Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఖడ్గవలస వద్ద జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

ప్రధాన ముద్దాయిని విలేకరుల ముందు హాజరుపర్చిన జిల్లా ఎస్పీ
విశాలాంధ్ర,పార్వతీపురం/బెలగాం: గతనెల 26న గరుగుబిల్లి మండలం సంతోషపురం పంచాయతీలోగల ఖడ్గ వలస జంక్షన్ దగ్గర ఒంటరి గృహంలో నివసిస్తున్న కిమిడి శ్రీరామమూర్తిఇంటిలో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు ప్రవేశించి శ్రీరామమూర్తిని,అతని భార్య భాగ్యరత్నంను దుండగులు కాళ్ళు చేతులు కట్టి మూతికి ప్లాస్టర్ వేసి బీరువా తాళాలు తెరచి సుమారు 87.5 తులాల బంగారాన్ని దుండగులు దోచుకుపోయిన ఘటన జిల్లాలో సంచలనమైనది. దీనిపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేక దృష్టి సారించి దొంగలను నెలరోజుల లోపై పెట్టుకొని మంగళవారం వారిని విలేకరుల సమావేశంలో హాజరు పరిచారు.జిల్లా ఎస్పీ తెలియజేసిన వివరాల ప్రకారం బాధితుడు కిమిడి శ్రీరామమూర్తి పిర్యాదు మేరకు గరుగుబిల్లి పోలీసు స్టేషన్లో క్రైమ్ నంబరు 35/24యు/ఎస్ 392, 452, ఐపిసిగా కేసు నమోదు చేసి దర్యాప్తు
ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఈకేసును దర్యాప్తు కొరకు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయగా వారంతా ముమ్మారంగా పరిశోధన చేశారని వెల్లడించారు.ఈదొంగతనంకేసులో గరుగుబిల్లికి చెందిన ఒకవ్యక్తి, తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఒకవ్యక్తి, బొబ్బిలికి చెందిన ఒకవ్యక్తి ఈనేరానికి పధకంరచించి పశ్చిమ బెంగాల్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను తెప్పించి ఆఇంటిలో దొంగతనం చేసినట్టు ప్రాధమిక నిర్ధారణకు వచ్చామని తెలిపారు.దీనిలో భాగంగా ప్రధాన ముద్దాయి ఆచూకీని సోమవారం కనిపెట్టినట్లు చెప్పారు. ప్రధానముద్దాయిగా ఉండే శంకరాపు నారాయణ (తండ్రి:గుంపస్వామి,వయస్సు 39) బొబ్బిలి మండలానికి చెందిన అప్పయ్యపేట గ్రామనివాసని , అతడిని సోమవారం బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ దరి రాజాకాలేజీ గ్రౌండ్లో సాయంత్రం 05.15 సమయంలో పోలీసు బృందాలు పట్టుకోవటం జరిగిందన్నారు. అతనివద్ద నుండి దొంగలించబడిన బంగారంలో కొంత భాగమయిన 18.87 తులాల బంగారంను (220.700 గ్రాముల ) స్వాధీనపరుచుకుని, అతను ఇచ్చిన సమాచారం ప్రకారం ఈదొంగతనంలో పాల్గొన్న బెంగాల్ కు చెందిన ముగ్గురు
వ్యక్తులను, గరుగుబిల్లికి చెందిన ఒకరిని, తూర్పు గోదావరికి చెందిన ఒకరిని పట్టుకోవటానికి ప్రత్యేకబృందాలు గాలిస్తున్నాయని ఎస్పీ చెప్పారు. ఈకేసులో దర్యాప్తు బృందాలుగా పాల్గొన్న పాలకొండ డిఎస్పీ జివి క్రిష్ణారావు, పార్వతీపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రవికుమార్, చినమేరంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. మంగరాజు, సిసిఎస్
సిఐ ఎం. అప్పారావు, ట్రైనింగ్ డిఎస్పీ మహమ్మద్ అజీజ్, గరుగుబిల్లి ఎస్ఐ వై. అమ్మనరావు, పార్వతీపురం టౌన్ ఎస్ఐ రవీంద్రరాజు, సిసిఎస్ ఎస్ఐ కళాధర్,
పార్వతీపురం రూరల్ ఎస్ఐ పి. దినకర్, బలిజిపేట ఎస్ఐ పాపారావు, జియ్యమ్మవలస ఎస్ఐ అనీష్, పార్వతీపురం టౌన్ హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్, సిసిఎస్ కానిస్టేబుల్ ఉదయ్, గరుగుబిల్లి కానిస్టేబుల్ – అచ్యుత్, ఐటి కోర్ కానిస్టేబుల్ అనిల్ లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించి
అందరికీ రివార్డులు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img