శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలు ఈనెల 20వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి సంఘం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం నుండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, తదుపరి విశేష కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు. గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, అమ్మవారికి పంచామృతాభిషేకము, సాయంత్రం ఉయ్యాల సేవ, మహిళలచే శ్రీ లలితా సహస్రనామ పారాయణము, తదుపరి అమ్మవారికి పల్లకి సేవ తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కావున తొగట కుల బాంధవులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.