Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆధిక్యం దిశగా ఇంగ్లండ్‌

క్రీజులో ఓక్స్‌, ఆండర్సన్‌
ఉమేశ్‌ యాదవ్‌కు మూడు వికెట్లు
బుమ్రా, జడేజాలకు రెండు

ఓవల్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. ప్రస్తుతం క్రీజులో ఓక్స్‌, ఆండర్సన్‌ ఉన్నారు. అంతకుముందు 53/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌ ఆదిలోనే ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలాన్‌ (31), ఒవర్టన్‌ (1)వికెట్లను కోల్పోయింది. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఈ ఇద్దరు పెవిలియన్‌ చేరారు. ముందుగా నైట్‌ వాచ్‌మన్‌ ఓవర్టన్‌ను స్లిప్‌ క్యాచ్‌గా పెవిలియన్‌ చేర్చిన ఉమేశ్‌ యాదవ్‌.. ఆ తర్వాత డెవిడ్‌ మలాన్‌ను కూడా స్లిప్‌ క్యాచ్‌గానే ఔట్‌ చేశాడు. దాంతో 62 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ పీకల్లోతు కష్టాల్లో పడిరది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బెయిర్‌ స్టో, ఓలీపోప్‌ ధాటిగా ఆడుతూ స్కోర్‌ బోర్డు పరుగెత్తించారు. మహమ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టో వరుస బౌండరీలతో దూకుడు కనబర్చగా.. శార్దూల్‌, ఉమేశ్‌ బౌలింగ్‌లోనూ ఓలీ పోప్‌ ధాటిగా ఆడాడు. దాంతో ఇంగ్లండ్‌ 139/5 స్కోర్‌తో లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది. ఈ ఇద్దరి జోరుతో ఫస్ట్‌ సెషన్‌ను ఇరు జట్లు సమంగా పంచుకున్నాయి. ఇక లంచ్‌ బ్రేక్‌ తర్వాత సిరాజ్‌.. బెయిర్‌ స్టోను ఔట్‌ చేసి బ్రేక్‌ త్రూ అందించాడు. బిగ్‌ పార్టనర్‌షిప్‌కు బ్రేక్‌ వేశాడు. ఆ తర్వాత మొయిన్‌ అలీ బ్యాటింగ్‌కు రాగా.. ఓలీ పోప్‌ 92 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో జట్టుకు అండగా నిలిచిన పోప్‌ (81, 6I4)లో ఆదుకున్నాడు. అనంతరం అతడిని ఠాకూర్‌ బౌల్డ్‌ చేశాడు. మరికొంతసేపటికి రాబిన్సన్‌ను జడేజా బౌల్డ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 191 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (96 బంతుల్లో 8 ఫోర్లతో 50), శార్దుల్‌ ఠాకూర్‌ (36 బంతుల్లో 57, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రాబిన్సన్‌కు 3 వికెట్లు దక్కాయి. షమీ, ఇషాంత్‌ల స్థానాల్లో వచ్చిన శార్దుల్‌, ఉమేశ్‌ తమ ఎంపికకు న్యాయం చేశారు. తొలి ఇన్నింగ్స్‌ను ఉత్సాహంగా ప్రారంభించిన ఇంగ్లండ్‌పై బుమ్రా (2/15) నిప్పులు చెరిగాడు. బర్న్స్‌ (5)ను బౌల్డ్‌ చేశాడు. హమీద్‌ (0)ను కీపర్‌ పంత్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. ఉమేశ్‌ అత్యంత కీలకమైన సెంచరీల మాస్టర్‌, కెప్టెన్‌ రూట్‌ (21)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img