Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

పోలింగు కేంద్రాలను పరిశీలిస్తున్న సెక్టోటిరియల్ అధికారులు
విశాలాంధ్ర,సీతానగరం: పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు ,పార్వతీపురం శాసనసభ రిటర్నింగ్ అధికారి ఆదేశాలు మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి తూ. చ తప్పకుండా ప్రతీ ఒక్కరు పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండలఅధికారులు ఎంపిడిఓ ఈశ్వర రావు,తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ రాజేష్ లు తెలిపారు.మే నెలలో జరగనున్న ఎన్నికలకు సంబందించి 24గంటలపాటు పరిశీలన,పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.వివిధ కమిటీలు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.ఎప్పటికప్పుడు జిల్లా అధికారుల ఆదేశాలు, వీడియో కాన్ఫరెన్స్, టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఇస్తున్న అదేశాలు, సూచనలు, సలహాలను పాటిస్తూ మండలంలోని అందరికీ తెలియజేస్తూ ఎన్నికలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.మండలంలోని పోలింగు కేంద్రాలను సెక్టోటిరియల్ అధికారులు, రూటులను రూట్ అధికారులు, నిఘాను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం తనిఖీలను చేస్తున్నట్లు తెలిపారు.గ్రామాల్లోని బిఎల్ఓ లకు తగుసూచనలు తెలియజేసి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలకు చర్యలు తీసుకోవాలని కోరగా వారు కూడా గ్రామాల్లో విధులను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఇదిలా ఉండగా మండలంలోని సెక్టోరియల్ అధికారులుగా నియమించబడిన ఈఓపిఆర్డీ కుమార్ వర్మ, ఎంఈఓలు సూరి దేముడు, వెంకట రమణ, ఆర్ అండ్ బి ఏఈ రామ్మోహన్, ఆర్ డబ్లూ ఎస్ జేఈ పవన్, హౌసింగ్ జేఈ జానకీరామ్,ఇరిగేషన్ అధికారులు ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లులో ఉన్న బ్యానరులు, గోడమీద రాతలు, వాల్ పేపర్స్, పార్టీల నాయకులు చిత్రాలు కలిగిన కరపత్రాలు ఉంటే పరిశీలించి తొలగించే చర్యలు తీసుకుంటున్నారు .గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు,బి ఎల్ ఓలతో పోలింగు కేంద్రాలను నిరంతరం పరిశీలన చేస్తున్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ చిన్నారావు ఆద్వర్యాన పోలీస్ సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు.పార్వతీపురం సీఐ రవికుమార్, ఎస్ఐ రాజేష్ లు గ్రామాలను సందర్శన చేస్తూ శాంతిభద్రతలు గూర్చి వివరిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img