విశాలాంధ్ర – పార్వతీపురం : మండలంలోని పుట్టూరుగ్రామానికి చెందిన (ఒకే గ్రామానికి చెందిన) ఐదుగురు విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ సీట్లు రావడం గ్రామంలో,మండలంలో అంతా అభినందిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన రెడ్డి శరత్ కుమార్,చినగుడబ యోజిత కర్రిరమ్య,జక్కు. తినీశా,మర్రాపు హేమంత్ కుమార్ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పదోతరగతిలో మంచి మార్కులు సాధించినందున ఈవిద్యార్థులు ట్రిపుల్ ఐటీ సీట్లు వచ్చాయి.గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులకు వచ్చినందుకు ఎంపీటీసీ,సర్పంచ్ , మాజీ సర్పంచ్ యేగిరెడ్డి రమణ మూర్తి, తల్లిదండ్రులు,ఉపాధ్యాయ సిబ్బంది,గ్రామ పెద్దలు వారిని అభినందించారు. ఒకే సంవత్సరంలో ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ సీట్లు రావడం జిల్లాల్లో రికార్డుగా చెప్పుకుంటున్నారు.