Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

ఉపాధిహామీ పనులు పరిశీలించిన ఏపీఢీ.సంజీవరావు

వలేటివారిపాలెం : జాతీయగ్రామీణ ఉపాధిహామీ పనులను కందుకూరు క్లస్టర్ ఏ.పీ.ఢీ సంజీవరావు పరిశీలించారు. మండలంలోని నేకునాంపురం గ్రామంలో జరిగే ఉపాధి హామీ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును గురించి కూలీలను అడిగితెలుసుకొని కూలీలకు తగుచూచనలు చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పనులకు మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు ఎం త వేతనం వస్తుంది అని వివరాలు కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి కూలీలు ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎండ తక్కువగా ఉన్న సమయంలోనే పనులు ముగించుకొని ఇంటికి వెళ్లాలని పేర్కొన్నారు.కనీసం 4.00గంటలకు తగ్గకుండా పనులు చేసి ప్రభుత్వం నిర్దేచించిన కొలతల ప్రకారం పనులు చేసుకొని ప్రభుత్వం నిర్ణహించిన 272రూపాయలు కూలి పొందాలని అన్నారు. ఉపాధి హామీ పనులు నాణ్యతగా ఉండాలని అన్నారు పనులవిషయంలో రాజీ పడవద్దని చూచించారు జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని పీల్డ్ అసిస్టెంట్ కొల్లూరి ప్రసన్న శ్రీనివాసులు ని ఆదేశించారు . ఈ సందర్బంగా మస్టర్లను పరిశీలించి చదివి వినిపించారు ఈ కార్యక్రమంలొ క్లస్టర్ టీ.ఏ.రమణారెడ్డి, పీల్డ్ అసిస్టెంట్ కొల్లూరి ప్రసన్న శ్రీనివాసులు,మేట్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img