విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో గణిత శాస్త్రమునందు అతిథి అధ్యాపకులుగా పనిచేయుటకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వై. ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గణిత శాస్త్రమునకు అర్హత కలిగిన అధ్యాపకులు నియమిస్తామని, అర్హత ఎంఎస్సీలో గణితం కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఈనెల పదవ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు కళాశాల యందు నిర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొనాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9703151381 కు సంప్రదించాలని తెలిపారు.