Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

మున్సిపల్ పన్నులపై వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకోండి…

మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: మున్సిపల్ పరిణులపై వడ్డీ మాఫీని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆదా చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్తి, కాలీజాగా, నీటి పన్నులు, దీర్ఘకాలిక పన్నులు ఈనెల 31వ తేదీ లోపు ఏక మొత్తంగా చెల్లించినట్లయితే వడ్డీ మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ఉత్తర్వులు మేరకు ఈ అవకాశం కల్పించబడిందని తెలిపారు. ఈ వడ్డీ మాఫీ పొందాలంటే పన్ను చెల్లింపు దారులు బకాయి ఉన్న మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరముతో సహా ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కేవలం ఆరు రోజులు గడువు ఉన్నందున ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. మీరు కట్టదలచిన పనులను మున్సిపల్ ఆఫీస్ వసూలు కౌంటర్ నందు కానీ, సంబంధిత వార్డు సచివాలయాలలో గాని, ఆన్లైన్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్/ క్రెడిట్ కార్డుల ద్వారా, యూపీఐ ద్వారా కానీ చెల్లించవచ్చును అని తెలిపారు. అంతేకాకుండా పన్ను చెల్లింపులను ఎల్పీ సర్కిల్ నందు గల సచివాలయము పార్థసారధి నగర్-2 సచివాలయము, గీతా నగర్ సచివాలయం వద్ద చెల్లించవచ్చునని తెలిపారు. సెలవు రోజులలో కూడా ఈ పన్ను చెల్లింపు కేంద్రములు పనిచేస్తాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img