Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఆర్య వైశ్యులు అన్ని రంగాలలో మంచి గుర్తింపు పొందాలి..

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.

విశాలాంధ్ర ధర్మవరం:: ఆర్య వైశ్యులు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది మంచి గుర్తింపు పొందాలని, రాజకీయ ఉన్నతికి వైఎస్ఆర్సిపి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తేరు బజార్లో గల ఆర్యవైశ్య కొత్త సత్రములో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు సాయం అందించేందుకు కేతిరెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటాడని, ఇప్పటికే ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను ఆర్యవైశ్యులకు అందించడం జరిగిందని తెలిపారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలను ఆర్యవైశ్యులకు ఇవ్వడం ప్రస్తుత క్యాబినెట్లో వెల్లంపల్లి శ్రీనివాస్ కు చోటు కల్పించడం ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనం అని తెలిపారు. అంతేకాక ఆర్యవైశ్య కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం జరుగుతున్నదని వారు తెలిపారు. అదేవిధంగా ధర్మవరం పట్టణానికి చెందిన వంక దారి భారతిని రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ గా రెండు రోజుల క్రితం ఎంపిక ఇవ్వడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాలలో నవరత్నాల ద్వారా 3,200 కోట్ల నిధులను నేరుగా ప్రజల ఖాతాలో జమ చేయడం జరిగిందని, అదేవిధంగా వివిధ అభివృద్ధి పనులకు 5,635 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. తదుపరి ఆర్యవైశ్యుల పట్టణ ప్రముఖులు మాట్లాడుతూ పట్టణములో నీటి కొరతను శాశ్వతంగా తీర్చి అభివృద్ధికి పరుగులు పట్టిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డికి వైఎస్ఆర్సిపి పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని వారు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను ఆర్యవైశ్యులంతా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు కౌన్సిలర్ పెనుజూరు నాగరాజు, కోఆప్షన్ సభ్యుడు భూశెట్టి రామకృష్ణ, పెనుజూరు సుధాకర్, ఆర్వేటి కిషోర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కలవల మురళీధర్, వంకదారి వెంకటేశ్వర్లు, కలవల రామ కుమార్, వాసవి క్లబ్ ఫౌండర్ కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రతినిధి సుకుమార్ గుప్తా, అంబటి శ్రీధర్, డాక్టర్ వేణుగోపాల్, పోడమల రాగిణి, మంజు సంయుక్త కలవల తేజ అంబటి అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img