Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

నిజంచెప్పిన అధికారికి మోదీ ఉద్వాసన

జ్ఞాన్‌పాఠక్‌

ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సమాచారం అనేక విధాలుగా చాలా ప్రాధాన్యత కలిగింది. పేదరికం మోదీపాలనలో తగ్గిందని ఆయనప్రభుత్వం చెప్పు కుంటున్నప్పటికీ ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సమాచారంనివేదిక పూర్తిగా వ్యతిరేకించింది. ఈ సమాచారాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా వినియోగించు కుంటే ప్రస్తుతం పరిపాలిస్తున్న మోదీ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోతుంది. మోదీ ప్రతిష్టకు కూడా దెబ్బతగులుతుంది. మానవ అభివృద్ధి విభాగంలోని మోదీ ప్రభుత్వం గొప్పగా సాధించిందేమీ లేదని నివేదిక తెలిపింది. పేదరికం తగ్గించానని, మానవ అభివృద్ధిలోనూ దేశం ముందుందని ప్రధాని మోదీ పదేపదే చెప్పుకుంటారు.

ప్రామాణికమైన నివేదిక ఇచ్చిన అధికారికి ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వాసన పలికారు. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగాలేని, ఆయన ప్రతిష్ఠను దిగజార్చే వాస్తవ నివేదికను ఒక్కనాటికీ ఆయన ఆమోదించరు. తాజాగా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐటిఎస్‌) డైరెక్టర్‌ కెఎస్‌ జేమ్స్‌ను మోదీ సస్పెండ్‌ చేశారు. ఎందుకంటే ఆయనకు వాస్తవాలు నచ్చవు. అందుకనే అనేక అంశాలపై వాస్తవ నివేదికను మోదీ, బీజేపీలు తిరస్కరిస్తాయి. 2014లో అధికారం చేపట్టిన నాటినుంచి కూడా మోదీ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. పైగా త్వరలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు, లోకసభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో మోదీ ప్రభుత్వానికి ప్రామాణిక సమాచారం నచ్చదు. మోదీ తొమ్మిదేళ్ల పాలనాకాలంలో అన్ని రంగాలలో పరిస్థితి దారుణంగా ఉందనే అంశాన్ని వెలుగులోకి రానివ్వరు. క్షేత్రస్థాయిలో మోదీ సాధించింది ఏమీలేదని నివేదికిస్తే ఆయన ఊరుకుంటారా? జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వేలకు(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) సాంకేతిక మార్గదర్శకాన్ని అందించడం, సమన్వయ పరచడానికి నోడల్‌ ఏజన్సీగా ముంబై నుండి ఐఐటిఎస్‌ పనిచేస్తుంది. ఈ నోడల్‌ ఏజన్సీ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలో ఐఐటిఎస్‌ పనిచేస్తుంది. ప్రస్తుతం ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌6 202324కి సంబంధించిన సమాచారం క్రోడీకరిస్తున్నారు. 2024లో జరుగ నున్న లోకసభఎన్నికలకు ముందు వాస్తవమైన సమాచారంతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందచేయడంతోపాటు పుస్తకరూపంలో ప్రచురిస్తుంది. వాస్తవ సమాచారాన్ని అణచివేసేందుకే ఐఐటిఎస్‌ డైరెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. 2018లోనూ ఇలాంటి సమాచారాన్నే క్రోడీకరించారు. 2019 లోకసభ ఎన్నికలకు ముందు నిరుద్యోగానికి సంబంధించిన వాస్తవ సమాచారం నివేదికను ఐఐటిఎస్‌ ప్రచురించడంతో గగ్గోలు పుట్టింది. అంతవరకు ప్రభుత్వం ఈ సమాచారం వెలుగులోకి రాకుండా అణచివేసింది. మీడియాద్వారా దేశంలో నిరుద్యోగం గత 45ఏళ్ల కాలంలో ఏనాడూ ఇంత అధికంగా లేదని ఆ నివేదిక వెల్లడిరచింది. దీనితో అప్పుడు కూడా జాతీయ గణాంక కమిషన్‌ సభ్యులు, ఈ సంస్థ చైర్మన్‌ పిసి.మోహనన్‌ రాజీనామా చేయవలసి వచ్చింది.
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సమాచారం అనేక విధాలుగా చాలా ప్రాధాన్యత కలిగింది. పేదరికం మోదీపాలనలో తగ్గిందని ఆయనప్రభుత్వం చెప్పు కుంటున్నప్పటికీ ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సమాచారంనివేదిక పూర్తిగా వ్యతిరేకించింది. ఈ సమాచారాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా వినియోగించు కుంటే ప్రస్తుతం పరిపాలిస్తున్న మోదీ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోతుంది. మోదీ ప్రతిష్టకు కూడా దెబ్బతగులుతుంది. మానవ అభివృద్ధి విభాగంలోని మోదీ ప్రభుత్వం గొప్పగా సాధించిందేమీ లేదని నివేదిక తెలిపింది. పేదరికం తగ్గించానని, మానవ అభివృద్ధిలోనూ దేశం ముందుందని ప్రధాని మోదీ పదేపదే చెప్పుకుంటారు. క్షేత్రస్థాయిలో పరిశీలన మాత్రమే వాస్తవాన్ని బైటపెట్టగలదు. 2014లో మోదీ అధికారం స్వీకరించడానికి ముందు నిరుద్యోగులందరికీ గౌరవనీయమైన ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ప్రచారసభల్లో అనేక పదులమార్లు హామీ ఇచ్చారు. అయినప్పటికీ 2018 ప్రారంభంనాటికే 45ఏళ్ల కాలంలో ఏనాడూలేని నిరుద్యోగం 6.1శాతానికి పెరిగింది. అందువల్లనే ఆనాడు నిరుద్యోగానికి సంబంధించిన వాస్తవ గణాంకాలను మోదీ ప్రభుత్వం బైట పెట్టలేదు. ప్రస్తుతం నిరుద్యోగిత రేటు 78.4శాతానికి అటుఇటూగా నడుస్తోంది. అలాగే ద్రవ్యోల్బణం, రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువులతోపాటు అనేక వస్తువుల, పరికరాల ధరలు పెరిగి జీవనవ్యయం మెజారిటీ ప్రజలను సంక్షోభంలోకి నెట్టింది. ఈ సంక్షోభంలో 142కోట్ల జనాభాలో 97.6కోట్ల మంది చిక్కుకుని గిజగిజలాడుతున్నారు. వీరు కనీసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా తినలేకపోతున్నారు. ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ఈ విషయాలను థృవీకరించింది. పేదలు, అణగారిన వర్గాల ప్రజలకు ఆరోగ్యరక్షణ అత్యంత ఖరీదైపోయింది. ఈ దారుణ పరిస్థితులు కేంద్ర ప్రభుత్వాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. అందువల్ల ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌6కు సంబంధించిన నివేదికలో ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలని పూర్తిగా బైటపెడుతుంది. పేదరికానికి సంబంధించి వాస్తవ సమాచారాన్ని 201112 జాతీయ గణాంకాల సంస్థ తరువాత ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ మాత్రమే వెల్లడిరచగలదు. నివేదికకు పూర్తి భిన్నంగా అసలు పేదరికమే దేశంలో లేదన్నట్లుగా మోదీ, ఇతర బీజేపీ అగ్రనాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల ప్రపంచఆర్థికసంస్థ(ఐఎమ్‌ఎఫ్‌) విడుదల చేసిన పత్రంలోనూ ప్రభుత్వం వెల్లడిరచిన సమాచారంతో పూర్తిగా విభేదించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెల్లడయ్యే ఏ సమాచారాన్ని అయినా ప్రభుత్వం అంగీకరించదు. ప్రభుత్వానికి అవసరమైన గణాంకాలను మాత్రమే ప్రచారం చేస్తుంది. కొవిడ్‌19 మహమ్మారికి బలైన వారి సంఖ్యను సైతం వాస్తవాలకు భిన్నంగా బైటకు వెల్లడిరచింది. ప్రపంచఆరోగ్యసంస్థ భారతదేశంలో 48లక్షల మంది కరోనా మహమ్మారికి ప్రాణాలు వదిలారని ప్రకటించింది. అయితే మోదీప్రభుత్వం మాత్రం 5లక్షలమంది మాత్రమే మృతిచెందారని ప్రకటించింది.
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ విషయంలో ఐసిఆర్‌(అమెరికా) ఇంకా ఇతర సంస్థలు నిర్దిష్టమైన అంశాలపై సాంకేతిక సహకారం అందించిందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ దఫదఫాలుగా సమాచారాన్ని సేకరించ డానికి ఇఎఫ్‌ఏఐడి, డిఎఫ్‌ఐడి బిల్‌, మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌, యుఎన్‌ఐసి ఇఎఫ్‌, యుఎన్‌ఎఫ్‌పిఏ అలాగే భారత ప్రభుత్వసంస్థ ఆర్థికసహాయాన్ని అందించాయి. వాస్తవ గణాంకాలను తిరస్కరించి ప్రభుత్వం తనకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే వెల్లడిరచడానికి కూడా కొన్ని సమయాల్లో వీలుకాదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను 2024 ఎన్నికలకు ముందు వెల్లడిరచకుండా ఆ తరువాత వెల్లడిస్తుంది. డైరెక్టర్‌ జేమ్స్‌ను సస్పెండ్‌ చేయడం శిక్ష విధించడం కాదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌లో అవకతవకులు జరిగాయని, వాటిపై న్యాయంగా విచారణ జరిపేందుకే ఈ పనిచేశామని ఆ శాఖ తెలిపింది. తమను ఇబ్బందిపెట్టే సమాచారాన్ని సేకరించడంవల్ల రాజీనామా చేయవలసిందిగా జేమ్స్‌నుకోరగా అందుకు ఆయన తిరస్కరించి నట్లు వార్తలు వచ్చాయి. తిరస్కరించడం వల్లే సస్పెన్షన్‌ చేసినట్లుగా కూడా తెలుస్తోంది.
దేశంలో మహిళలు, బాలికల్లో రక్తహీనత పెరిగిపోతోందని ఎన్‌ఎప్‌హెచ్‌ఎస్‌5(201921) నివేదిక తెలిపింది. వీరికి ఆరోగ్యకరమైన ఆహారం లభించడంలేదని పేర్కొన్నది. ఈ గణాంకాలు చూసినప్పుడు దేశంలో పేదరికం తగ్గిందని ఎలా చెబుతారు? దేశంలో బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన ఎక్కడాలేదని భారతప్రభుత్వం చెప్పే అవకాశమేలేదని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌`5 పేర్కొన్నది. ఒకవేళ మరుగుదొడ్లు ఉన్నా నీటి సరఫరాలేక 19శాతం ప్రజలు వాటిని ఉపయోగించడంలేదు. ఒక్క లక్షద్వీప్‌ తప్పితే ఏ రాష్ట్రంగానీ, కేంద్రపాలిత ప్రాంతంగానీ నూటికి నూరుశాతం మరుగుదొడ్లను ఉపయోగించే రాష్ట్రాలు లేవు. హెచ్‌ఐవి, మహిళల అక్రమరవాణా, ఆర్థికవృద్ధి, గృహవినియోగం, వాతావరణ సమాచారం తదితర రంగాలలోనూ అసలు వాస్తవాలను మోదీ ప్రభుత్వం దాచిపెడుతున్నదని తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img