Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శివానగర్లో షీలా బాల చౌడయ్య(29) అనే చేనేత కార్మికుడు అప్పుల బాధ తాళలేక మంగళవారం రాత్రి ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు… మృతుని తండ్రి లేట్ లక్ష్మీనారాయణ తల్లి మహాలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇందులో పెద్ద కుమారుడు మృతి చెందిన షీలా బాల చౌడయ్య కూలి మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. రెండవ కుమారుడు గిరీష్ బీటెక్ పూర్తి చేశాడు. రెండు సంవత్సరాల కిందట మృతుడు బాలచౌడయ్యకు అదే వార్డుకు చెందిన పద్మావతి తో ఘనంగా వివాహాన్ని జరిపించారు. భార్యాభర్తలు కేశవ నగర్ లో మగ్గాల బిల్డింగులు కూలి మగ్గం చేసుకుంటూ ఉండేవారు. మృతుడు బాల చౌడయ్య వివాహం కోసం కుటుంబ పోషణ కోసం అప్పులు చేయడం జరిగింది. అయితే నేసిన చీరలకు గిట్టుబాటు ధర లభించలేకపోవడం వలన తెలిసిన, తెలియని చోట దాదాపు నాలుగు లక్షలకు పైగా అప్పు చేయడం జరిగింది. ఈ క్రమంలో మృతుడు అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక తరచూ తీవ్ర మనోవేదనకు గురి అయ్యేవాడని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. మంగళవారం భార్య పుట్టింటికి వెళ్ళగా, ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయాన్నే తల్లి మహాలక్ష్మి సోదరుడు గిరీష్లు వేలాడుతున్న బాల చౌడయ్య దృశ్యాన్ని చూచి చలించిపోయారు. తదుపరి కుటుంబ సభ్యులు, స్థానికులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వన్ టౌన్ పోలీసులు తల్లి సోదరులతో ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీసుకొని వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. అన్యోన్యమైన ఈ దంపతులకు సంతానం లేదు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

పరామర్శించిన చేనేత సంఘం నాయకులు:: చేనేత కార్మికుడు షీలా చౌడయ్య మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న చేనేత సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా అధ్యక్షులు పోలా లక్ష్మీనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, నాయకులు రవి వర్ధన్ తదితరులు ఆ ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షీలా చౌడయ్య మృతికి సంతాపం తెలిపారు. అనంతరం చేనేత సంఘం నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా ప్రభుత్వాలు మారిన, కొత్త ప్రభుత్వాలు వచ్చినా చేనేత కార్మికుల యొక్క భవిష్యత్తు అంధకారంగా మారిందని, ఆదుకునే నాధుడు లేక చేనేత పరిశ్రమ కుంటుపడిందని మండిపడ్డారు. చేనేత కార్మికుడు నేసిన చీరకు గిట్టుబాటు ధర లేకపోవడం, పవర్లూమ్స్ లో తయారైన వాటికి పోటీ పడలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, తన పిల్లల్ని చదివించుకోలేక బలవన్ మరణానికి పాల్పడడం చాలా బాధాకరమని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు భరోసా ఇస్తూ, చేనేత పరిశ్రమను అభివృద్ధి పరిచే దిశలో చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img