London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

పవన్ కళ్యాణ్ పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తాం

ఎమ్మెల్యే సుధాకర్ బాబు వ్యాఖ్యలపై ఘాటు సమాధానమిచ్చిన జనసేన

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయకుమార్లి

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ అన్నారు. పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే సుధాకర్ బాబు వ్యాఖ్యలను నిరసిస్తూ జనసేన నాయకులు మంగళవారం నాగులుప్పలపాడు జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ఉన్నతమైన సిద్ధాంతాలతో పార్టీని స్థాపించారన్నారు నిత్యం ప్రజా సమస్యలపై గల వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించటం జరుగుతుందన్నారు అలాంటి ప్రజల మనిషి పవన్ కళ్యాణ్ ను ఒక సాధారణ ఎమ్మెల్యే అయిన టీజర్ సుధాకర్ బాబు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ కనీస గౌరవం లేకుండా నాలుక కోస్తా అని అనడం ఎంతవరకు సబబు అన్నారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ను నాలుక కోస్తా అంటే నీ నాలుక ఏమైనా ఇనుప రాడ్డుతో తయారు చేశారా టీజేఆర్ సుధాకర్ బాబు నీ నాలుక కూడా జనసేన సైనికులు కోస్తారని గుర్తుపెట్టుకోవాలనన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని నీ స్థాయి ఏంటో మరిచిపోయి మాట్లాడుతున్నావ్ ఎక్కడో గుంటూరు జిల్లా నుండి ఎర్ర బస్సులో సంతనూతలపాడు వచ్చి ఇక్కడ గెలిచిన తర్వాత నుండి నేటికీ నీవు చేసిన అక్రమాల గురించి చెబుతూ కూర్చుంటే ఒక రోజు కూడా చాలదని అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోనే మద్దిపాడు మండలంలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పరిధిలోనే కొలసనకోట దగ్గర ఇసుక అక్రమ రవాణా చేయడం, డబ్బులు సొంతం చేసుకోవడం నుండి చీమకుర్తి గ్రానైట్స్ లారీల దగ్గర వరకు డబ్బులు వసూలు చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు అక్రమాలకు పెట్టింది పేరుగా కోట్ల రూపాయల దండుకున్నది నిజం కాదా. నువ్వు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకుందా అన్నారు ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డుపెట్టుకొని అందరి కాడికి దోచుకొని దాచుకుంటూ నీ అక్రమ వ్యాపారాలు తెరచాటు వ్యవహారాలు నీచ నికృష్ట పనులు ప్రతిపక్ష పార్టీలు అనేకమంది అనేకసార్లు బట్టబయలు చేసిన నువ్వు నోరు విప్ప లేకపోయావు సుధాకర్ బాబు అంటూ ఘాటుగా జవాబు ఇచ్చారు. అంగన్వాడి ఆయాల, కార్యకర్తల పోస్టుల దగ్గర నుండి నీ స్థాయిలోని ప్రభుత్వ ఉద్యోగాలకు లక్షల రూపాయలు దండుకున్నది నిజం కాదా అని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో మహిళా ఉద్యోగులు అందంగా కనిపిస్తే కాలు కుదురుగా ఉండదని వారిని లోబడుచుకోవటమే నీ పని కాదా ఇవే విషయాలను మీ సొంత పార్టీ నాయకులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారన్నారు ఎమ్మెల్యే వైన నీవు సమస్యలపై వచ్చిన మహిళలను అసభ్యకరంగా మాట్లాడిన విషయం తెలిసి ఆ మహిళ కుటుంబీకులు మీ పార్టీ కార్యాలయం లోకి ప్రవేశించి నీ కారుని ధ్వంసం చేయడం అందరికీ తెలిసిన విషయమేనన్నారు అలాంటి నీవు మా నాయకుడు పవన్ కళ్యాణ్ ను విమర్శించే నైతిక విలువలు లేవన్నారు పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం వాలంటరీ వ్యవస్థలో దుర్మార్గాలున్నాయి అవినీతి జరుగుతోంది సంఘవిద్రోహ కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక ప్రశ్నించడం జరిగిందన్నారు నిజాలు మాట్లాడితే ఎమ్మెల్యే వైన నీవు స్థాయి మరిచి మాట్లాడటం సరికాదని హెచ్చరించారు దుర్మార్గాలు చేస్తున్న కొంతమంది వాలంటరీ ల బుద్ధి ఎమ్మెల్యే సుధాకర్ బాబు బుద్ధి ఒకటే నన్నారు. అయితే వాలంటరీలు సహృదయంతో సేవలు చేయడానికి వచ్చారని చెబుతున్న ఎమ్మెల్యే సుధాకర్ బాబు మీరు కూడా ఈ నియోజకవర్గంలో లో ఏదో ఒక గ్రామం లో వాలంటరీగా పని చేయాలని కోరారు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి వందల కోట్లు అక్రమంగా దండుకొని సంపాదించి ఇక్కడ నుండి దుకాణం సర్దుకుని వెళ్లిపోదామనే తప్ప ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన ఏ కోణంలో లేదన్నారు. అభివృద్ధి చేద్దామని ఆలోచన లేదు పని ప్రశ్నించే వాళ్ళను మాత్రం నాలుక కోస్తా అని సంబోధించడం సరికాదన్నారు నాలుక కొయ్యాల్సింది మొదటగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,ఎమ్మెల్యే సుధాకర్ బాబు నాలుక కొయ్యలన్నారు. మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కానీ జన సైనికులపై కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేన ఒంగోలు కార్పొరేటర్ మలగ రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి పెంట్యాల కోటేశ్వరరావు, మద్దిపాడు మండల అధ్యక్షులు నున్నా బాలసుబ్రమణ్యం, చదలవాడ ఎంపీటీసీ పి శివ కృష్ణ, జనసేన మండల నాయకులు కొణిజేటి ధనుష్, బాలిశెట్టి నాగేశ్వరరావు, తాడి ధనామూర్తి, వెంకటేశ్వర్లు, దిలీప్, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img