విశాలాంధ్ర – పార్వతీపురం : ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు బోర్డర్ వద్ద ఏర్పాటుచేసిన అడారు చెక్ పోస్టును పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం ఆకస్మిక తనిఖీచేశారు.త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఒడిస్సా రాష్ట్రం నుండి నాటుసారా,గంజాయి ,మాదకద్రవ్యాలు, అక్రమ రవాణాపై ప్రత్యేఖ నిఘాపెట్టి అన్ని రకాల వాహనాలను తనిఖీ చేయాలని తెలిపారు. చెక్ పోస్టు సిబ్బంది అప్రమత్తంగా వుండి అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.అనుమానం ఉన్న, ముందస్తు సమాచారం ఉన్నా తక్షణమే ఉన్నతాధికారులుకు సమాచారం అందించాలని తెలియజేసారు. చెక్ పోస్టులో మరింత నిఘా పెంచాలని ఆదేశించారు.