Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ముగిసిన సప్త దశ వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలు..ఆలయ అభివృద్ధి కమిటీ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు సప్త దశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ అభివృద్ధి కమిటీ, శ్రీ గణపతి సచ్చిదానంద దత్తత జ్ఞానబోధ సభా ట్రస్ట్, అర్చకుల, భక్తాదులు, దాతలు నడుమ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చివరి రోజు సుప్రభాత సేవ, ద్వాదశ నైవేద్యం, ప్రదక్షిణములు, పుష్పయాగం, మంత్రపుష్పం పలు కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అర్చకులు సుదర్శన ఆచార్యులు, అనిల్ కుమార్ ఆచార్యులు, వారి శిష్య బృందం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుమల తిరుపతిలో నిర్వహించే పద్ధతిలో అర్చకులు నిర్వహించారు. తదుపరి ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ ఈనెల 19 నుండి 24 వరకు కమిటీ భక్తాదులు దాతలు సహాయ సహకారములతో విజయవంతం చేయడం జరిగిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆరు రోజులపాటు తొలుత రక్షాబంధనం యాగశాల ప్రవేశంతో ప్రారంభమై, వివిధ రోజులలో స్వామి వారు పెద్ద, గరుడ, హంస, గజ,సూర్యప్రభ, అశ్వ వాహనములలో పట్టణ పురవీధులలో ఊరేగించ మనీ తెలిపారు. 21వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం వేడుకలు, 22వ తేదీన గ్రామోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించి, భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ కూడా నిర్వహించామని తెలిపారు. అనంతరం ఈ సప్త దశ వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ ఈ వేడుకల్లో ఉభయ దాతలు పేరిటన అర్చకులు ప్రత్యేక పూజలు వనర్చి, వారిని ఘనంగా కమిటీ ఆధ్వర్యంలో సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు. అర్చకులు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి పాంచ రాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు కమిటీ సభ్యులు మెటికల కుల్లాయప్ప, దత్త శివ, బిల్లే నాగప్ప, సాగా సురేష్, శంకర సంజీవులు, రంగా శీనా, గుద్దిటి రామాంజనేయులు, బాల, నాగేంద్ర, స్వామివారి వాలంటీర్స్, అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img