Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సాంస్కృతిక పునర్జీవనంలో చంద్రం ప్రముఖ పాత్ర

చంద్రంగారితో దాదాపు 40 సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది. మేమంతా రాష్ట్ర కమిటీలో ఉన్నప్పటికీ ఒక పెద్దగా మేము ఆయనను గౌరవిస్తూ ఉండేవారం. ఆంధ్రదేశంలో కమ్యూనిస్టుపార్టీకి పునాదిరాయి వేసిన వారిలో వారొకరు. సుందరయ్య, కంభంపాటి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావు మొదలగు వారితో పాటు చంద్రంగారు కూడా రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమానికి పునాది వేశారు. అప్పటి నుంచి వారి జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితం చేశారు. నిస్వార్థంగా, నిరాడంబరంగా వారు సేవచేశారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన తీసుకువచ్చిన ప్రత్యేకతలున్నాయి. అనేక మంది యువకులు, జాతీయోద్యమంలో పాల్గొన్న వారు చాలా మంది మన రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నారు. వారందరికీ కూడా జాతీయోద్యమం మంచి సంప్రదాయాలున్నందు వల్ల వారు స్వయంగా ఆకలింపు చేసుకుని కమ్యూనిస్టు ఉద్యమంలోకి వాటన్నింటినీ తీసుకునివచ్చారు. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అక్కడ జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన వారందరూ కూడా దాదాపు నూటికి తొంబైమంది కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చారు. రావి నారాయణరెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, సర్వభట్ల రామనాథం. దేవులపల్లి వెంకటేశ్వరరావు ఇత్యాదులందరూ కూడా జాతీయోద్యమం నుంచి వచ్చిన వారే. వీరందరూ కమ్యూనిస్టు ఉద్యమంలోకి 1940 ప్రాంతంలో వచ్చారు. కానీ, చంద్రంగారు 1934 ప్రాంతంలోనే వచ్చారు.
ఒకానొక సందర్భంలో మన దేశ ప్రయోజనాలు, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం ప్రయోజనాలు వీటి రెంటికి మధ్య ఏదో వైరుధ్యం ఉన్నట్టు కనపడిరదిగానీ వాస్తవంలో అర్ధం చేసుకుంటే వైరుధ్యం లేదు. కానీ ఆ సందర్భాలలో కమ్యూనిస్టు ఉద్యమం శైశవ దశలో ఉన్నప్పుడు ఆ రెండిరటికి వైరుధ్యం లేనటువంటి విషయం సిద్ధాంత రూపంలో ఒప్పుకోవడం జరిగింది గానీ, ఆ చరణలో దానిని అన్వయించుకోవడంలో అనేక ఒడిదుడుకులు వచ్చాయి. సోవియట్‌పై నాజీ దాడి జరిగనప్పుడు నాజీ సైన్యాలు చాలా ఉధృతంగా, అనుకోని విధంగా మాస్కో వైపు పరిగెత్తుకుంటూ వస్తూ వుంటే అంటే దాదాపు ఒక నెలలోనే మాస్కో దగ్గరకు వచ్చేసినప్పుడు అసలు సోవియట్‌ యూనియన్‌ ఉంటుందా? పోతుందా? అని అనిపించినప్పుడు ఆ సందర్భంలో కాంగ్రెస్‌లో ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రు వంటి ప్రముఖులు కాంగ్రెస్‌ ఉద్యమంలో అంతర్జాతీయతను తర్వాత ప్రజాస్వామ్య సంప్రదాయాలను, ఫాసిస్టు వ్యతిరేక సంప్రదాయాలను నెలకొలిపినటువంటి వారు చాలా మంది బాధపడ్డారు. కాని కొంత మంది కాంగ్రెస్‌ నాయకులు మాత్రం చాలా ఉల్లాసంగా సోవియట్‌ యూనియన్‌ పోతోందంటే ఏదో మంచి జరుగుతుందనే అనుకున్నారు. ఆ నాడు యువకులుగా ఉన్న మేము అందుకు ఆగ్రహం చెందిన మాట వాస్తవం.
సోవియట్‌ యూనియన్‌ను కాపాడాలి, మరో వైపు దేశ స్వాతంత్య్రోద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ రెండిరటిని సమన్వయం చేసుకుకోవడం కష్టమైంది. ఆ సమయంలో దీనిని సమన్వయం చేయడానికి చంద్రంగారు చాలా తోడ్పడ్డారు. మొత్తం మీద ఆంధ్రా యూనిట్‌లోని మేమందరం చంద్రంగారు చేసిన సమన్వయానికి ఒప్పుకున్నాం. సోవియట్‌ యూనియన్‌ జీవన్మరణ పోరాటంలో ఉన్నప్పుడు మాకు జాతీయవాదులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏమి చేయాలా అన్న సమస్య మాకు ఎదురైంది. కాట్రగడ్డ మధుసూదనరావు వంటి పెద్దలు కొందరు మాకు సలహాలు చెప్పేవారు. ఇటువంటి వారు చేసేది తప్పేగానీ వారిని పంచమాంగ దళం అని అనకూడదని వారు చెపుతుండేవారు. వారితో మేము ఒప్పుకున్నాం. వారు పొరబడిన దేశభక్తులు అంతే. అప్పుడు చంద్రంగారి నాయకత్వాన మేము ఆ విధంగానే నిర్ణయానికి వచ్చాం. కానీ, కేంద్రం నుంచి వ్యాసాలు మాకు వేరే విధంగా వచ్చాయి. సుభాస్‌ చంద్రబోస్‌ ఏజంట్‌ అనీ, జయప్రకాశ్‌ నారాయణపైన కూడా అదేవిధమైన వ్యాసం వచ్చింది. చంద్రంగారి సలహా ప్రకారం, ఆయన నాయకత్వం క్రింద ఈ వ్యాసాన్ని ఆ నాటి పార్టీ పత్రిక ప్రజాశక్తిలో ప్రచురించడానికి మేము నిరాకరించాం. అప్పుడు మమ్మల్నందరినీ కేంద్రానికి పిలిచారు. నేను, చంద్రంగారు, బసవపున్నయ్య, కడియాల గోపాలరావు బొంబయి వెళ్లాం. తీరా మేమక్కడికి వెళ్లే సరికి హిందూ, ముస్లిం మతకలహాలు జరుగుతున్నాయి. అప్పుడు మాకు ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి పుట్టలేదు. మా కల్ల ఎదుటనే హత్యాకాండ జరుగుతుంటే ఏమి చేయలేని పరిస్థితిలో ఇక్కడ ఉండడం అనవసరం, మన ప్రాంతానికి వెళ్లిపోదాం అనుకున్నాం. పార్టీ కేంద్రం వారు చివరకు మాకు నిర్ణయం యిచ్చారు. దాని ప్రకారం ఒక వ్యాసం తరువాత మరొక వ్యాసం కేంద్రం వారు పంపిన విధంగా ప్రచురించం. ముందు బోసు మీద వ్యాసం వేశాం, తరువాత జయప్రకాశ్‌ నారాయణ మీద అనంతరం రంగా మీద వేశాం. దానితో విజయవాడ వీధులు రణరంగంగా మారాయి. దానితో వలంటీర్లను పెట్టుకుని మీటింగ్‌లు నిర్వహించాల్సిన పరిస్థితులు వచ్చాయి. నాకు ఇటువంటి వాటిలో అప్పుడు పెద్ద అనుభవంలేదు. కానీ, చంద్రంగారి నాయకత్వం క్రింద బోసు తదితరులను అలా అనడం పొరపాటని భావించాం. కానీ, మాకు అనాడు అంత తాహతులేదు. ఆ నాడు బొంబయి నుంచి మేము బయలుదేరే సమయానికి హిందూ ముస్లింల కలహాలలో ఏ క్షణంలో ఎవరు పొడుస్తారా అన్న పరిస్థితి, నలుగురు నాలుగు పక్కల నుంచి స్టేషన్‌కు వచ్చాం. స్టేషన్‌ ఫ్లాట్‌ఫారం మీద కూడా ముస్లింలను పొడుస్తున్నారు. ఎందుకంటే అక్కడ ముస్లింలకు బలంలేదు. మేము పంచలు కట్టుకున్నాం కనుక మమ్మల్ని ఎవరూ ఏమి అనలేదు.
చంద్రంగారి ఆదర్శ గుణగణాలు
చంద్రంగారి గుణగణాల గురించి తెలసిన వారు చాలా మంది ఉన్నారు. ఆయన గురించిన స్మృతులు కూడా ఉన్నాయి. నేను కొన్నింటినే ప్రస్తావిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. లెనిన్‌ జీవితంలో ఏ గొప్ప గుణగణాలున్నాయని మనం చదువుకున్నామో చంద్రంగారిలో అలాంటి గుణగణాలన్నింటిని మేము చూడగలిగాం. ఇంత పెద్ద జీవితంలో ప్రతి వ్యక్తి ఏవో కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంటారు. ఏ పొరపాట్లు చేయరని నేను అనుకోను. చంద్రంగారు చనిపోయిన తరువాత, మరోసారి ఆయనతో నాకు గల 40 ఏళ్ల సహచర జీవితాన్ని ఒకసారి పరిశీలించి చూసినప్పుడు నాకు ఏమీ దొరకలేదు. మానవునికి అనేక ఆపేక్షలుంటాయి. ఆ విధంగా ఉండడం తప్పుకాదు, వాటిని సాధించడానికి తప్పుడు పద్దతులు అవలంబిస్తే అది తప్పు. ఈ 40 ఏళ్ల సహచర్య జీవితంలో ఆయనలో ఎటువంటి స్వార్ధంగానీ లేదా ఉద్యోగ ఆపేక్ష వంటివి నాకు ఏకోశాన కనపడలేదు.
మా నలుగురిలో అంటే సుందరయ్యగారు, నేను, చంద్రంగారు, బసవపున్నయ్య గార్లలో ఎవరు ఎక్కడికి వెళ్లాలి, ఏ బాధ్యతలు వహించాలన్నప్పుడు సుందరయ్యగారు, బసవపున్నయ్య గార్లను పార్లమెంట్‌లోనూ, నన్ను శానసమండలిలోనూ ఉండమన్నారు. చంద్రంగారు రాజ్యసభకు వెళ్లాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ, చంద్రంగారు నేను ఎందుకయ్యా దాంట్లో కేఎల్‌ నరసింహారావును పంపితే ఉపయోగపడుతుందన్నారు. ఆ ప్రకారంగానే కేఎల్‌ నరసింహంగారు అప్పుడు రాజ్యసభకు వెళ్లారు. అది రైల్వే పనివార్ల ఉద్యమానికి ఉపయోగపడిరది. అలా మొదటి నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంస్థలలో పదవులకు, అట్టి వ్యామోహానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఇట్టి వ్యామోహం నేడు కమ్యూనిస్టు ఉద్యమంలో లేకపోయింది.
పార్టీ ఐక్యత కోసం చంద్రంగారి కృషి
ఇక శిక్షణ విషయంలో ఆయనకు ఆయనే అందెవేసిన చెయ్యి. ఏ ఒక్క సమయంలో కూడా ఆయన పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించలేదు. పార్టీ ఐక్యతను కాపాడడం కోసం చంద్రంగారు చాలా కృషి చేశారు. రాష్ట్ర కమిటీలో తీవ్ర అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు చంద్రంగారు ఏదో విధంగా సర్ది ఆయన అభిప్రాయాలను కూడా పక్కనపెట్టుకుని రాష్ట్ర కమిటీని ఐక్యంగా ఉంచడానికి కృషి చేశారు. ఆ రోజులలో జైల్లలో కూడా అభిప్రాయభేదాలు వచ్చాయి. నాలుగు గోడల మధ్య ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేనప్పుడు అది కడలూరు జైలు అనుకుంటా అప్పుడు ఆ జైలులో ఉన్న చంద్రంగారు చాలా ఐక్యంగా నిర్వహించారు.
సామాన్య పార్టీ సభ్యునిగా చంద్రంగారి జీవితం
నాయకుడు అన్న వాడు సామాన్య పార్టీ సభ్యునిగా ఉండడం చాలా కష్టసాధ్యమైన విషయం, కానీ చంద్రంగారు మాత్రం అది సాధ్యమని ఆచరణలో రుజువు చేశారు. ఎందుకంటే నాయకునిగా ఉన్న వాడిని తొలగించినప్పుడు అనేక అవలక్షణాలు ప్రదర్శించిన వారున్నారు. అసలు ఇటువంటి వారు నాయకత్వంలో ఇన్నాళ్లు ఎలా ఉన్నారా అని అనిపించేటట్లు ప్రవర్తించిన వారు ఉన్నారు. కానీ పార్టీలో ముఠా తత్వం వచ్చిన తరువాత చంద్రంగారు ఒక నిశ్చయానికి వచ్చారు. ఇక తాను పార్టీని ఐక్యంగా ఉంచలేను, ముఠా తత్వంలో పాల్గొనలేనని రాష్ట్ర కార్యవర్గం, కౌన్సిల్‌లో చెప్పారు. అప్పుడు తన భార్య పేరు మీద ఉన్న కొద్ది పాటి భూమిని అమ్మి (తన పేరమీద ఉన్న భూమిని ఎప్పుడో పార్టీకి ఇచ్చి వేశారనుకోండి) కర్నూలు జిల్లా వెళ్లి అక్కడ కొంత భూమి కొని సాగుచేసి, స్వయంగా దున్ని ఆ విధంగా వ్యవసాయం చేసుకుంటూ అక్కడ చిన్న పార్టీ యూనిట్‌ని నిర్మించారు. అందులో సామాన్య పార్టీ సభ్యులుగా ఉంటూ క్రమశిక్షణాయుతంగా తన జీవితాన్ని గడిపారు. ఇది మనందరికీ శిరోధార్యం.
(1974 ఆగస్టు 22వ తేదీన విశాలాంధ్ర కార్యాలయంలో జరిగిన మద్దుకూరి చంద్రంగారి సంస్మరణ సభలో నాటి సీపీఐ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు గారు చేసిన ప్రసంగం సంక్షిప్త పాఠం)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img