Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జిల్లా కలెక్టరును ప్రశంసించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

విశాలాంధ్ర,పార్వతీపురం : జిల్లాలో మొబైల్ టవర్ల ఏర్పాటులో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తీసుకున్న చొరవపట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్. జవహర్ రెడ్డి ప్రశంసించారు.
జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్. జవహర్ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహ నిర్మాణం, రీ సర్వే, మొబైల్ టవర్ల ఏర్పాటు, ప్రాధాన్యతా పనులు, జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై సమీక్షించారు. మొబైల్ టవర్ల ఏర్పాటులో చొరవ తీసుకుని స్థలాలను త్వరగా అప్పగించడం పట్ల ప్రధాన కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేసి ప్రశంసించారు. జగనన్న కాలనీలను జిల్లా కలెక్టర్లు సందర్శించి గృహాలు త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. ఆగస్టు నెల చివరి వారంలో రాష్ట్రంలో 5 లక్షలగృహాలు ప్రారంభించడం జరుగుతుందని ఆయన చెప్పారు.
నాభూమి – నాదేశం (మేరి మాటీ – మేరి దేష్), నేలతల్లికి నమస్కారం – నాదేశం కార్యక్రమాన్ని ఈనెల 9న ప్రారంభించాలని ఆయన చెప్పారు. వసుధ వందన్ కార్యక్రమంను గ్రామ పంచాయితీలలో నిర్వహించి కనీసం 75 మొక్కలు నాటాలని ఆయన సూచించారు. పి.ఎం కిసాన్ – ఇ కెవైసి నమోదును ఈ నెల 31 నాటికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. వై.ఎస్.ఆర్ లైఫ్ టైం అవార్డు, వై.ఎస్.ఆర్ అచీవ్మెంట్ అవార్డు లకు ఈ నెల 20వ తేదీ లోగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన అన్నారు. ఆడుదాం ఆంద్రా కార్యక్రమంను అక్టోబరు 2 నుండి నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.
ఈవీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ప్రభాకరరావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజి, గృహ నిర్మాణ సంస్థ ఇన్ ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.రమేష్, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, జిల్లా గ్రామపంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, జిల్లా సహకార అధికారి సన్యాసినాయుడు, జిల్లా పశుసంవర్ధక అధికారి బి. శ్రీనివాసరావు అధికారులు, క్రీడల చీఫ్ కోచ్ ఎస్. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img