Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం ‘వ్యంగ్యభరితం’

డాక్టర్‌ జీకెేడీ ప్రసాద్‌

ఎన్నికల వేళ సామాజిక మాధ్యమాల్లో వినూత్న పద్ధతుల్లో పార్టీల ప్రచారం తీవ్రంగా కొనసాగుతోంది. అధికారపక్షం మద్దతుదారులు విపక్షాలను, ప్రతిపక్షం అభిమానులు అధికార పక్షాన్ని దుర్భాషలాడుకుంటున్నాయనే చెప్పాలి. కుగ్రామాల్లోనూ వేగవంతమయిన అంతర్జాల సదుపాయం సామాన్యులకు సైతం స్మార్ట్‌ఫోన్‌ నుంచి భారీమొత్తంలో వినోదాన్ని అందిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే సినిమా, టెలివిజన్‌ ప్రసారాలను సైతం పక్కనపెట్టించిందని చెప్పాలి. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో దించిన తలఎత్తకుండా నిమగ్నమయిపోతున్నారంటే ఆశ్చర్యం లేదు. వెనకటికి పేకాటలో కూర్చున్నోడికి తల్లో, తండ్రో చచ్చిపోయారని ఇంటి నుంచి కబురొస్తే శవాన్ని ఈ దారిలోనే తీసుకెళ్తారు కదా..! ఆ జనంలో కలుస్తానులే అనే సామెత గోదావరి జిల్లాల్లో బహుళ ప్రచారంలో వుంది. ఇప్పుడు అది ఇంకా ఎక్కువ శాతం సామాజిక మాధ్యమాలకు కూడా వర్తిస్తుందనే చెప్పాలి. ఈ పరిస్థితి సామాజిక మాధ్యమాల్లో వివిధ అంశాలను ప్రసారంచేసే వృత్తి నిపుణులకు అనుకూలంగా మారింది. మంచి లాభసాటి వ్యాపారంగా కొనసాగుతోంది. చాలా రంగాలతోపాటు ఇప్పుడు రాజకీయమూ వీటిలో చేరింది. ప్రధాన స్రవంతి పత్రికలు, ఛానళ్లు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాయంటే నమ్మేజనం ఎవరూలేరు. ఈ నేపథ్యంలో నిర్భయంగా ఇక అభిప్రాయాలను వెల్లడిరచడానికి సామాజిక మాధ్యమాలు ఒక్కటే వేదికలయ్యాయి.
సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. దీనిలో స్వతంత్రంగా కొంతమంది వ్యక్తులు, సంఘాలు నిర్మాణాత్మక విమర్శ చేస్తుండగా, విపక్షాలు పూర్తిగా వ్యంగ్యం, హాస్యం, హేళనలతో ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ తదితర వేదికల్లో పోస్ట్‌లు, వీడియోలు, రీళ్లలను ప్రసారం చేస్తున్నాయి. ఈ ట్రోల్స్‌కి చాలా వేగంగా లక్షల్లో ప్రేక్షకాదరణ లభిస్తుంది. రేటు పలుకుంది. ప్రజల్లో భావోద్వేగాల్ని రేకెత్తించడానికి వివిధ సందేశాలను ఉపయోగిస్తున్నారు. ప్రజలు తమ ఆలోచనలు, అభిప్రాయాలను స్వేచ్ఛగా పోస్ట్‌ చేయగల బహిరంగ మాధ్యమంలో ఎక్కడైనా ట్రోలింగ్‌కి విచ్చలవిడిగా అవకాశాలు లభిస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని ఘటనలను పరిశీలిస్తే గతంలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ పాలనలో రాజకీయ నాయకులతో పాటు పారిశ్రామికవేత్తలకూ మీడియాలో సమాన ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం మీద సామాజిక మాధ్యమాల్లో చాలా తీవ్రంగా వ్యంగ్య ప్రసారం జరుగుతూనే వుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది తన గెడ్డాన్ని చాలా పొడవుగా పెంచిన రోజుల్లో ఠాకూర్‌తో పోల్చారు. ‘‘అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం’’ సినిమా గీతాన్ని పోలినట్టు ‘‘అ అంటే అంబానీ అ అంటే అదానీ’’ అంటూ చాలా ట్రోలింగులు జరిగాయి. ఇటువంటివి ఇంకా చాలానే వున్నాయి. కేంద్ర, రాష్ట్రాలకు 2024 సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయిన తర్వాత ఈ పరంపర మరింత వెర్రితలలేసింది. కేంద్ర రాజకీయాల మీద జరుగుతున్న ప్రచారం ఒక ఎత్తయితే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ప్రచారం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అధికార వైఎస్సార్‌ పార్టీ ఇంతవరకు అమలుచేసిన పథకాలు, అభివృద్ధి గురించి చెప్పుకుంటుంది. సంక్షేమ పథకాల్లోను, అభివృద్ధిలోను నిజం లేదని ఇవన్నీ కేవలం తాత్కాలిక ఉపశమన కార్యక్రమాలేనని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయంతో కాలయాపన జరిగిన విషయం మీద చాలా వీడియోలు ట్రోల్‌ అవుతున్నాయి. మద్యం మాఫియా, మాదకద్రవ్యాల అక్రమరవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌, గంజాయి, హత్యలు, దాడులు, విధ్వంసాలు, భూ కుంభకోణాలు, దురాక్రమణలు, అక్రమ మైనింగ్‌, పర్యావరణ చట్టాలను పక్కనబెట్టి కొండల తవ్వకాలు, ఆపై నిర్మాణాలు, న్యాయస్థానాల ఆదేశాలను పెడచెవిన పెట్టడం, మితిమీరిన సలహాదారుల నియామకాలు తదితర ప్రభుత్వ ధనాన్ని హరిస్తున్న అనేక విషయాలను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు.
తొలి అయిదేళ్ల తెలుగుదేశం పాలనలో అమరావతి రాజధానిగా తాత్కాలిక నిర్మాణాలు జరిగాయి. తర్వాత ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడు రాజధానులను ప్రకటించింది. చాలా నిరసనోద్యమాల మధ్య ఈ నిర్ణయం సర్వోన్నత న్యాయస్థానంలో నిలుపుదల అయింది. ఈ సందర్భాన్ని రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎర్రచందనం, గంజాయి, డ్రగ్స్‌ మాఫియాలను మూడు రాజధానులుగా పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో రీళ్లు విచ్చలవిడిగా ప్రసారం జరుగుతున్నాయి. ఇవి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ సులభంగా లభిస్తున్న గంజాయి మీద సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంగా చాలా రీళ్లు ప్రసారమయ్యాయి. ‘‘ఇంటర్‌మీడియట్‌ చదువుతున్న విద్యార్థులకు తెలుస్తున్న గంజాయి జాడ వైసీపీ ప్రభుత్వంలో పోలీసులకు తెలియడం లేదు.’’ అని చాలా మంది ట్రోల్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో చీకటి మద్యం వ్యాపారం జరుగుతోందని ప్రజాసంఘాలు, విపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి మద్యం మీద ప్రభుత్వానికి వచ్చే పన్నుతో ‘అమ్మఒడి’ పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి పన్నులను ప్రత్యేకించి ఏదో ఒక పథకం అమలు కోసం వనరుగా ప్రకటించలేదు. ప్రభుత్వ విధానాల్లో ఇదే తొలిసారి. ఈ విధానానికి మూలాధారం ఏమిటో ఉన్నతాధికారులకు లేదా చట్టసభలకు తెలియరాలేదు. ‘‘మద్యం మీద పన్ను అమ్మఒడి దన్ను’’, ‘‘అమ్మఒడి నాన్న గుడి’’ వంటి శీర్షికలతో కూడిన కొన్ని మందుబాబుల వీడియోలతో తీవ్రంగా ట్రోల్‌ జరిగింది. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో పెద్దఎత్తున కట్టుబడి ఇసుక కొరత వచ్చింది. కరోనా రెండేళ్ల కాలంలో భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేవు. ఈ కష్టపరిస్థితుల నుంచి ఇసుక మాఫియా పుట్టుకొచ్చింది. అధికారపక్షానికి చెందిన నాయకులే ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడు తున్నారని విపక్షాలు దుయ్యబట్టాయి. ఈ సంద ర్భంలో ‘‘పగలు ఇసుక కొరత ` రాత్రి లారీల వరద’’ శీర్షికన సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం కోసం అధికార, విపక్షపార్టీలు కోట్లాది రూపాయులు ఖర్చు చేస్తున్నాయని తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తు కుదిరిన తర్వాత పవన్‌కల్యాణ్‌ని ‘దత్తపుత్రుడు’ అని, లోకేశ్‌ని ‘పప్పు’, కొడాలి నానీని ‘గుట్కా’ అని చాలాకాలంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ అవుతున్న సంగతి యావత్‌ ప్రపంచానికి తెలిసిందే. ఇలాంటిపనికి కొంత మంది మీడియా నిపుణుల్ని ఎంపికచేసి రెండు పార్టీల వారూ ప్రచారం చేయిస్తున్నారు. చివరకి అయిదేళ్ల వైసీపీ పాలనను ప్రశంసిస్తూ ఒక సినిమా, విపక్షాల మీద దష్ప్రచారంతో మరో సినిమా ప్రభుత్వ మద్దతుదారులు థియేటర్లలో విడుదల చేశారు. ట్రయిలర్‌ పేరిట కొన్ని, పైరసీ ముసుగులో మరికొన్ని ముక్క ముక్కలుగా ఈ సినిమాల్ని ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. త్వరలో ఈ సినిమాలు పూర్తి స్థాయిలో ఓటీటీల్లోను, ఇతర సామాజిక మాధ్యమాల్లోను విడుదల కానున్నాయి. కొద్దిరోజుల్లోనే వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య ఘటన నేపథ్యంతో విపక్షాల మద్దతుదారులు ఒక సినిమాను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ సినిమా పూర్తిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని నేరస్తునిగా చూపిస్తూ తెరకెక్కించిన సినిమా. ఈ సినిమా మీద వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె మీడియా సమావేశంలో స్పందించారు. దీనిని సినిమా అంటారో డాక్యుమెంటరీ అంటారో నాకు తెలియదు కాని వివేకానంద రెడ్డి హత్య సిబిఐ రిపోర్టు ఆధారంగానే చిత్రీకరించారు. అయినప్పటికీ నిజానిజాలు ఇంకా తీవ్రంగా వున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా తయారీదారులు చాలా ధైర్యం చేశారని ప్రశంసించారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్‌, పోలింగ్‌ తేదీకి మరికొన్ని రోజులు వ్యవధి వుంది. ఈ లోగా సామాజిక మాధ్యమాల్లో ఇంకా అధిక సంఖ్యలో వివిధ చిత్రాలు, వీడియోలు చోటు చేసుకుంటాయని ఊహించొచ్చు. ఇవి ప్రజల్ని ఎంత వేడిక్కిస్తాయో, వారిబుర్రల్లోకి ఎంత వ్యంగ్యానెక్కిస్తాయో అంచనా వేయడం కష్టమే. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం వుందని మీడియా నిపుణులు భావిస్తున్నారు.

సెల్‌: 9393 111 740

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img