London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Sunday, October 20, 2024
Sunday, October 20, 2024

హాస్యాస్పదమైన బీజేపీ సీట్ల పంపిణీ

డా.జ్ఞాన్‌ పాఠక్‌

గతంలో ఏన్‌డీఏలో ఉన్న, కలవబోయే మిత్రపక్షాలతో సీట్ల పంపిణీ వ్యవహారం హాస్యాస్పదంగా తయారైంది. అంతేకాదు, ప్రధాని నరేంద్రమోదీ నియంతృత్వపోకడ పనివిధానం ఇంతవరకు సాగింది. ఇప్పుడు బట్టబయలైంది. బీజేపీ`బీజేడీల మధ్య సీట్ల పంపిణీ బెడిసికొట్టింది. ఒడిశాలోని 39మందితో కూడిన బీజేపీ యూనిట్‌ కేంద్ర నాయకత్వంపై తిరుగుబాటు చేసింది. దేశవ్యాప్తంగా ఎన్‌డీఏ పార్టీలకు, బీజేపీ కేంద్ర నాయకత్వానికి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తడానికి పరిస్థితులు సిద్ధంగా ఉన్నాయి. బీజేపీ, ఎన్‌డీఏల మధ్య విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ బీజేపీ ఒక్కటే 370, ఎన్‌డీఏ అయితే 405 సీట్లు గెలుచుకుంటాయని ఊహాగానం చేస్తున్నారు. ప్రస్తుతం మిత్రపక్షాలు 35సీట్లు గెలుచుకుంటాయని మోదీ అంచనా. అయితే అత్యధిక పార్టీలు పెద్దగా పలుకుబడిలేనివి. అందువల్ల మోదీ ఆశించే మిత్రపక్షాల సీట్లు రావడం చాలా కష్టం. పలుకుబడిగల ప్రధానమైన మిత్రపక్షాలు ఎన్‌డీఏను వదలివేస్తున్నాయి. అంతేకాదు, మోదీ నియంతృత్వం మూలంగా కొన్ని పార్టీలు బీజేపీకి దూరమవుతున్నాయి. మూడోసారి కూడా తానే ప్రధాని పదవిని అలంకరిస్తానని గొప్పలు చెప్తూ పార్లమెంట్‌ను ఎన్నికల ప్రచారసభగా మార్చడం చాలా పార్టీల నాయకులు విభేదించారు. అయితే కాంగ్రెస్‌ను శాశ్వతంగా అధికారానికి దూరంగా ఉంచుతామని చేస్తున్న ప్రచారం తాజాగా తల్లకిందులవుతుందని విశ్లేష కులు కొందరు భావిస్తున్నారు. దీంతో బీజేపీకి దూరమైనపార్టీలను బుజ్జగించేందుకు మోదీ నానా తంటాలు పడుతున్నారు. రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతు న్నాయి. అయితే బీజేపీ, టీడీపీతో తిరిగి పొత్తు కుదరవచ్చునని బీజేపీ ఆశాభావంతో ఉన్నారు. తాత్కాలికంగా చర్చలు నిలిచాయి. తిరిగి చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నారు. మహారాష్ట్ర, బిహార్‌లలో సీట్ల పంపిణీ క్లిష్ట దశకు చేరుకున్నాయి.
ఒడిశా, బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్‌ సాహుల్‌ మాట్లాడుతూ పార్టీ కేంద్ర నాయకత్వంతో తమ రాష్ట్ర బృందం మాట్లాడేటప్పుడు ఏనాడు బీజేడీతో పొత్తు గురించి చర్చించలేదన్నారు. రాష్ట్రంలో తాము తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటుచేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. అయితే బీజేపీ ఎంపీ జాలోరాం మాట్లాడుతూ, ఇతర అంశాలపై మాట్లాడి పొత్తుకుదుర్చుకుంటామని అన్నారు. అయితే కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ దుష్ఫరిపాలన చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ వ్యతిరేక ప్రచారం చేస్తున్నది. అయితే కేంద్ర నాయకత్వం బీజేడీతో పొత్తు కుదుర్చుకోవాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై ఒత్తిడిచేస్తోంది. రాష్ట్ర నాయకత్వం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తోంది. బీజేడీతో పొత్తు కుదరకపోవచ్చునని కూడా అనుకుంటున్నారు. 2009 కి ముందు 11 సంవత్సరాలపాటు బీజేడీ, బీజేపీ కలిసి ఉన్నాయి. అనేక అంశాలపై బీజేపీ పాలనను బీజేడీ సమర్థించింది. 2004లో లోక్‌సభ, విధానసభ ఎన్నికలలో రెండుపార్టీలు కలిసి పోటీచేస్తాయని ఊహించాయి. అయితే ప్రస్తుతం రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీలో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. మోదీ నాయకత్వానికి ఈ విభేదాలు గణనీయంగా పరిగణించవలసిందే. 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం నరేంద్ర మోదీ సూచనలను రాష్ట్ర నాయకత్వం పట్టించుకోలేదు. అయితే మోదీ పేరుమీదే ఎన్నికలు జరిగాయి. మోదీపై రాష్ట్ర నాయకత్వం తిరుగుబాటు చేసిందన్న ప్రచారం సాగుతోంది. అంతిమంగా తిరుగుబాటు సద్దుమణుగుతుందనికూడా భావిస్తున్నారు. అయితే కేంద్ర నాయకత్వం లోకసభ ఎన్నికల కొందరు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే వీరిలో ఒడిశాకు చెందిన ఎంపీలు, మంత్రుల పేర్లుకూడా కనిపించడంలేదు. పార్టీ టిక్కెట్లను తిరస్కరించిన రాజకీయ వాతావరణం మారిపోతుందని అంటున్నారు. మోదీ షాల ఆలోచనలు తిరస్కరించే పరిస్థితి ఏర్పడిరదని ఒడిశా పార్టీలో తలెత్తిన విభేదాలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి తిరుగుబాట్లు ఎన్నికల ఫలితాలపై ఉంటాయని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ ,జనసేనల మధ్య పొత్తు కుదిరిందని టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్‌ ధృవీకరించారు. లోకసభకు, అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లోనూ మూడుపార్టీలు కలిసి పోటీచేయనున్నాయి. అయితే సీట్లపంపిణీ విషయంలో విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో బీజేపీ, శివసేన(షిండే), ఎన్‌సీపీ (అజిత్‌పవార్‌) మధ్య వారం రోజులుగా జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కిరాలేదు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేంద్రనాయకత్వంతో సంప్రదిస్తోంది. స్థూలంగా ఒప్పందం కుదిరిందని భావిస్తున్నప్పటికీ, ఎవరూ ధృవీకరించలేదు. బిహార్‌లో సీట్లపంపిణీ తీవ్ర విభేదాలలో కొనసాగుతోంది. విభేదాలు సద్దుమణిగాయని కూడా ప్రచారం సాగుతోంది. బీజేపీ, జేడీ(యూ), ఉపేంద్ర కుష్వాహకు చెందిన హిందుస్థాన్‌ అవామోర్చా, జితేంద్ర మాంరిa పార్టీ రాష్ట్రీయ లోక్‌జనతాదళ్‌, లోక్‌జనశక్తికి సంబంధించిన రెండుగ్రూపులు ఎవరికివారే ఎక్కువ సీట్లు కోరుతున్నారు. పంజాబ్‌లో సాడ్‌, బీజేపీలు పొత్తు కుదుర్చుకుంటాయని భావించినప్పటికీ రైతుల డిమాండ్లను నెరవేర్చనందున తిరిగి ఉద్యమం జరుగుతున్న నేపధ్యంలో పొత్తు కుదరకపోవచ్చు. హర్యానా లోనూ బీజేపీ జన్‌నాయక్‌ జనతాపార్టీ (జేజేపీ)మధ్య చర్చలు జరుగుతున్నాయి కానీ ఏ విషయమూ వెల్లడికాలేదు. ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాలలో చిన్న చిన్న పార్టీల మూలంగా 35 లోక్‌సభ సీట్లువస్తాయని మోదీ ఆశిస్తున్నప్పటికీ అందులో సగం వచ్చినా మేలేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img