలకుల దృక్పథంతోనే చూస్తున్నావు. అధికారం చెలాయించేవారు శాసనాలను, తమ అధికారాన్ని నిలబెట్టుకోడానికే చేస్తారు. వాటి నుంచి కష్టనష్టాలు పడేవారు ఎపుడూ ప్రార్థనలవలన, శాసనాలను తమ కనుకూలంగా మార్పించుకోజాలరు. అందువల్లనే విప్లవాలు తప్పనిసరి అవుతాయి.
ఏదో నేను సుమిత్రమ్మను లొంగదీస్తానని మాట్లాడనిస్తున్న ఇన్‌స్పెక్టరు సోదరి మాటలతో కరకు మీరి ‘‘టైము అయిపోయింది. ఇక చాలించండ’’ న్నాడు.
విచారణ జరిగింది. నిప్పంటించి ఆస్తికి నష్టము కలిగించిందని కఠినశిక్ష విధించారు. సుమిత్రమ్మను రాయవెల్లు వెంటనే పంపించారు.
ఇపుడు సుమిత్రమ్మ పేరు తలచేవారే లేరు. ఇప్పటికీ సోదరి మంగమ్మ నన్ను దెప్పుతూనే ఉంటుంది. ‘‘స్త్రీలను సత్యాగ్రహోద్యమంలోనికి రానివ్వడం, పురుషులు కోరి ఆజ్ఞాపించి చేయించే అన్ని పనులవంటిదే గాని, స్వతంత్ర చిహ్నంకాదు! కాంగ్రెసువారు నిజంగా స్త్రీ స్వాతంత్య్రాన్ని అభిలషించితే, సత్యాగ్రహి సుమిత్రమ్మను కీర్తించి ఆకాశాన కెత్తినవారు, స్త్రీల ఆస్తిహక్కులకై పోరాడి జైలుకువెళ్లిన సుమిత్రమ్మ గురించి యోజింపనైనా యోచింపరేం! ప్రజలకేదో మేలు చేస్తామని అసెంబ్లీకి వెళ్లిన కాంగ్రెసువారు, డైవోర్సుశాసనం, స్త్రీలకు ఆస్తిపై హక్కునిచ్చే శాసనంగావించడానికి ప్రయత్నించరేం అని.

(చిత్రగుప్తలో మద్దుకూరి చంద్రంగారు రాసిన కథ)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img