London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

సామాన్యులకు దూరంగా రైల్వేలు

  మొత్తం పెట్టుబడి వ్యయం కేటాయింపులు 2023`24లో 2.62లక్షల కోట్లు కాగా ఈసారి ఈ మొత్తాన్ని 2.65లక్షల కోట్లకు పెంచారు. ఇది గొప్పగా పెంచినట్లేమీ కాదు. మొత్తం ఆదాయంలో 2.5లక్షల కోట్లు కేటాయింపు పెద్దమొత్తమేమీ కాదు. నిర్భయ్‌ నిధి నుంచి 200కోట్లు, అంతర్గత వనరుల నుంచి 3వేల కోట్లు, అదనపు బడ్జెట్‌ వనరుల నుంచి 10వేల కోట్లు రైల్వేల కోసం సమీకరించారు. ఈ మొత్తాన్ని ఆస్తుల సమీకరణకు, నిర్మాణానికి, పాత పరికరాల స్థానంలో కొత్తవాటిని ఏర్పరచేందుకు వినియోగిస్తారు. ఈ నిధులు అత్యధికంగా భద్రతా కార్యక్రమాలకు ఖర్చు చేస్తారని మంత్రి వైష్ణవ్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ భారత రైల్వేలు ఇంకా మంచి స్థితిలోలేవని 2024`25 ఆర్థిక సంవత్సరంలో రైల్వేల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుందని అంచనా...

జ్ఞాన్‌ పాఠక్‌

సుదీర్ఘకాలంగా పేదలు, సామాన్యులకు చౌకగా అందుబాటులో సేవలు అందిస్తున్న ఇండియన్‌ రైల్వేల నిర్వహణ విధానాన్ని మోదీ ప్రభుత్వం సమూలంగా మార్చివేసింది. ఇండియన్‌ రైల్వేల బడ్జెట్‌ 2024`25లో ధనికులకు చేరువగా  రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపధ్యంలోనే వందే భారత్‌, వందే మెట్రో, అమృత్‌భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. గతంలో రైల్వే బడ్జెట్‌లు ప్రత్యేకంగా లోక్‌సభలో ప్రవేశ పెట్టేవారు. మోదీ ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చివేసి జనరల్‌ బడ్జెట్‌లో భాగం చేసింది. ఎక్కువ ధరలు ఉండే రైళ్లలో సామాన్యులకు ఒకటి, రెండు బోగీలు తప్పితే గతంలోవలె ప్రయాణానికి అనుకూలంగా ఎక్కువ బోగీలను వేయడంలేదు. రైల్వేలకు సంబంధించి మోదీ ప్రభుత్వం గత విధానాన్ని మార్చివేసి కొత్త పంథాను అనుసరిస్తున్నారు. రైల్వేలలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికే నూతన పంధాను అనుసరిస్తున్నామని  రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌  తెలిపారు. మంత్రి చేసిన ప్రకటనకు విరుద్ధంగా రైళ్ల ప్రయాణం జరుగుతుంది. ఇటీవలి కాలంలో రైళ్ల ప్రమాదాలు భారీ స్థాయిలో ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి. రైల్వేల నిర్వహణలో బలహీనత, అశ్రద్ధ ఉన్నాయని జరుగుతున్న ప్రమాదాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుత బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయానికి రికార్డుస్థాయిలో కేటాయింపులు జరిగినట్లు మంత్రి చెప్పారు. ఈ నిధులలో ఎక్కువభాగం భద్రత కార్యక్రమాలకు ఖర్చుచేస్తామని మంత్రి వైష్ణవ్‌ ప్రకటించారు.
భద్రతాచర్యల అమలుసైతం సవాలుగా మారింది. ఉదాహరణకు భద్రతకు సంబంధించిన ‘కవచ్‌ 4.0’ ప్రవేశపెట్టాలని ఇప్పటికే నిర్ణయం జరిగింది. ఈ విధానం ఆటోమేటిక్‌గా పనిచేసి భద్రతనిస్తాయి.  రైలుభద్రతా వ్యవస్థ రైలు ప్రమాదం జరగకుండా నిలువరించేందుకే ఈ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆమోదించిందేగానీ ఇంతవరకు అమలు జరగలేదు. కవచ్‌లో హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ లాంటివి ఉంటాయి. రైల్వే వ్యవస్థలలో విభిన్న నెట్‌వర్క్‌ ఉంటుందని, అన్ని నెట్‌వర్క్స్‌ను మిళితంచేసి కవచ్‌ను ప్రవేశపెడతామని మంత్రి వైష్ణవ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రయాణీకులకు ఎంతో సౌకర్యంగాఉన్న రవాణా వ్యవస్థకు గతంలో ఎంతో ఆదరణ ఉన్న రైల్వేల పంధాను 2016నుంచి మార్చివేశారు. 2016లోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఉన్న బడ్జెట్‌ను నిలిపివేసి సార్వత్రిక కేంద్ర బడ్జెట్‌లో కలిపివేశారు. అప్పటినుంచి రైల్వేలపై బడ్జెట్‌లో అంత ప్రాధాన్యత నివ్వడంలేదు. 
2017`18ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్‌ జైట్లీ ఉమ్మడి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటినుంచి భారత రైల్వేలకు ప్రత్యేకంగా బడ్జెట్‌ లేదు. అంతేకాదు, మోదీ ప్రభుత్వం భారత రైల్వే వ్యవస్థను అంతిమంగా ప్రైవేటురంగానికి అప్పగించాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలోనే రైల్వే వ్యవస్థ నిర్వహణ విధానాన్నే మార్పుచేశారు. దీనివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడినప్పటికీ ప్రభుత్వం తన పంధాను మార్చుకోలేదు.  కేంద్రంలో రైల్వేల నిర్వహణ కోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఒక మంత్రిని నియమించలేదు. 
	ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను 83 నిమిషాలపాటు లోక్‌సభలో చదివారు. భారత రైల్వేల అంశాన్ని ఆమె ఈ ప్రసంగంలో ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. రైల్వే శాఖనుకూడా చూస్తున్న మంత్రి వైష్ణవ్‌ 2024`25 బడ్జెట్‌లో రికార్డుస్థాయిలో 2.55లక్షల కోట్లు కేటాయించారని చాలా గొప్పగా చెప్పారు. గత సంవత్సరం 2.4లక్షల కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం 5.85శాతం పెంచారని మంత్రి ప్రశంసలు కురిపించారు. పెంచిన మొత్తం 14వేల కోట్లు మాత్రమే. ఏడాదికాలంలో పెరిగిన వ్యయంలో సర్దుబాటుకు మాత్రమే ఈ మొత్తం సరిపోతుంది. సామాన్య లేదా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే రైళ్లకోసం చేసే ఖర్చులో ఈ మొత్తం గొప్ప నిధులేమీకాదు. 
మొత్తం పెట్టుబడి వ్యయం కేటాయింపులు 2023`24లో 2.62లక్షల కోట్లు కాగా ఈసారి ఈ మొత్తాన్ని 2.65లక్షల కోట్లకు పెంచారు. ఇది గొప్పగా పెంచినట్లేమీ కాదు. మొత్తం ఆదాయంలో 2.5లక్షల కోట్లు కేటాయింపు పెద్దమొత్తమేమీ కాదు. నిర్భయ్‌ నిధి నుంచి 200కోట్లు, అంతర్గత వనరుల నుంచి 3వేల కోట్లు, అదనపు బడ్జెట్‌ వనరుల నుంచి 10వేల కోట్లు రైల్వేల కోసం సమీకరించారు. ఈ మొత్తాన్ని ఆస్తుల సమీకరణకు, నిర్మాణానికి, పాత పరికరాల స్థానంలో కొత్తవాటిని ఏర్పరచేందుకు వినియోగిస్తారు. ఈ నిధులు అత్యధికంగా భద్రతా కార్యక్రమాలకు ఖర్చు చేస్తారని మంత్రి వైష్ణవ్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ భారత రైల్వేలు ఇంకా మంచి స్థితిలోలేవని 2024`25 ఆర్థిక సంవత్సరంలో రైల్వేల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుందని అంచనా. ఎందుకంటే నిర్వహణ నిష్పత్తి 98.22శాతం ఉంటుందని అంచనా. 2023`24లో ఇది 98.10శాతంగా ఉంది. 			2024`25 ఆర్థిక సంవత్సరంలో 100శాతం ఆదాయంలో 98.22శాతం ఖర్చు చేస్తారు. ముఖ్యమైన ఖర్చులకోసం ఈ కేటాయింపులు వాస్తవంగా సరిపోవు. అయినప్పటికీ మంత్రి ఇది గొప్ప కేటాయింపుగా వెల్లడిరచారు. రైల్వే ప్రయాణీకుల భద్రత, సౌకర్యాల కల్పన, సౌకర్యంగా ప్రయాణం చేయడానికి తగిన చర్యలకు కేటాయించిన మొత్తం ఏ మాత్రం సరిపోదు. సాధారణ ప్రజలకోసం చేస్తున్న ఖర్చు, కొత్తగా ప్రవేశపెట్టిన ఆధునిక రైళ్ల కోసం చేస్తున్న ఖర్చు చాలా తేడా ఉంది. రైల్వేల ద్వారా వచ్చే ఆదాయం ఖర్చు కంటే చాలా తక్కువగా ఉందని ఇది 2.73లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. గత సంవత్సరం  రైల్వేలనుంచి సాధారణంగా వచ్చే ఆదాయం 3390 కోట్లు కాగా, గతసంవత్సరం సవరించిన అంచనాలు రూ.3271కోట్లు. కేవలం 122కోట్లు మాత్రమే అదనంగా లభించింది. భారత రైల్వేలపై కేంద్రప్రభుత్వం ఎంతశ్రద్ధ వహిస్తున్నదో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. రైల్వేల ద్వారా వస్తున్న ఆదాయం తగ్గినప్పుడు ప్రభుత్వమే ఆ లోటు పూడ్చేందుకు నిధులను అందచేస్తున్నది. కొత్త లైన్ల నిర్మాణానికి 34,602కోట్లు, గేజ్‌ మార్పిడికి 4719కోట్లు, డబ్లింగ్‌(రెండు లైన్లు) కోసం 29,312 కోట్లు, కంప్యూటరీకరణ కోసం రవాణా సౌకర్యాలు  కోసం 375కోట్లు, యార్డు ఆధునీకరణకోసం 8982కోట్లు, రోలింగ్‌ స్టాక్‌ కోసం 24,270కోట్లు ఖర్చు అంచనా వేశారు. రైల్వే బడ్జెట్‌ చాలా బలహీనంగా ఉందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img