Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బల్లే..బల్లే.. హర్వీందర్‌..!

ఆర్చరీలో భారత్‌కు కాంస్యం
తొలి పారా అథ్లెట్‌గా హర్వీందర్‌

టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో హర్వీందర్‌ సింగ్‌ కాంస్య పతకం సాధించాడు. కొరియాకు చెందిన పారా అథ్లెట్‌ కిమ్‌ మిను సూతో జరిగిన కాంస్య పతక పోరులో 6-5 తేడాతో ఓడిరచిన హర్వీందర్‌ సింగ్‌ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఇక పారాలింపిక్స్‌లో ఆర్యరీ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారత పారా అథ్లెట్‌గా హర్వీందర్‌ చరిత్ర సృష్టించాడు. హర్వీందర్‌ సింగ్‌ సాధించిన పతకంతో పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య 13కు చేరు కుంది. ఇప్పటిదాకా 2 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించిన ఇండియా… పతకాల పట్టికలో 37వ స్థానంలో నిలిచింది.
మళ్లీ పతకం గెలిచిన అవని
పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళా షూటర్‌ అవని లేఖారా 50 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో కాంస్య పతకం సాధించింది. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన అవని.. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవని సాధించిన కాంస్య పతకంతో ఆమె మరో రికార్డును నెల కొల్పింది. పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది.
ఈ క్రమంలో జోగిందర్‌ సింగ్‌ బేడీ, మరియప్పన్‌ తంగవేలు, దేవేంద్ర రaాజరియా తర్వాత ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన 4వ భారత అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img