Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

సేవారత్నం పురస్కారం అందుకున్న కన్నా వెంకటేష్

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం పట్టణంలో రెడ్ క్రాస్ సొసైటీ అనే స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసి అతి కొద్ది సంవత్సరాలలోనే ప్రజల మన్ననలు పొంది మంచి గుర్తింపును పొందిన ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులు కన్నా వెంకటేష్ జన సేవా సొసైటీ ఆధ్వర్యంలో సేవారత్నం పురస్కారమును అందుకున్నారు. ఇటీవల అనంతపురం పట్టణంలో కేఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ జన సేవా సొసైటీ ఆధ్వర్యంలో యూత్ పార్లమెంట్ జరిగిన జన సేవా రత్నం పురస్కారంలో ధర్మవరం కి చెందిన కన్నా వెంకటేష్ చేస్తున్న రక్త దాన సేవలకు గాను ముఖ్య అతిథులుగా విచ్చేసిన సత్య కుమార్.. బిజెపి నేషనల్ కార్యదర్శి, జన సేవా సొసైటీ వ్యవస్థాపకులు ఆదిశేషు చేతులు మీదుగా జనసేవ యూత్ పార్లమెంట్ అవార్డు జ్ఞాపక ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. అనంతరం కన్నా వెంకటేష్ మాట్లాడుతూ నా ఈ సేవా కార్యక్రమాలను గుర్తించి ఇటువంటి అవార్డు ఇవ్వడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డు నా రక్త బంధం ఆర్గనైజేషన్ సంస్థకే దక్కుతుందని తెలిపారు. నా ఆర్గనైజేషన్కు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించి ప్రజల హృదయాలలో, బాధితుల హృదయాలలో మంచి గుర్తింపు పొందేలా చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. నేనెప్పుడూ ఏ సమయంలో పిలిచినా వచ్చి రక్తదానం చేస్తారని తెలిపారు. రక్తదానం అవసరమైన వారికి నా సాయి శక్తుల రక్తాన్ని అందించి ప్రాణాన్ని నిలబెట్టడమే నా లక్ష్యము అని తెలిపారు. రక్తదాన విషయములో అపోహలను ప్రతి ఒక్కరూ విడనాడాలని తెలిపారు. అన్ని దానముల కన్నా రక్తదానం మిన్న అని, రక్త దానమునకు విలువ కట్టలేమని, అది పునర్జన్మతో సమానమని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img