Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి పూరిళ్లు దగ్ధం

విశాలాంధ్ర వలేటివారిపాలెం : ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి పూరిళ్లు పూర్తిగా దగ్దమైన సంఘటన మండలంలోని అమ్మపాలెం గ్రామంలోని ఎస్సి కాలనీలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల కధనం మేరకు అమ్మపాలెం ఎస్సి కాలనీకి చెందిన ఇంద్రకంటి ఎలిసెమ్మ ఇంటిలో వంట చేసుకొనే క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో బయపడి బైటకు పరుగు తీసింది ఈ క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద శబ్దం వచ్చి ఇంటి మొత్తం మంటలు వ్యాపించడంతో చుట్టు ప్రక్కన వాళ్లు గ్రామస్తులు వచ్చి కందుకూరు ఫైర్ ఇంజిన్ వారికి చమాచారం అందించగా ఫైర్ ఇంజన్ వారు
మూలే రామకృష్ణ సిబ్బంది మరియు చెన్నెబోయిన శ్రీనివాసులు కి చెందిన నీళ్ల ట్యాంకర్ కలిగిన ట్రాక్టర్ తో గ్రామస్తులు కలిసి మంటలు ఆర్పివేశారు గ్రామస్తులు తెలిపిన ప్రకారం ఒక లక్షకు పైగా నష్టం ఉంటుందని తెలిపారు. కట్టుబట్టలతో మిగిలిన కుటుంబీకులను ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img