విశాలాంధ్ర, పార్వతీపురం: ఆరునెలల క్రితం బలిజిపేట మండలంలోని చెల్లింపేట గ్రామానికి చెందిన అడపా దేశినాయుడు ఏనుగుల దాడిలో మరణించగా అతని వారసుడు లక్ష్మునాయుడుకి రెండున్నర లక్షల నష్ట పరిహారంనుపార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు చేతులమీదుగా గురువారంతన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారి జి.ఏ.పి.ప్రసూన, రేంజ్ అధికారి పి.త్రినాధరావు, ఫారెస్ట్ సెక్షన్ సిబ్బంది మనోజ్, గౌరీశంకర్ లు, మృతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.