Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అధికార వేధింపులు తాల లేక హౌసింగ్ ఏఈ బాలాజీ ఆత్మహత్యాయత్నం

విశాలాంధ్ర ధర్మవరం:: అధికార వేధింపులు తాళలేక హౌసింగ్ ఏఈ బాలాజీ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. వివరాలకు వెళితే ధర్మవరం మునిసిపాలిటీలో ఏఈ గా పని చేస్తున్న అన్నం బాలాజీ అధికారుల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విధులలో భాగంగా కార్యాలయానికి వెళ్లి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు బాటిల్ తీసుకొని అక్కడే తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. తోటి ఉద్యోగులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని పోలీసులకు చేరవేగా వారు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. తన కుటుంబ సభ్యులు, తాను ఎందుకు ఆత్మహత్యాయత్నం పాల్పడిన విషయం వీడియోల ద్వారా సోషల్ మీడియాలో దావానముల వ్యాపించింది. హౌసింగ్ ఏఈ బాలాజీ యొక్క భార్య వనిత మాట్లాడుతూ హౌసింగ్ పీడీఈ మరో కిందిస్థాయి ఉద్యోగులు తరచూ ఏ కారణము లేకుండా వేదించే వారిని, తదుపరి హౌసింగ్ పీడీ శంకర్ లాల్ భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిడి కార్యాలయంలో పనిచేసే మరో కిందిస్థాయి ముగ్గురు ఉద్యోగులు కూడా ఏదో ఒక రకంగా బాలాజీ…. నీవు ధర్మవరంలో ఉండకూడదు అన్న తీవ్ర మనోవేదనకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసే వారిని భార్య తెలిపింది. చివరికి వీరు వేధింపులు తాళలేకే నా భర్త బాలాజీ ఆత్మహత్యానికి పాల్పడ్డారని, నా భర్తకు ఏమైనా అయితే పూర్తి బాధ్యత వారే వహించాలని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రులు నారా లోకేష్ సత్య కుమార్ దిష్టికి తీసుకొని వెళ్లి తనకు న్యాయం జరిగేంతవరకు తాను పోరాడుతానని తెలిపారు. తన భర్త ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన వారిని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img