మహిళల బాక్సింగ్‌లో ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టోక్యో ఒలింపిక్స్‌లో మేరీకోమ్ ప్రీక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. గురువారం మహిళల 51 కేజీల ప్రిక్వార్టర్స్‌లో కొలంబియా బాక్సర్ వాలెన్సియా చేతిలో 2-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. టోక్యో ఒలింపిక్స్‌లో మొత్తం 9 మంది భారత బాక్సర్లు బరిలోకి దిగారు. ఒలింపిక్స్‌కి అర్హత పొందిన తర్వాత మేరీకోమ్‌తో పాటు బాక్సర్లందరూ ఇటలీకి వెళ్లి మరీ శిక్షణ తీసుకున్నారు. టోక్యోకి కూడా అక్కడి నుంచే మేరీకోమ్ వెళ్లడం విశేషం. ఈ ఒలింపిక్స్‌లో పతకం గెలవడం ద్వారా ఘనంగా కెరీర్‌కి వీడ్కోలు పలకాలని మేరీకోమ్ ఆశించింది.