Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏఐఐఎంఎస్ లో 19వ ర్యాంకు సాధించిన ధర్మవరం విద్యార్థిని.. అంబటి నైమిశా

విశాలాంధ్ర ధర్మవరం:: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 19వ ర్యాంకును శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరానికి చెందిన అంబటి నైమిశా కైవసం చేసుకున్నారు. నాన్న అంబటి నాగరాజు వ్యాపారం, తల్లి అంబటి అర్చన గృహిణిగా ఉంటున్నారు. వీరికి పెద్దమ్మాయి నైమిశా చిన్నతనం నుంచే విద్యపై ఆసక్తి ఉండేదని, ఏఐఐఎం ఎస్ లో 19వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కర్నూలు పుల్లారెడ్డి డెంటల్ కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసిందని, అక్కడ కూడా చదువులో తన ప్రతిభను ఘనపరచడం జరిగిందని తెలిపారు. అంబటి నైమిశా 19 ర్యాంకు సాధించడంతో ధర్మవరం ఆర్యవైశ్యులు, వైద్య బృందం, తోటి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. అంబటి నైమిశా మాట్లాడుతూ తనకు చిన్నతనం నుండి చదువు పట్ల ఎంతో ఆసక్తి ఉందని, కర్నూల్ పుల్లారెడ్డి డెంటల్ కళాశాలలో బీడీఎస్ పూర్తి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. చదువు మీద ధ్యాసతోనే తాను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు పరీక్ష రాయడం జరిగిందని, 19వ ర్యాంకు రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు వారు తెలిపారు. భవిష్యత్తులో తాను పేదలకు అన్ని రకాల సేవలు కూడా అందిస్తానని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు కూతురు అంబటి నైమిశాకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img